DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్ లైన్ లో ఆంధ్రాతో  మాటా మంతీ: మోడీ నోట విశాఖ రైల్వే జోన్ మాటే రాలేదు

ఆన్ లైన్ లో ఆంధ్రా తో  à°®à±‹à°¡à±€ మాటా మంతీ: నిరుత్సాహం లో ఉత్తరాంధ్ర పార్టీ కేడర్ 

విశాఖపట్నం, జనవరి 2 , 2019 (DNS Online ): బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కు హామీ ఇచ్చిన విశాఖ

కేంద్రంగా రైల్వే జోన్ ఎప్పుడు ఇస్తారు అంటూ విశాఖ 26 à°µ వార్డు అధ్యక్షుడు రమేష్  à°­à°¾à°°à°¤ ప్రధాని నరేంద్ర మోడీ à°•à°¿ సంధించిన ప్రశ్నకు 
ఆయన సమాధానం దాటేసారు. 
ఆంధ్ర

ప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ మరోసారి ఝలక్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కార్యకర్తలతో బుధవారం ఆన్ లైన్ లో మాటా మంతీ జరిపిన భారత ప్రధాన

మంత్రి నరేంద్ర మోడీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ గురించిన మాటే నోరెత్తలేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో మరింత ఉత్సాహం నింపేందుకు బుధవారం బీజేపీ

ఏర్పాటు చేసిన ఆన్ లైన్ లో మాటా మంతీ కార్యక్రమాన్ని న్యూ ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ మాట్లాడారు. దీనిలో కాకినాడ, మచిలీపట్టణం, నరసాపురం. విశాఖపట్నం, విజయనగరం

కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వేదికల నుంచి కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు అయన సమాధానం చెప్పారు. దీనిలో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలోని సాయిప్రియ రిసార్ట్స్

వేదికగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ముందుగా మాజీ కేంద్ర మంత్రి డి. పురంధేశ్వరి ప్రధానికి సభలో పాల్గొన్నవారిని పరిచయం చేశారు. అనంతరం సీనియర్ బీజేపీ నాయకులూ

పివి చలపతిరావు యోగ క్షేమాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 

విశాఖ కు మోడీజీ రిక్త హస్తమే చూపారు: 
విశాఖ కార్యకర్తలతో మాట్లాడే అవకాశం రావడం తో నగరానికి చెందిన 26

వ వార్డు అధ్యక్షుడు రమేష్ బీజేపీ గురించి అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీలు కించపరిచేలా మాట్లాడుతున్నారని, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఎప్పుడు

ఇస్తారో తెలియచేస్తే వాళ్లకి గట్టిగా గుణపాఠం చెప్తామని à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు అయన కప్పగెంతుడు సమాధానం ఇచ్చారు. చట్టం లో చెప్పినట్టు  à°ªà°¦à°¿ జాతీయ విద్యా సంస్థలను

ఇప్పడికే ఇచ్చేశామని, కేంద్రం నుంచి అన్ని రకాల సహాయం చేస్తున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పనందుకు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.

చట్టం లో ఉన్నవాటికి మించి సంస్థలను ఇచ్చామని,  à°—à°¤ నాలుగేళ్ల లో దేశంలోని మారే ఇతర రాష్ట్రానికి ఇన్ని సంస్థలు ఇవ్వలేదని తెలిపారు. 
అంతే గానీ విశాఖ కేంద్రంగా

రైల్వే జోన్ అనే పదం కూడా ప్రధాని వెంట రాక పోవడంతో స్థానిక పార్టీ క్యాడర్ కాస్త నిరాశకు లోనయ్యారు. 

ఆంధ్ర లో పాలనా అంతా అబద్దాల కోరు : 

ఆంధ్ర ప్రదేశ్

కు ఇచ్చిన హామీలను, చట్టపరంగా రావాల్సిన హక్కులను నెరవేరుస్తామని మోడీ ప్రకటించారు. అయితే కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్థానికంగా ఉన్న చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని, స్వాహా చేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు చంద్రబాబు నుంచి ప్రజలకు చేరడం లేదు. ఆంధ్రాలో నాలుగు వైపులా అబద్దాలు

ప్రసరింపచేశారని, దానికి త్వరలోనే గట్టిగా ప్రజలే బుద్ది చెప్తారన్నారు. సత్యమేవ జయతే అనే పెద్దల నానుడి నిజమవుతూ  à°Žà°²à±à°²à°ªà±à°ªà±à°¡à±‚ నిజమే

గెలుస్తుందన్నారు. 

రాష్ట్రం లో వెనకబడిన జిల్లాలకు వెయ్యి కోట్లు రూపాయల నిధులు ఇవ్వడం జరిగిందని, ఇవన్నీ ఎక్కడికి పోయాయో స్థానిక పాలకులనే

ప్రశ్నించాలన్నారు. వీటిని వాళ్ళు సక్రమంగా వినియోగించలేదని మండిపడ్డారు. 
పోలవరం ను à°’à°• జాతీయ ప్రాజెక్ట్ à°—à°¾ ప్రకటించామని, ఇప్పడి వరకూ  7000 కోట్లు విడుదల

చేశామని, రాష్ట్ర ప్రభుత్వం కేర్ టేకర్ à°—à°¾ ఉంటా అంటే ఒప్పుకున్నాం. కానీ à°ˆ భాద్యతలను నిర్వహించకుండా  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ విఫలం చెందిందన్నారు.

రాష్ట్ర అభివృద్ధి

భారతీయ జనతా పార్టీ శక్తివంచన లేకుండా పాటుపడుతూ సహాయ సహకారాలు అందిస్తుంటే అడుగడుగునా నిధులను స్వాహా చేస్తూ, విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ, గతంలో

కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఎన్టీ రామారావు ఆలోచనలకూ విరుద్ధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు (

తెలుగుదేశం పార్టీ)  à°•à°¾à°‚గ్రెస్ తో చేతులు కలిపిందన్నారు. 

విశాఖ వేదిక వద్ద నగర అధ్యక్షుడు ఎం. నాగేంద్ర, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, సీనియర్ నాయకులూ పివి

నారాయణ రావు, 
విజయనగరం లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యవరాహల ఇంచార్జి సునీల్ దేవవధర్, నరసాపురం లోని

వేదిక వద్ద రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #viswanadha raju  #vizag  #bjp  #narendra modi  #puradheswari  #polavaram  #visakha railway zone

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam