DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చుక్కల ఆపరేషన్ శివాజీకి చుక్కలు చూపిస్తుంది: బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్

విశాఖపట్నం, జనవరి 3 , 2019 (DNS Online ): చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెరపైకి వచ్చే సినీ నటుడు శివాజీ చుక్కల భూముల సమస్య పేరిట రంగ ప్రవేశం చేశారని బీజేపీ

రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ అభిప్రాయ పడ్డారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ అయినదానికీ, కానిదానికీ బీజేపీ పై

అబాండాలు వేసే శివాజీకి అయన తెరపైకి తీసుకు వచ్చిన చుక్కల ఆపరేషన్ అతనికే చుక్కలు చూపిస్తాయన్నారు.  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన పరిణామాలు

తెలుగు ప్రజలందరికీ తెలుసునని, ఇప్పుడు కొత్తగా శివాజీ వచ్చి, వెన్నుపోటు అంశం పై చెప్పిన అంశాలు హాస్యాస్పదంగానే ఉన్నాయన్నారు. 

ప్రజా సమస్యగా గుర్తించి

పోరాటం చెయ్యడం మంచిదేనని, అయితే  à°•à±Šà°‚దరు రెవిన్యూ ఉన్నతాధికారులు, à°’à°• మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత కుట్రలు పన్ని చుక్కల భూముల సమస్య పరిష్కారం కాకుండా

అడ్డుకొని ,12 లక్షల మంది ఓటర్లను టీడీపీ కి దూరం చేసేందుకు కుట్ర జరిగిందని, గుంటూరు జిల్లాలో రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు

సన్నద్ధం  à°šà±‡à°¶à°¾à°°à°¨à°¿ చెప్పడం చూస్తుంటే రాజకీయ రంగు అద్దినట్లు స్పష్టమౌతోందన్నారు. 

రాజకీయాలకతీతంగా మాట్లాడవలసిన చుక్కల భూముల అంశం పక్కదోవ పట్టిపోయే

ప్రమాదం ఏర్పడింది. 2014 ఎన్నికల ప్రచార సమయంలో  à°šà±à°•à±à°•à°²à±, డీకేటీ భూములను క్రమబద్దీకరించి 6 లక్షల ఎకరాల రైతులకు అమ్ముకొనే హక్కులు కల్పించి న్యాయం చేస్తానని

చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2017 మే 1న చుక్కల భూముల చట్టం (ఆక్ట్ నెంబర్ 10/2017), జీఓఎంఎస్ నెంబర్ 298, తేదీ: 17-7-2017 లను విడుదల చేసి 12 సంవత్సరాల అనుభవం

వున్న రైతులకు క్రమబద్దీకరించమని ఆదేశాలిచ్చిందని తెలిపారు. 

అయితే ఈ విషయంలో రెవిన్యూ శాఖ దారుణంగా విఫలమై ప్రజలకు ఇంకా ఖర్చులు, తీవ్ర మనోవేదనను

కలిగించడం తప్ప ఒక్క శాతం కూడా న్యాయం చెయ్యలేకపోయింది. 12 సంవత్సరాల అనుభవం మాట దేవుడెరుగు 100 సంవత్సరాల అనుభవం ఉన్నట్లు రికార్డులు సమర్పించిన వారికి కూడా

న్యాయం జరుగలేదు. దీనితో ప్రజలలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిన మాట నిజమేనన్నారు. 

ఇదిలావుండగా 1954 కు ముందు అసైన్ చేసిన (డీకేటీ పట్టాలిచ్చిన)

భూములను నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22-A) నుండి తొలగించాల్సిందిగా ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 575, తేదీ: 16-11-2018  à°µà°¿à°¡à±à°¦à°² చేసింది. ఇది చుక్కల భూముల

జీవో కంటే దారుణంగా విఫలమైందని తెలిపారు. 

1954 కు ముందు అసైన్ చేసిన భూములను 30 రోజుల్లో  22-A నుండి తొలగించమని ప్రభుత్వం ఆదేశిస్తే తాపీగా మా వద్ద రికార్డులు లేవు,

మేమేమీ చేయలేమని రెవిన్యూ శాఖ చేతులెత్తేసింది. కానీ ఒకవైపు రికార్డులు లేవంటూ మరోవైపు చుక్కల భూములను అసైన్డ్ (డీకేటీ) భూములని చెప్పి రెవిన్యూ శాఖ వేల

సంఖ్యలో ప్రజల అర్జీలను తిరస్కరించి, ప్రభుత్వానికి మాత్రం పరిష్కరించినట్లు చెప్పడం దుర్మార్గం మన్నారు. 

ఇంతవరకూ బాగానే వుంది కానీ ఈ మొత్తం సమస్య

పరిష్కారం కాకపోవడానికి కారణం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, కొందరు రెవిన్యూ ఉన్నతాధికారులు, ఒక మాజీ మంత్రి అని శివాజీ చెప్పడం హాస్యాస్పదం అనుకోవాలని

అభిప్రాయపడ్డారు. 

ఎందుకంటే ఎవరో కుట్రలు పన్నితే బాబు ప్రభుత్వంలోని అధికారులు వంత పాడుతున్నారని చెప్పడం చూస్తుంటే చంద్రబాబు అధికారులతో పని

చేయించలేని అసమర్థుడనే అర్థం వస్తుందని, 40 సంవత్సరాల అనుభవం ఏమైందన్న అనుమానం à°’à°• వైపు మరో వైపు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని తెలిపారు. 

నిజానికి

చంద్రబాబు చుక్కల భూముల హామీ నెరవేర్చేందుకు 4 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేయాల్సివచ్చిందో   చెప్పాలన్నారు. అసైన్డ్ భూముల విషయంలో ఎన్నికల హామీ à°’à°• రకంగాను

తీరా జీవో ఇచ్చేటప్పుడు 1954 కు ముందు అసైన్ చేసిన భూములని మాట మార్చడం నిస్సందేహంగా ప్రజలను మోసగించినట్లే అని చెప్పవచ్చన్నారు. 

1954 కు ముందు అసైన్ చేసిన

పట్టాలలో విక్రయించరాదన్న నిబంధన లేని కారణంగా వాటికి 22-A (నిషేధం) వర్తించదని 2008-18 కాలంలో హై కోర్టు కొన్ని వందల కేసుల్లో తీర్పు చెప్పింది అలాంటప్పుడు ఇదే విషయంపై

జీవో విడుదలకు బాబు నాలుగున్నర సంవత్సరాలు ఎందుకు తాత్సారం చేశారో శివాజీ చెప్పాలి, లేదా బాబునే ప్రశ్నించాలి. అసలు చుక్కలు, డీకేటీ భూముల తతంగం వెనుక ప్రతిపక్ష

నేత కుట్ర వుండే అవకాశం ఎక్కడుంది? అంటే మన అసమర్థతను ఎవరిపైనో నెట్టి రాజకీయాలు చెయ్యడం క్షమించరాని నేరమన్నారు. 

ఇక్కడ చెప్పాల్సిన అసలు రహస్యం ఏమంటే 2014

ఎన్నికల హామీని బాబు నెరవేర్చలేక , రైతులను మోసగించాడ, తాను అధికారంలోకొచ్చిన 30 రోజుల్లో నిషేధిత భూముల అంశం పరిష్కరించి చుక్కలు, డీకేటీ భూముల రైతులకు న్యాయం

చేస్తానని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత జగన్ ప్రకటించనున్నట్లు తెలుసుకొన్న బాబు నష్ట నివారణ చర్యల్లో భాగంగా శివాజీని రంగంలోకి దింపినట్లు

స్పష్టంగా తెలుస్తోందన్నారు. 

ఇక చుక్కల భూముల అంశం గురించి మాట్లాడుతూనే శివాజీ ఎన్టీఆర్ వెన్నుపోటుకు సంబంధించిన అంశం గురించి మాట్లడడం, అది కూడా

చంద్రబాబుకు అనుకూల వ్యాఖ్యానాలు చెయ్యడం శివాజీ చేసిన ఘోర తప్పిదం. ఎందుకంటే చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని కాంగ్రెస్ పార్టీ లేదా ఎవరో

కాంగ్రెస్ నేతలు మాట్లాడివుంటే అనుమానించవచ్చు కానీ సాక్ష్యాత్తు ఎన్టీఆర్ గారే స్వయంగా అనేకసార్లు మీడియా సమక్షంలో మాట్లాడిన విషయం కాదని శివాజీ, బాబుకు

కిరీటం పెట్టినంత మాత్రాన ఒరిగేదేమీవుండదన్నారు.

 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #suhasini anand  #Shivaji  #supreme court  #Chukkala Operation 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam