DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజ యోగిని జానకి దాది రాక తో పునీతం కానున్న సాగర  తీరం. 

జనవరి 5 ,6 తేదీల్లో బ్రహ్మకుమారీస్ రజతోత్సవాలు
విశాఖపట్నం, జనవరి 4, 2019 (DNS Online ): ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారీ సంస్థ అధ్యక్షులు రాజ యోగిని జానకీ

దాది రాక తో విశాఖనగరం పునీతం కానుందని, బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం ప్రతినిధి రమక్క తెలిపారు. శుక్రవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ బ్రహ్మకుమారిల 
రజతోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న శుభ సందర్బంగా విశాఖ నగరం లో నిర్మించిన హార్మనీ హౌస్ భవనాన్ని

అధ్యక్షులు జానకి దాది చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖ నగరం లో జరిగే రజతోత్సవాలను అత్యంత వైభవంగా

నిర్వహించనున్నామన్నారు. నాలుగంస్థుల ఈ భవనం లో రాజ యోగ జ్ఞాన శిబిరాలు, సాంఘిక, సామాజిక, ఆధ్యాత్మిక విద్య తో పాటు, యువత, మహిళలు, చిన్నారులు, రైతులు, సైనికులు, వర్తక

వాణిజ్య వర్తకులకు ఉచిత రాజయోగ  à°¶à°¿à°•à±à°·à°£à°¾ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. 
రాజస్థాన్ లోని మౌంట్ అబూ లో ఉన్న తమ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి

అధ్యక్షులతో పాటు, ప్రముఖ రాజ యోగులు, ముంబై నుంచి మహారాష్ట్ర జోన్ ఇంచార్జి రాజ యోగిని సంతోషి దీదీ, హైదరాబాద్ గచ్చి బౌలి లో శాంతి సరోవర్ రిట్రీట్ కేంద్రం

సంచాలకులు రాజయోగిని కులదీప, ఇతర ప్రముఖులు హాజరవుతున్నట్టు తెలియచేసారు. రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం తో విశాఖనగరం పులకించిపోతుందన్నారు.

కార్యక్రమాల్లో భాగంగా జనవరి 6 à°¨ సాయంత్రం 
నగరానికి చెందిన ప్రముఖులు, అనేక మంది బ్రహ్మకుమారీలను కలుసుకుని ప్రేరణాత్మక సందేశాలను ఈ కార్యక్రమం ద్వారా

అందించనున్నారని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర వాసులు పాల్గొని, తరించవలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల

శ్రీనుబాబు మాట్లాడుతూ, బ్రహ్మకుమారీస్ సంస్థ పాత్రికేయులకు చాల మంచి సహకారం అందిస్తున్నారని, ప్రతి సంవత్సరం రాజస్థాన్ లోని మౌంట్ అబూ లో జరిగే అంతర్జాతీయ

మీడియా సదస్సులకు క్రమం తప్పకుండ విశాఖ పాత్రికేయులకు అవకాశం కల్పిస్తూ, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తున్నారన్నారు. ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు

పాత్రికేయ రంగం నుంచి సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం సంస్థ రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సర క్యాలండర్ ను విడుదల చేశారు.ఈ విలేకరుల సమావేశం లో సంస్థ

ప్రతినిధులు రాజయోగిని కులదీప, శివలీల,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #brahmakumaris  #janaki dadi  #didi  #silver jubilee

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam