DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయ దేవాలయ వ్యవస్థ ఒక విజ్ఞాన కేంద్రం :  సామవేదం షణ్ముఖ శర్మ 

ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు నేటికీ జరుగున్నాయి 

సకల శాస్త్ర సార నిర్మాణమే దేవాలయం. 

విశాఖపట్నం, జనవరి 5, 2019 (DNS Online): భారతీయ దేవాలయ వ్యవస్థ యావతూ

ఒక విజ్ఞాన గని అని, అది తెలుసుకోవాలంటే ఒక మనిషి జీవితం చాలదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శనివారం నగరం లోని పౌర గ్రంధాలయం లో సంస్కార

భారతి సంస్థ అద్య్వర్యవంలో భారతీయ దేవాలయ వ్యవస్థ - వైభవం అనే అంశం పై ఏర్పాటు చేసిన ఘన శ్యామల స్మారకోపన్యాసాన్ని ఆయన అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

సమాజం లో అన్ని సమానమే అనే నినాదం కేవలం రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం చేసేది మాత్రమేనన్నారు. హైందవ ధర్మం పై ఏమాత్రం అభిమానం, విశ్వాసం, గౌరవం

లేనివారు అధికారం ఉన్నందునే ఈ దేశం లో ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయన్నారు. ప్రధానం గా ఇతర మతాలకు చెందిన వారు భారత దేశాన్ని దెబ్బ తియ్యడం కోసం ముందుగా

దృష్టిపెట్టింది హిందూ ఆలయ వ్యవస్థ మీదే అన్నారు. ఆలయాల పై ప్రజల్లో అవాకులు, చెవాకులు ప్రచారం చేసి, ప్రజల నమ్మకం పై దెబ్బకొట్టారన్నారు. తదుపరి మతమార్పిడి

చేపట్టి, లక్షలాది హిందూ దేవాలయాలను నిర్దాక్షిన్యంగా కూల్చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న ఇతర మతాల నిర్మాణాల పునాదులపై హిందూ దేవాలయాలే ఉంటాయన్నారు. వీటి పై

నోరెట్టేందుకు ఏ ఒక్క రాజకీయ నేతకూ, ప్రభుత్వాలకు నోరు రాదన్నారు. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మూల కారణమన్నారు. ఈ దేశంలో హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం

రావాలి అంటే రాజకీయ వ్యవస్థ మారాలన్నారు. ఆగమాలు మామూలు రచనలు కాదని, ఒక్కో దేవీ దేవతలా ఆరాధనలు, వాటి ప్రభావం ప్రకారం ఆయా ఆగమాల్లో చెప్పిన విధంగా వాస్తు

ప్రకారం ఆలయాల నిర్మాణం జరుగుతాయన్నారు. ఒక ఆలయం, ఒక పురుష ఆకారంలో కనిపిస్తుంది. ఆలయాన్ని ఎవరి ఇష్టానుసారంగా కట్టేవి కాదని, ఆగమం ప్రకారం

నిర్మించినవేనన్నారు. ఆలయం అనేవి విశ్వాస కేంద్రాలు కాదు, విజ్ఞాన కేంద్రాలే. నిర్మాణ వైఖరి లోనే తెలుస్తుందని తెమిలియచేసారు. దేవాలయం లో ప్రదక్షిణ చేసే సమయం లో

ఆలయ ప్రాకారాలపై శిల్ప సంపద దర్శన మిస్తుందని, 
వాటి శిల్ప నిర్మాణ సౌందర్యం ద్వారా ఆలయ నిర్మాణం వైభవం తెలుస్తుందని వివరించారు. మ్లేచ్చుల దాడుల కారణంగా 
/> శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళ ప్రభావంతో దక్షిణాది ప్రాంతాల్లో దేవాలయ వ్యవస్థ ఇంకా నిలిచి యుందన్నారు. మధురై, తిరుమల, కంచి, తంజావూరు, చిదంబరం తదితర ఆలయాల గోపురాలు,

ప్రాకారాలపై  à°¨à°¾à°Ÿà±à°¯ శాస్త్రం లోని అన్ని కళలూ దర్శనమిస్తాయని వివరించారు. అన్ని ఆలయాలూ ఒకే విధంగా చూడరాదని. వైష్ణవ క్షేత్రాలు వేరు, కాశీ క్షేత్రం దర్శనం

ద్వారా జ్ఞాన, తిరుమల భోగం. ధన సంపద ఇబ్బందులు దోష నివృత్తి à°•à°¿ కొన్ని ఆలయాలు, మనశాంతిని కల్గించేవి కొన్నిఆలయాలు ఉన్నాయన్నారు.  à°µà±ˆà°µà°¿à°§à±à°¯à°‚ కల్గిన ( డైవర్సిటీ)

విధానం ఆగమాలు ద్వారా ప్రజలకు తెలుస్తుందన్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో విధమైన ప్రతిష్టలు, స్వయంభు గా, ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హిందూ ఆలయాలను ఒకే విధంగా

 à°‰à°‚డేవారని, వాటిని ప్రతిష్ఠా ప్రకారం ఆరాధనలు చెయ్యడం జరుగుతుందన్నారు. 
అన్ని మతాలూ ఒకే విధంగా ఉండవని, వాటి నియమాలు వేరు, కేవలం రాజకీయ కోణంలోనే అన్నిమతాలూ

ఒకటే అనే నాటకాలు మొదలుపెట్టారని, దీనికి నిదర్శనమే హిందూ ధర్మాలపై కోర్టులు తప్పుడు తడకలు తీర్పులు ఇచ్చేస్తున్నారన్నారు. ఒక్కో ఆలయంలో నియమం ఒక్కో రకంగా

ఉంటుందని, ఒక ఆలయం సౌమ్యంగాను, మరొకచోట ఉగ్ర రూపం లోను, మరొక చోట ప్రసన్నవదనం తోనూ ఇలా ఉంటాయన్నారు. ఒక ఆలయం లో ఉన్న నియమాల ప్రకారం దీక్ష తీసుకున్న భక్తులు, తమ

ధర్మ పత్ని ని కూడా మాతృ భావం తో చూసే ధర్మం హైందవ సంప్రదాయమన్నారు. ఒక ఆలయం నడుస్తోంది అంటే ఎన్నో కోణాల్లో పరిశోధనలు చేయాలన్నారు. ఉదాహరణకు ... ఒక రాగి తీగ లో

విద్యుత్ ప్రసరిస్తున్నప్పుడు కేవలం ఎలక్రికల్ పై నైపుణ్యం ఉన్నవారే ఆ తీగ ను ముట్టుకోవాలని, అదే ఆ తీగలో విద్యుత్ ప్రసారం లేకపోతె ఆ తీగను ఎవరైనా

ముట్టుకోవచ్చన్నారు. 

అందరి క్షేమం కోసం నియమాలు పెట్టి, ఎవరు చెయ్యగలిన సేవలు వారు చెయ్యగలిగే విధంగా నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. అదే విధంగా ఆలయంలో

ఎన్నో సామాజిక వర్గాల వారికి వారు చెయ్యగలిగిన సేవలను వారికి అవకాశం లభిస్తుందన్నారు. అర్చనా విధానం తెలిసిన వారు, అర్హత ఉన్నవారు గుడి లోపల అర్చనలు, యజ్ఞ

యాగాదులు చేస్తుంటారని, పూమాలలు కట్టగలిగిన వారు, అలంకారాలు, వస్త్ర సంపదను నేసే వారు, ఉత్సవ వేడుకలు, ప్రసాద తయారీ,  à°µà°¿à°¤à°°à°£, చేసేవారు, ఇలా అన్ని సామాజిక వర్గాల

ప్రజలకూ అవకాశం ఉన్న ఏకైక విధానం ఆలయ వ్యవస్థ అని అన్నారు. వీరందరికీ భగవంతుడు ఒకే విధంగా అనుగ్రహాన్ని అందిస్తున్నాడన్నారు. అంతర్గతం లో జరిగే అర్చనలు వలెనే

ఆలయం లో వైభవం పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఆలయ ఏర్పాటు, నిర్వహణలో ఎన్నో అంతర్గత విషయాలు నిగూఢమై యుంటాయన్నారు. à°ˆ సమావేశం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ  à°¨à°—à°°

అధ్యక్షులు, డాక్టర్ à°Žà°‚. విజయ గోపాల్,  à°¸à°‚స్కార భారతి ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #viswanadha raju   #visakhapatnam  #vizag  #sanskara bharati  #samavedam shanmukha sharma

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam