DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శివపదం - సుబ్రహ్మణ్యుని నోట షణ్ముఖుని పాట

గాంధర్వ గానం లో శివ సంకీర్తన యజ్ఞం

సామవేదం వారి  à°¶à°¿à°µà°ªà°¦à°‚ తో పరవసించిన విశాఖ 

విశాఖపట్నం, జనవరి 6, 2019 (DNS Online): గాన గంధర్వునిగా ప్రసిద్ధికెక్కిన ఎస్పీ బాల

సుబ్రహ్మణ్యం నోట పలికిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ ఆర్తితో రచించిన శివపదం సంకీర్తనలతో విశాఖ నగరం పరవశించింది. ఆదివారం సాయంత్రం ఆంధ్ర

విశ్వ కళాపరిషత్ ఉత్సవరంగం లో జరిగిన à°ˆ మహా యజ్ఞం లో ఎస్పీ బాలు కు సహకార గానం ఆయన సోదరి ఎస్పీ శైలజ, అయన కుమారుడు ఎస్పీ చరణ్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± అందించారు. కైలాసనాధుని

సంకీర్తనాధుని ప్రమాద గణాల సాక్షిగా శివ పార్వతులకు గాన సంకీర్తనం చేశారు. ఒక ప్రక్క రసవత్తరంగా గానం సాగుతూంటే, మరో ప్రక్క ప్రవచనా ప్రసంగం ప్రవాహంలో

ఉవ్వెత్తున సాగింది. 
అమ్మ చేతి పసుపు బొమ్మ, ఆగమాలు సారమా అనే కీర్తనతో శైలజ కార్యక్రమాన్ని ఆరంభించారు. పరమాత్ముని స్మరణ తోనే ప్రపంచాన్ని విస్మరించానని,

మౌనాన్ని, జ్ఞానాన్ని ఆశ్రయిస్తే అలౌకిక ఆనందం కలుగుతోందని వివరించారు. ఎన్నడూ వివని గీతమైన, స్వీయ స్వరకల్పనతో శంభో శివా శివా గీతాన్ని బాలు, చరణ్ తో కలిసి

ఆలపించారు. భజరే సాంబ శివమ్- మానసా ఆత్మ జ్ఞానం పాటను బాలు- శైలజ, చరణ్ కలిసి అత్యద్భుతంగా ఆలాపనం చేశారు.  à°µà±€à°°à°¿ గానామృతానికి ప్రవచన సామ్రాట్ సామవేదం ప్రవచనం

కలవడంతో సాక్షాతూ కైలాసాన్ని విశాఖ నగరానికి దిగి వచ్చిందా అనే అనుభూతి ఆహూతులందరికీ లభించింది. 

సుబ్రహ్మణ్యుని నోట షణ్ముఖుని పాట :

సుబ్రహ్మణ్యుని

నోట షణ్ముఖుని పాట వినిపించడం నభూతో న భవిష్యత్ గా మారిపోయింది అనడం అతి శయోక్తి కాదు. సామవేదుని అక్షరానికి గాంధర్వ గానం తోడు కావడం సంతోష సాగరాన్ని

అందించింది.  à°ˆ సంకీర్తనా యజ్ఞానికి బాలు సంగీత సహకార వాయిద్య కారులు రవిశంకర్, పాల్ రాజ్, జోగారావు, సిద్దు, ప్రవీణ్, సాయి, ఫణి, కృష్ణమూర్తి, స్వామి లు అందించిన

సంగీతం ఆహూతులను ఆనందడోలికల్లో ఓలలాడించింది. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరాకారుడైన శివుని వర్ణన ఈ సంకీర్తనలతో వెల్లువెరిసిందన్నారు. లోకానికి

పిచ్చివానిలా అగుపించే శివుడు అందరికీ సహాయకారి అని అభివర్ణించారు. ఇంట పిచ్చి సామిని నేనెక్కడా చూడలేదని, ప్ పరమేశా, జగదీశా ఇత్యాది గీతాలు పరాశానికి

పరాకాష్టగా నిలుస్తాయన్నారు. 

లౌకిక జీవితం నుంచి బయటపడి శివుని అనుగ్రహం పొందడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్య ఫలమేనని తెలిపారు. పెదరాయుడు చిత్రంతో ఢమ - ఢమ

గీతంతో గీత రచన ఆరంభించి, శివునితోనే ప్రయాణం సాగించడం జరిగిందన్నారు. మంజునాథ చిత్రం లో ఈ పాదం శివపాదం, స్వరాభిషేకం లో రమా వినోదం తదితర గీతాల్లో సైతం

శివానుగ్రహమే లభించడం పూర్వ జన్మ సుకృతమని తెలిపారు.  à°‹à°·à°¿à°ªà±€à° à°‚ ప్రతినిధులు మధిర రాజశేఖర్ సంధాన కర్తగా వ్యవహరించిన à°ˆ కార్యక్రమం లో నగరవాసులు పెద్ద సంఖ్యలో

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #samavedam shanmukha sharma  #SP balu  #Sivapadam  #convocation hall

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam