DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కపిల్ దేవ్ చే టి 10 క్రికెట్ విజేతలకు బహుమతి ప్రదానం: ఎంవివి 

విశాఖపట్నం, జనవరి 6, 2019 (DNS Online): గత నెల రోజులుగా నిర్వహించిన టి 10 క్రికెట్ పోటీల విజేతలకు భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం

జరుగనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ ఎంవివి సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోను యువకులకు టి 10 క్రికెట్ పోటీలు

నిర్వహించామని,  à°®à±Šà°¤à±à°¤à°‚ 500 జట్లు దరఖాస్తు చేసుకోగా   
300 జట్లకు అవకాశం కల్పించామన్నారు. ఈ పోటీలలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం కు చెందిన వంశీకృష్ణ వారియర్స్

విజేతలుగా నిలిచి రెండు లక్షల రూపాయల బహుమతి ని సాధించారన్నారు. రెండవ స్థానంలో నిలిచిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం జట్టు లక్ష రూపాయల బహుమతిని పొందగా, మూడవ

స్థానంలో భీమిలి క్రికెట్ జట్టు నిలిచి 50 వేల రూపాయలు బహుమతిని గెలుచుకున్నారన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #dnslive  #YSR congress  #MVV  #Cricket league  #Kapil Dev  #Gurajada

కపిల్ చేతుల మీదుగా

పురస్కారాలు.:

à°ˆ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం మంగళవారం (జనవరి 8, 2019 )  à°¸à°¾à°¯à°‚త్రం 6 గంటలకు నగరం లోని సిరిపురం లో à°—à°² గురజాడ కళాక్షేత్రం లో జరుగుతుందన్నారు. à°ˆ

కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్యానా హరికేన్ గా ప్రఖ్యాతి గాంచిన కపిల్ దేవ్ హాజరవుతున్నారన్నారు. అయన నాయకత్వంలోనే

భారత దేశం మొట్ట మొదటి సారిగా ప్రపంచ కప్ క్రికెట్ పోటీల విజేతగా (1983 లో) నిలిచిందన్నారు. అయన చేతుల మీదుగానే à°®à±Šà°¤à±à°¤à°‚ 5 లక్షల రూపాయలు విలువచేసే మొదటి, ద్వితీయ, తృతీయ

స్థానాల జట్లకు, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్సమెన్, మాన్ ఆఫ్ ది సిరీస్, తదితర ప్రోత్సాహక బహుమతులను అందించనున్నట్టు తెలిపారు. రానున్న కాలంలో ఇతర క్రీడంశాలనూ

ఆదరిస్తూ, మరిన్ని క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. 
కార్యక్రమానికి అతిధులుగా స్వామి స్వరూపానంద, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స

సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి  à°µà°¿à°œà°¯à°¸à°¾à°¯à°¿ రెడ్డి, విశాఖపట్నం పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల

కన్వీనర్లు, తదితరులు హాజరుకానున్నట్టు స్పష్టం చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam