DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చక, ఆలయాల పూర్వ వైభవానికి కృషి చేస్తా : చెఱువు రామకోటయ్య

అర్చక, ఆలయాల పూర్వ వైభవానికి కృషి చేస్తా : 

అర్చక సమస్య నివేదిక కమిటీ లోకి రామకోటయ్య 

DNS తో రామకోటయ్య ప్రత్యేక ఇంటర్వ్యూ 
       
విశాఖపట్నం, జనవరి

7, 2019 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అర్చకులు, ఆలయాల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకు వచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అర్చక సమస్యల పరిశీలనా కమిటీ

సభ్యులు చెఱువు రామకోటయ్య తెలిపారు. సోమవారం భారతీయ జనతా పార్టీ కి రాజీనామా చేసిన అర్చకులు, ఆలయాలు అభ్యున్నతికి కృషి చేసేందుకు ముఖ్యమంత్రి తనకు ఒక భాద్యతను

అప్పగించినట్టు తెలిపారు. à°ˆ సందర్బంగా ఆయన DNS  à°•à± ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భవిష్యత్ కార్యాచరణ తెలియచేసారు. 

కూల్చిన ఆలయాలు పునర్నిర్మాణం :

ఇటీవల విజయవాడ

ప్రాంతంలో రహదారి విస్తరణల కోసం నిర్ధాక్షిణ్యంగా కూల్చిన హిందూ ఆలయాల పునర్నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయా దేవీ దేవతల విగ్రహాలను తిరిగి ప్రతీష్ట

చేయించే విధంగా కృషి చేస్తానన్నారు.  

అర్చకుల జీతాల కోసం కృషి :

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అర్చకులకు కనీస వేతనం పది వేల రూపాయలను యధాతధంగా

అమలు చేసే విధంగా సూచనలు చేస్తామని రామకోటయ్య తెలియచేసారు. అర్చకుల పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని, ఆలయాల్లో కనీస ధూప దీప నైవేద్యాలను కూడా అర్చకులు

భరించవలసి గతిలో వందలాది ఆలయాలు ఉన్నాయన్నారు. ఒక ప్రక్క వాటి నెలవారీ ఖర్చులను తట్టుకోలేక, కుటుంబ పోషణ చెయ్యలేని దుస్థితిని ఈ రాష్ట్రం లో అర్చకులు

అనుభవిస్తున్నారన్నారు. వారందరికీ ఆర్ధికంగా అభ్యున్నతి కల్గించే విధంగా కృషి చెయ్యడమే తన తోలి ప్రాధాన్యమన్నారు. 

దుర్భర స్థితిలో ఆలయాలు : 

చాలా

ఆలయాల్లో గర్భాలయాలు అత్యంత ఇరుకుగాను, గాలి వెలుతురూ కూడా రాలేనంత ఇరుకుగాను ఉన్నాయని, దీంతో అర్చకులు నానా అవస్థలు పడుతున్నాయన్నారు. వాటికి మరమ్మత్తులు

చేయించి, విద్యుదీకరణ చేయించి, ఆలయాలను ఆధునీకరణ చేయించేందుకు సూచనలు చెయ్యడం జరుగుతుందన్నారు. 

కూడు, గూడు ప్రధాన ప్రాధాన్యత :

రాష్ట్రం లోని అన్ని

ప్రభుత్వ, ప్రయివేట్ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చకులకు నెలవారీ వేతనాలతో పాటు, నివాస యోగ్యమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఏర్పాటు చెయ్యడం

జరుగుతుందన్నారు. కుటుంబ పోషణకు ఇబ్బంది లేనట్టయితే ఆలయాల్లో అర్చనలు లోటు లేకుండా చెయ్యగలుగుతారన్నారు. 

అర్చాకేతర సిబ్బందికి ప్రోత్సాహకాలు

:

అర్చకులతో పాటు, అర్చాకేతర సిబ్బంది కూడా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, కమిటీ నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఆలయాల్లో సహాయక సిబ్బంది

à°•à°¿ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా పరిశీలనా చేయనున్నట్టు తెలిపారు. 

మతమార్పిడి లకు వ్యతిరేకం...:

మతం అనేది వ్యక్తులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని,

దాన్ని ఎవరికీ వారు పాటించుకునేది అని, దాన్ని బలవంతంగా ప్రక్కవారి పై రుద్దడం తప్పు అన్నారు. ఇటీవల హిందూ ఆలయాల వద్ద బలవంతపు మాట మార్పిడులు జరుగుతున్నట్టు

తెలుస్తోందని, అటువంటి వాటిని అరికట్టేందుకు తగిన సూచనలు చెయ్యడం జరుగుతుందన్నారు. 

ఆలయ భూముల పరిరక్షణకు కృషి :

రాష్ట్రంలో ఉన్న వందలాది దేవాలయాలను (

ఏ, బి, సి లుగా ) మూడు కేటగిరీలుగా విభజించడం జరిగిందని, వాటిల్లో ఏ విభాగం లో ఉన్న ఆలయాలకు తగినంత నిధులు, ఆదాయం ఉంటుందని, వాటికి ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. అయితే

బీ, సి విభాగాల్లో ఉన్న ఆలయాలకు మాత్రం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు, భూముల పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక సి విభాగం ఆలయాలు,

ప్రయివేట్ ఆలయాలకు ఆర్ధిక లోటు విపరీతంగా ఉందని, వాటిపై ముందుగా ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #vizag  #visakhapatnam  #viswanadha raju  #rama kotayya  #narendra modi  #andhra pradesh 

#telugudesam
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam