DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయ పార్టీల భవితకు నెలరోజులే గడువు. . . .

ఫిబ్రవరి నుంచి ఎన్నికల కోడ్ లో బందీ కానున్న ఆంధ్రా . . . 

విశాఖపట్నం, జనవరి 7, 2019 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ బ్రతుకును బస్టాండ్ చేస్తారా . . . బంగారం చేస్తారా అనే దానిపైనే

రాజకీయ పార్టీల భవిష్యత్ పూర్తిగా ఆధార పడి ఉంది. మరో నెలరోజులు మాత్రమే ఈ పార్టీలకు గడువు మిగిలి ఉంది, వచ్చే నెల ఫిబ్రవరి 9 న రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నికల

నోటిఫికేషన్ విడుదల కానుంది, ఫిబ్రవరి మూడవ వారం తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. దీంతో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులూ చేపట్టే అవకాశమే

ఉండదు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష హోదాకూడా సాధించని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్,

ఇంకా పుట్టని జనసేన పార్టీల పరిస్థితి కుడితి లో పడిన ఎలకల్లా మారిపోయాయి. 

కళ్ళున్న కబోది బీజేపీ :
భారతీయ జనతా పార్టీ పై కోట్లాది మంది ఆంధ్ర ప్రదేశ్

ప్రజలు నమ్మకం పెట్టుకుంటే, విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని భారీగా హామీలు గుప్పించి, అనంతరం వాటిని వమ్ము

చేసి పూర్తిగా మోసం చేసింది. దీంతో బీజేపీ పై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం పోయింది. మూడు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రా ప్రజలు విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం

చేస్తుంటే, కనీసం దానిపై బీజేపీ నోరు కూడా మెదపక పోవడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రానున్న నెల రోజులు లోగా ఈ రైల్వే జోన్ పై నరేంద్ర మోడీ కనీసం నోరు

విప్పి వివరణ ఇచ్చే అవకాశమే లేకపోవడంతో, ఆ పార్టీ ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కనుమరుగుకు సిద్ధంగా ఉండిపోయింది. మోడీ చేసిన ఈ మోసపూరిత వైఖరిని తట్టుకోలేని కరడు కట్టిన

భారతీయ జనతా పార్టీ నాయకులూ, కార్యకర్తలు, పార్టీ à°•à°¿ రాజీనామాలు చేసేసారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలలో  à°•à±Šà°¨à±à°¨à°¿ నెరవేర్చిన, ప్రధాన డిమాండ్లుపై కనీసం నోరు కూడా

ఎత్తక పోవడం తో కళ్ళు ఉన్నప్పడికీ కబోదిలాగా à°ˆ పార్టీ మారిపోయింది. 

కుళ్ళబొడిచిన కాంగ్రెస్ :

తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర

ప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించి, బిల్లులో ఒక్క విషయం కూడా సరిగ్గా చేర్చకుండా రాష్ట్రాన్ని పూర్తిగా కుళ్ళబొడిచేసింది. కనీసం లోటు బడ్జెట్ లో విడగొట్టబడిన

రాష్ట్రాన్ని అనాధగా వదిలేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అనేది అక్షర సత్యం. దీనికి ప్రతిఫలంగా నేటికీ ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకే కాదు

కార్యకర్తలు కూడా లేరు అన్నది వాస్తవం. దీంట్లోని అధిక సంఖ్యలో కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. 
కేవలం 17 సీట్ల కోసం ఆరున్నర కోట్ల ఆంధ్రలను నరకకూపం

లోకి తోసేసి, కనీసం వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి కూడా సమయం వెచ్చించని నేతలున్న పార్టీ ఇది. కేంద్రం లో అధికారం లోకి వస్తే ఆంధ్రా కి ప్రత్యేక హోదా ఇచ్చేస్తా

అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నాడు. అధికారం పూర్తిగా ఉన్ననాడే విభజన బిల్లు లో చేర్చడం చేతగాని వాళ్ళు, మరోసారి అధికారం వస్తే

చేస్తా అని కల్లిబొల్లి కబుర్లు చెప్తుంటే నామమెందుకు ఆంధ్ర ప్రజలు అమాయకులు, చేతగాని వాళ్ళు కాదు అని వాళ్లకి ప్రతి సారి తెలియచేస్తున్నారు. 

పూర్తిగా

అవకాశవాది తెలుగుదేశం :
ఈ దేశ చరిత్రలో పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అన్నది అక్షర సత్యం. అందివచ్చిన ఏ ఒక్క

అవకాశాన్ని వదిలిపెట్టకుండా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారిపోయింది పార్టీ తెలుగుదేశం. ఇది ఇటీవల తెలంగాణ లో జరిగిన శాసన సభ

ఎన్నికల్లో దేశం మొత్తం ప్రత్యక్షంగా చూసింది. కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పడేసిన

ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ మంత్రులే వ్యతిరేకించారు, అయినా గతి లేని, దిక్కులేని పరిస్థితుల్లో బాబు మాటలకూ భయపడి, బద్ద వ్యతిరేకి

కాంగ్రెస్ తో నడవ వలసి వచ్చింది. గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇంతవరకూ చంద్రబాబు

నేతృత్వంలో  à°¤à±†à°²à±à°—ుదేశం చరిత్రలో ఒక్కసారి కూడా à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ ఏ ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేసిన దాఖలాలు లేవు, రెండుసార్లు భారతీయ జనతా పార్టీ, మరో రెండు సార్లు వామ

పక్షాలతోనూ, ఇలా à°’à°•à°°à°¿ చూరు పట్టుకుని ఎన్నికలకు వేళ్ళాడే తప్ప à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ వెళ్లే ధైర్యం ఉన్నట్టు లేదు. 

వైఎస్సార్ కాంగ్రెస్ కు  à°ªà±à°°à°£à°¾à°³à°¿à°•

లేదు...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం, ప్రణాళిక లేక పోవడం పెద్ద లోటు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ లోని రోడ్లు

పట్టుకుని కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లడమే తప్ప ఒక నిబద్దత కల్గిన ప్రణాళిక, చిత్తశుద్ధి లేకపోవడం అత్యంత బాధాకరం. యువకుడు, అధికార అనుభవం లేనివాడు

కావడంతో, పెద్ద దిక్కుగా ఉండవలసిన నేతలు, తమ సొంత వ్యాపారాలు, వ్యవహారాలూ చక్కదిద్దుకోడానికే సమయం వెచ్చించడం దురదృష్టకరం. పైగా పాద యాత్రల్లో ఒక జిల్లా పర్యటన

ముగిసిన తదుపరి à°’à°• ప్రాంతంలో పత్రిక సమావేశం నిర్వహించి, à°† జిల్లా సమస్యలపై తానూ తీసుకోబోయే నిర్ణయాలను ప్రకటించవలసి యుంది.  à°† విధంగా ఎక్కడా జరగలేదు, పైగా ప్రతీ

సభలోనూ జగన్ చేత సొంత డబ్బా కొట్టించడమే ఈ పార్టీ కి పెద్ద నెగటివ్ ప్రచారంగా మారిపోయింది. పాడిందే పాడరా . . . పాచిపళ్ళ అన్న చందాన, ప్రతీ సభలోనూ వైఎస్ జగన్ తో ఒకే

విషయాన్ని వందసార్లు చెప్పించడం పార్టీ నేతలు చేసిన ప్రధాన తప్పిదం. దీంతో ప్రజల్లో ఒక హ్యేయ భావన కూడా వచ్చేసింది. కష్టించి పనిచేసే కార్యకర్తలకు తగిన

గుర్తింపు ఇవ్వకుండా, కేవలం డబ్బులు ఉన్నవాళ్లకే పదవులు కట్టబెట్టడం తో పార్టీలో పూర్తి నైరాశ్యం నెలకొంది. మొదటి నుంచీ జెండా మోసిన వాళ్ళు నేటికీ అవే జండాలే

మోస్తుండడం,  à°ªà°¾à°°à±à°Ÿà±€à°¨à°¿, జగన్ ను భరించరాని బూతులు తిట్టినవాళ్ళకి కన్వీనర్ పదవులు కట్టబెట్టడం వైఎస్ జగన్ చేసిన ఘోరమైన తప్పిదం. దీనికి ప్రతిఫలం అందే రోజు అతి

దగ్గరలోనే ఉంది. 

ఇక మిగిలిన పార్టీలు ఎన్ని గంటలు బ్రతికి ఉంటాయో వాళ్ళకే తెలియని స్థితి నెలకొంది. వీళ్లందరి పైనా ప్రజలు ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలేదు.

అయినప్పటికీ ఎన్నికల సమయానికి వీళ్ళు కూడా ఫలితాలను కొంత మేర ప్రభావితం చెయ్యవచు అనే అంచనాలు ఉన్నాయి. 

ఈ రాజకీయ పార్టీలు రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో తాము

బ్రతికి ఉండాలి అంటే రానున్న 30 రోజులూ బంగారు బాటు లాంటివే. వీటిని సద్వినియోగం చేసుకోకుంటే వాటికి ఇక à°ˆ నేలపై నూకలు చెల్లినట్టే. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam 

#vizag  #political parties  #congress  #telugudesam  #ysr congress  #bjp  #janasena

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam