DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి కి శాశ్వత చిరునామా వై ఎస్ జగనే : మంత్రి గంటా 

జగన్ నీదగ్గర ఉన్న అక్షయ పాత్ర గురించి చెప్పు :

ఐదేళ్ల లో జగన్ ఆస్తుల  à°°à±‡à°Ÿà±à°²à± 770 ఎలా పెరిగాయి, చెప్తే మేము పాటిస్తాం : à°—à°‚à°Ÿà°¾ 

వైఎస్ సీఎం కాక ముందు,

తర్వాత జగన్ అని పిలవాలి. 

శుక్రవారం కోర్టు పక్షి కూడా బాబుని వెటకారం చేయడమేనా ?

విశాఖపట్నం, జనవరి 8, 2019 (DNS Online): ప్రపంచంలో అత్యంత ధనికుడు మైక్రోసాఫ్ట్ అధినేత

బిల్ గేట్స్ ఆస్తులు కూడా పెరగనంత వేగంగా  à°µà±ˆà°Žà°¸à± జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు 770 రేట్లు ఎలా పెరిగాయో బహిర్గతం చెయ్యాలని రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు డిమాండ్

చేశారు. మంగళవారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ అవినీతికి శాశ్వత చిరునామా వైఎస్ జగనే అన్నారు. ఇంటర్నెట్ లో

అవినీతి అనే పదానికి అర్ధం వెతికితే వెంటనే వచ్చే పేరు  à°µà±ˆà°Žà°¸à± జగన్ మోహన్ రెడ్డి అని, కేవలం ఐదేళ్ల కాలంలోనే అతని ఆస్తులు  770  à°°à±‡à°Ÿà±à°²à± ఎలా పెరిగాయో చెప్పాలని, అతని

దగ్గర అక్షయ పాత్ర ఏమైనా ఉందా అని అడిగారు. ఈ దేశం లో మహాత్మా గాంధీ నుంచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వరకూ ఎందరో పాదయాత్ర చేపట్టారని, తమరు కూడా

పాదయాత్ర చేపట్టారన్నారు. అంతా చేసిన పాదయాత్ర ఒక ఎత్తు అయితే, తమరు చేస్తున్న పాదయాత్ర ఒక ఎత్తు అన్నారు. 341 రోజులు పాదయాత్ర చేశానని జగన్ చెపుతున్నారు. ఈ యాత్ర

ద్వారా తమరికి వచ్చేది కేవలం కాళ్లు నొప్పులు మాత్రమే అన్నారు. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా కోర్టు గుమ్మం తొక్కే వ్యక్తి ఈ ప్రపంచంలో వైఎస్ జగన్ ఒక్కడే

అన్నారు. అక్రమ ఆస్తులు పుంఖాను పుంఖాలుగా సంపాదించి న్యాయస్థానాలు కూడా విస్తుపోయే రీతిలో ఉన్నాయన్నారు. 

 à°Žà°•à±à°•à±à°µ పేజీల అఫిడవిట్ ఇచ్చేది జగనే

..

ఎన్నికల నామినేషన్ సమయంలో అందరూ కేవలం రెండో మూడో పేజీలు అఫిడవిట్ సమర్పిస్తారని, అయితే వైఎస్ జగన్ మాత్రం  70  à°ªà±‡à°œà±€à°² అఫిడవిట్ సమర్పించిన ఘనుడన్నారు. రెండు

పేజీల్లో సాధారణ వివరాలు ఉంటాయని, మిగిలిన 68 పేజీల్లో అతను అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలే ఉన్నాయన్నారు. తన నేర, అవినీతి చరిత్ర వివరాలు ఇన్ని పేజీలు ఆయన

రాసుకున్నారు. à°ˆ వ్యక్తి చంద్రబాబు గురించి, తెలుగుదేశం గురించీ అవినీతి ఆరోపణలు చేయటం విడ్డూరం ఉందన్నారు  à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు. 

సీఎం సీటు పై జగన్ కి

గౌరవం లేదు ..

అధికారం లోకి రావాలి అని పగటి కలలు కంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అదే ముఖ్యమంత్రి కుర్చీ అంటే విలువ లేదన్నారు. చంద్రబాబు నాయుడు అంటే

గౌరవం లేకపోయినా ప్రస్తుతం అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, కనీసా ఆ సీటు పైన గౌరవం ఉన్నా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అతను చంద్రబాబు నాయుడు పై చేసే

వ్యాఖ్యలు సభ్య సమాజం హర్షించేది కాదన్నారు. 

మహా రాజుల కోటలు కూడా ఇంత ఉండేవి కాదేమో :

పూర్వం మహా రాజులు నివసించే రాజ ప్రాసాదాలు కూడా లేనంత విశాలంగా

లక్షల చదరపు గజాల్లో వైఎస్ జగన్ ఇళ్ళు నిర్మించాడన్నారు. తన నివాసాలనే లక్షల చదరపు గజాల్లో ఇంద్ర భవనాల్లా  à°•à°Ÿà±à°Ÿà±à°•à±à°¨à±à°¨ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని

 à°…మరావతికి à°…à°‚à°¤ ఏరియా ఎందుకని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు  à°µà±ˆà°Žà°¸à± అధికారానికి వచ్చేనాటికి జగన్ ఆస్తి ఎంతో, à°† తర్వాత 775 శాతం ఎలా ఆస్తి, ఆదాయం పెరిగాయో

చెప్పాలన్నారు. దేశంలోనే ప్రజాప్రతినిధుల్లో ఆస్తుల్లో జగన్ అయిదో స్తానంలో ఉన్నారన్నారు. అవినీతి కి పర్యాయపదంగా జగన్ పేరు గూగుల్లో కనిపిస్తుందని ఎద్దేవా

చేశారు. చంద్రబాబు మీద అవినీతి ఆరోపణ చేసిన కాంగ్రెస్ నేతలు 26 పిటిషన్లు వేసినా ఒక్కటీ నిరూపించలేక పోయారన్నారు.

సభకే రానివాళ్ళకి ఎమ్మెల్యే పదవులెందుకు

?

ప్రజా సమస్యలు పై చర్చించేందుకే చట్ట సభలు ఉన్నాయని, అలాంటి చట్ట సభలకు రాకుండా తన ఎమ్మెల్యే లను వైఎస్ జగన్ కట్టుదిట్టం చేశారన్నారు. అలాంటి వాళ్లకి ఇక

ఎమ్మెల్యే పదవులు ఎందుకు అని గంటా ప్రశ్నించారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల సమస్యలపై ఎటువంటి అభివృద్ధి చేయనివ్వదు, ఇక ప్రజలేవిధంగా ఇతన్ని

నమ్ముతారన్నారు. కేవలం ఒక్క చంద్రబాబు నాయుడుని తిట్టడానికి మాత్రమే వైఎస్ జగన్ నోరు లేస్తుందని, విశాఖ రైల్వే జోన్ గురించి నోరెత్తి అడగడని, రాష్ట్రానికి

ప్రత్యేక హోదా పై కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, మోడీ ని గానీ ఒక్క నాడు కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. 
ఈ విలేకరుల సమావేశం లో విశాఖ దక్షిణ నియోజక వర్గం

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #ganta srinivasa rao  #YS Jagan  #YSR Congress

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam