DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గజదొంగ గంటాకు వందల కోట్లు ఎలా వచ్చాయి : గుడివాడ అమర్.

విశాఖపట్నం, జనవరి 8, 2019 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఒక ఘరానా దొంగ అయితే, అతని దగ్గర పనిచేసే గజదొంగ మంత్రి గంటా శ్రీనివాసరావు అని, వైఎస్సాఆర్ కాంగ్రెస్

పార్టీ రూరల్ సమన్వయకర్త గుడివాడ అమర్ అన్నారు. మంగళవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి పట్టిన

చీడ పురుగులు బాబు, గంటా అని, గంటా భూ దందాలపై అతని మంత్రి వర్గ సహచరుడు అయ్యన్న పాత్రుడే సిట్ కమిటీకి మొదటి ఫిర్యాదు చేసాడని, తదుపరి, ఇద్దరి మధ్య ఏం లాలూచీ

జరిగిందో గానీ, మళ్ళీ మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత  à°—జదొంగ à°—à°‚à°Ÿà°¾ à°•à°¿ లేదని, అతని భూ దందాలు రాష్ట్రాన్నే కుదిపేశాయని,

ప్రకాశం జిల్లా నుంచి చేతులూపుకుంటూ దేహీ అంటూ విశాఖ వచ్చిన గంటాకు ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి

ఎలా దోచుకోవాలో  à°† రహస్య మంత్రం ఏంటో చెప్తే రాష్ట్రం లోని ప్రజలంతా తెలుసుకుంటారన్నారు. విశాఖ జిల్లాలో భూ దోపిడీ à°•à°¿ స్వాహా రాయుడు గంటాయే నన్నారు. 
గృహ

ప్రవేశమే బహిరంగం గా చేసుకోలేని చంద్రబాబు గురించి నోరెత్తలేని గంటా, కార్యకర్తలు కూడా స్వేచ్ఛగా వెళ్లగలిగిన ఇల్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేనన్నారు.

అలాంటిది గంటా శ్రీనివాసరావు, జగన్ ఇంటి గురించి, లెక్కలు చెప్తూ, అయన ఇల్లు కట్టిన మేస్త్రీలాగా మీడియా ముందు లెక్కలు చెప్తున్నాడన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్

పార్టీలోకి ఎప్పుడు దూకేద్దామా అని ఎదురు చూస్తున్న à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ని మా పార్టీలోకి రావద్దు అంటే అన్నమని, మా పై నోరు పారేసుకుంటున్నాడని మండిపడ్డారు. 
/> రోజుకో పార్టీ మారే గంటా శ్రీనివాసరావు కి వైఎస్ జగన్ గురించి గానీ, మా పార్టీ గురించి గానీ నోరెత్తే అర్హత లేదన్నారు. అసలు గంటా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ

నుంచి పోటీ చేస్తాడో కూడా ఇప్పుడే చెప్పలేదన్నారు. ముందు అతని రాజకీయ భవిష్యత్ తేల్చుకోవాలని గంటాకు సుద్దులు చెప్పారు. à°ˆ విలేకరుల సమావేశం లో అధికార

ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి, పక్కి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ganta srinivasa rao  #ysr congress  #gudivada amar  #chandra babu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam