DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ రిజర్వేషన్ పేద యువతకు ఆక్సిజన్ లాంటిది : వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్

విశాఖపట్నం, జనవరి 8, 2019 (DNS Online): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పది శాతం విద్య, ఉపాధి లో రిజర్వేషన్లు అగ్ర వర్ణ పేద సామాజిక వర్గాలకు ఆక్సిజన్ లాంటిదని వైజాగ్ బ్రాహ్మిన్

వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు శంకర్ నీలు, అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం అక్కయ్యపాలెం లోని సంస్థ తాత్కాలిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు

మాట్లాడుతూ ఈ భారత దేశ చరిత్రలో జనవరి 7 ,2019 (సోమవారం ) చిరస్మరణీయంగా నిలిచిపోతుందని, అగ్ర వర్ణ సామాజిక వర్గాల్లో మేధావులు వేలాదిగా ఉన్నారని, వారికి ఆర్ధికంగానూ,

సామాజికంగానూ కలుగుతున్న అసమానతల నుంచి ఉపశమనం కల్గించే అంశం అన్నారు. ఇంతవరకూ అమలవుతున్న రిజర్వేషన్ల ప్రభావం అగ్రవర్గ మేధావి యువత పై చూపించిన మాట వాస్తవం

అన్నారు. నూటికి 95 శాతం మార్కులు వచ్చినా, ఉన్నత విద్య లో ఆశించిన విభాగం లో సీట్లు రాకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా రాక నిరాశతో ఏమీ చెయ్యలేని

స్థితి కి చేరుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ విధమైన ఆర్ధిక పరమైన అసమానతలను తొలగించవలసిన భాద్యత ప్రభుత్వాలపై ఉందని దేశ వ్యాప్తంగా ఎన్నో మార్లు ఉద్యమాలు

జరిగాయన్నారు. ఇంతవరకూ జరుగుతున్నా అసమానతలల్లో భాగంగా 95 శాతం మార్కులు వచ్చిన అగ్రవర్గ యువత అనర్హులుగా ప్రకటించబడి, 45 శాతం మార్కులు వచ్చిన ఇతర సామాజిక వర్గాల

అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. కొన్ని సమయాల్లో సమాజం పై విరక్తి కల్గి ఆత్మహత్యలకు పాల్పడిన అగ్రవర్గాల మేధావుల్లో

డిగ్రీల్లోబంగారు పతకాలు సాధించిన వారూ ఉన్నారన్నారు. ఈ విధమైన అసమానతలను కొంతవరకూ తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్గ పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో 10

శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ఈ వర్గాల యువతకు ఆక్సిజన్ అందినట్టవుతుందన్నారు. పార్లమెంట్ లో ఈ బిల్లుకు ఆమోదం లభించాలని, తక్షణం అమలు లోకి తీసుకు రావాలని

ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam