DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 వేల కోట్లతో ఆసియా పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం 

రావూరు (ప్రకాశం), జనవరి 9, 2019 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు క్యూలు కడుతున్నాయి అనడానికి మరో నిదర్శనం ఆసియా పల్ప్ పేపర్ సంస్థ.

బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షం లో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ ( ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు) తో ఆసియా పల్ప్ అండ్ పేపర్ సంస్థ ఒప్పంద

సంతకాలు చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఆసియా పల్ప్ పేపర్ సంస్థను రావూరు లో నెలకొల్పేందు సంసిద్ధత తెలిపింది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తున్నామని, దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా అభ్యున్నతికి రామయం పోర్టు తో పాటు, ఆసియా పల్ప్ అండ్ పేపర్ సంస్థ

లాంటి భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. à°ˆ సంస్థ కేవలం 20 నెలల కాల పరిమితిలో పూర్తి స్థాయి పని మొదలుపెట్టాలని తెలిపారు. 
ఈ సందర్బంగా ఏపీపీ

ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సురేష్ కీలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం మరువలేదన్నారు. అతి త్వరలోనే తమ సంస్థ కార్యకలాపాలను

ప్రారంభిస్తామన్నారు. 

అంతకు ముందు ప్రకాశం జిల్లా రావూరు గ్రామం వద్ద రామయం పేట పోర్ట్ కు సంబంధించిన శంఖుస్థాపన, పోర్ట్ పైలాన్ ను ఆవిష్కరించారు. 
à°ˆ

కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ ( ఏపీ ఎకనామిక్ బోర్డు ) సీఈఓ జె. కృష్ణ కిషోర్ మాట్లాడుతూ 
ఆసియా పల్ప్ పేపర్ సంస్థ చెయ్యబోయే కార్యకలాపాలను

వివరించారు. 

సిన్నర్ మాస్ గ్రూప్ , ఇండోనేషియా కు చెందిన ఆసియా పల్ప్ పేపర్ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తి అందించే ఈ సంస్థకు ప్రకాశం జిల్లా రామాయం

పట్నం ప్రాంతంలో 2500 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం సంస్థ 3.5 బిలియన్ అమెరికా డాలర్లు వ్యయంతో ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా 4 వేల

మందికి, పరోక్షంగా 10 వేలమందికి ఉపాధి లభించనుందని తెలిపారు. 

5 మిలియన్ మెట్రిక్ టన్నుల యూకలిఫ్టస్ పల్ప్, పేపర్, బోర్డులను ఉత్పత్తి చేస్తుందని, ఈ సంస్థ

ద్వారా 50 వేల వ్యవసాయదారులకు యూకలిఫ్టస్ పల్ప్ సరుకు అందించడం జరుగుతుందని, దీని ద్వారా  à°µà°¾à°°à°¿à°•à°¿ అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. 300 మెగావాట్ల కెపాసిటీ కల్గిన పవర్

అందించవలసి యుంది. à°ˆ సంస్థ 6 ఖండాల్లో 120 దేశాల్లో à°ˆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని వివరించారు. 

రామాయం పేట పోర్టు : 
         
మొత్తం 4240 కోట్ల రూపాయల

వ్యయంతో ఎనిమిది బెర్తులు నిర్మించతలపెట్టిన రామాయం పేట పోర్ట్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని  à°ªà±à°°à°•à°¾à°¶à°‚, గుంటూరు, కర్నూల్ జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్

నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్, ప్రాంతాలకు ప్రత్యక్షంగానూ, నెల్లూరుమెదక్,, కడప, చిత్తూర్, అనంతపూర్, కృష్ణ జిల్లాలతో పాటు మెదక్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు

పరోక్షంగా వినియోగపడుతుంది. గ్రానైట్ బ్లాక్స్, కంటైనర్ రవాణా, వ్యవసాయ ఉత్పత్తులను రవాణాతో పాటు, బొగ్గు, రసాయనాలు, చమురు తదితర పదార్థాలను ఎగుమతి చెయ్యవచ్చు.

/>  

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh  #government  #chandrababu naidu  #APP Paper Mills   #Pulp and Paper  #Ramayam peta  #Indonesia

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam