DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వేదికగా ఫిబ్రవరి 28 నుంచి ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలు

విశాఖపట్నం, జనవరి 11, 2019 (DNS Online) : ప్రపంచ వ్యాప్తంతా అత్యంత ఆదరణ కల్గిన ఎఫ్ ఐ వి బి బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్ ను విశాఖ సాగర తీరం లో నిర్వహించనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్

వాలీబాల్ సంఘం ఆధ్యక్షుడు, పిజివిఆర్ నాయుడు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3

వరకూ నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో 32 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ పోటీలను కలకత్తా కు చెందిన లీజర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ , భారత

వాలీబాల్ ఫెడరేషన్ సంయుక్తంగా విశాఖపట్నం లోని రామకృష్ణ బీచ్ లో నిర్వహిస్తున్నాయని తెలియచేసారు. 

ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న గ్రేటార్ విశాఖపట్నం

మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరినారాయణన్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా రంగంలో ప్రసిద్ధి కెక్కిన బీచ్ వాలీబాల్ విశాఖలో నిర్వహించడం ద్వారా విశాఖ

ప్రతిష్ఠా మరింత పెరుగుతుందన్నారు. 32 దేశాలకు చెందిన పురుష, మహిళల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నందున, వారికి ఆతిధ్యం ఇచ్చేందుకు విశాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ

పోటీల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అనంతరం à°ˆ పోటీలకు సంబంధించిన మస్కట్ (డాల్ఫ్)ను విడుదల చేసారు. 
/> ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు ఇస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గమనించిన భారత వాలీబాల్ ఫెడరేషన్ ఈ పోటీలను విశాఖనగరం లో

నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. 
à°ˆ విలేకరుల సమావేశం లో భారత వాలీబాల్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్  à°°à°¾à°®à°¾à°µà°¤à°¾à°°à± సింగ్ జఖర్, లీజర్ స్పోర్ట్స్

మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్ ఎస్ దాస్ గుప్త, ద్రోణాచార్య రమణారావు. తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #volleyball  #beach volleyball  #world

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam