DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీచ్ వాలీబాల్ పోటీల్లో మహిళల వస్త్రధారణ పై అభ్యంతరాలు.

భారత్ స్త్రీ పరువు తీసేందుకేనా బీచ్ వాలీబాల్ పోటీలు? 

మండిపడుతున్న మహిళా సంఘాలు 

విశాఖపట్నం, జనవరి 11, 2019 (DNS Online) : ఫిబ్రవరి 28 నుంచి విశాఖ సాగర తీరంలో

నిర్వహించతలపెట్టనున్న ఎఫ్ఐవిబి బీచ్ వాలీబాల్ వరల్డ్ టూర్ లో పాల్గొనే మహిళా జట్ల వస్త్రధారణ పై విశాఖ లోని మహిళా సంఘాలు అభ్యంతరం తెలియచేస్తున్నాయి. భారతీయ

మహిళల  à°µà°¸à±à°¤à±à°° ధారణకు భిన్నంగా టూ పీస్ వస్త్రధారణతో బహిరంగంగా బీచ్ లో క్రీడలకు అనుమతి ఎలా ఇస్తారని మండిపడుతున్నాయి. భారతీయ మహిళల వస్త్ర ధారణ కు ప్రపంచ

వ్యాప్తంగా ఎంతో గౌరవం ఉందని, వీటిని కించపరిచే విధంగా రెండు గుడ్డ పీలికలు తగిలించినట్టుగా వస్త్రధారణతో బహిరంగంగా సాగర తీరంలో ఆటలాడించడం ఏంటని

మండిపడుతున్నాయి. అభ్యంతరం క్రీడలకు కాదని, వాటిల్లో వాడే వస్త్రధారణ పైనే అని తెలియచేస్తున్నాయి. శరీర ఆకృతి కనిపించే విధంగా ఉండే ఈ వస్త్ర ధారణ

అభ్యంతరకరమన్నారు. ఇతర క్రీడాంశాల్లో ఉన్నట్టుగా వస్త్రధారణ ఉంటె అభ్యంతరం ఉండదని, అయితే వీటికి భిన్నంగా ఉంటేమాత్రం అడ్డుకుంటామని

తెలియచేస్తున్నాయి.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #volleyball  #beach volleyball  #world

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam