DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్యకర్తలే మన బలం పోటీకి సిద్ధం కండి: సైనికులకు జనసేనాని పిలుపు

సంక్రాతి తర్వాతే జనసేన కమిటీల ఏర్పాటు : 

విజయవాడ, జనవరి 11, 2019 (DNS Online) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మన బలం కేవలం కార్యకర్తలేనని, ఇప్పడి నుంచే పోటీకి సిద్ధం

కావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడ లో జరిగిన జన  à°¸à±ˆà°¨à°¿à°• శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమం లో కార్యకర్తలనుద్దేశించి

ఆయన ప్రసంగించారు. మన బలం పూర్తిగా కార్యకర్తలేనని,  à°§à°¨à°¬à°²à°¾à°¨à±à°¨à°¿ ఎప్పుడూ నమ్ముకోలేదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులు పెట్టె ధన ప్రలోభాలకు లోనుకాకుండా

ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చెయ్యాలని సూచించారు. శ్ర‌à°® à°ª‌à°¡‌కుండా విజ‌యం సాధ్యం కాద‌ని, రానున్న ఎన్నిక‌ల్లో నేత‌లంతా à°¸‌మష్టి పోరాటంతో  à°à°•‌తాటిపై

ముందుకు వెళ్ళాలి. నాయ‌కుల్లో చిత్త‌శుద్ధి ఉంటే వారి వెంట యువ‌à°¤ నడుస్తారు. నాయ‌కుల‌à°•à°¿ ఓర్పు, à°¸‌à°¹‌నం అవసరం. రాబోయే ఎన్నికలకి రోడ్ మ్యాప్ సిద్ధం అవుతోందని

వివరించారు. 

యువతకు ధీటుగా పెద్దలు, మహిళలూ :

జనసేన పూర్తి బలం కార్యకర్తలేనని, ప్రధానంగా యువతీ యువకులే జనసేన వెంట ఉన్నారంటూ కొన్ని పార్టీలు

చేస్తున్న దుష్ప్రచారానికి మన జనసైనికులు తమ ఇంటింటా ప్రచారం తో గట్టిగా బుద్ది చెప్తున్నారన్నారు. ప్రధానంగా ఈ ఇంటింటా ప్రచారం చేస్తున్న సైనికులు యువతీ

యువకులుకు ధీటుగా మహిళలు, నడి వయస్కులే అధికారంగా ఉన్నారన్నారు. రానున్న కాలంలో రాజకీయ పార్టీలకు జనసైనికులు చేస్తున్న ప్రచార పోరాటం గొప్ప సవాల్ గా

నిలువనుందన్నారు. వీరంతా ఉర‌à°•‌లెత్తే జన à°¶‌క్తే కొండంత à°…à°‚à°¡. పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లే కార్య‌à°•‌ర్త‌లే నా బలం. ప్ర‌తి కార్య‌à°•‌ర్త‌కు గుర్తింపు లభించే

విధంగా వ్యవస్థను  à°¬‌లోపేతం చేస్తున్నా. యువ శక్తిని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. 


గత తొమ్మిది రోజులుగా పార్టీ జిల్లా సమన్వయకర్తలు, నాయకులు,

కార్యకర్తలతో కూలంకషంగా చేసిన సమీక్షల్లో నాయకులకు మార్గదర్శనం చేశారు. శ్రేణులకు నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని గడప గడపకీ

తీసుకువెళ్లాలని సందేశమిచ్చారు. ప్రతి జిల్లాకి సంబంధించి మూడు దశల్లో సమీక్షలు నిర్వహించారు. ఇందుకోసం రోజుకి 6 గంటలపాటు నిలబడే ఉన్న జనసేనాని జిల్లా నాయకుడి

నుంచి క్షేత్ర స్థాయిలోని కార్యకర్త వరకూ.. ప్రతి ఒక్కరూ చెప్పింది సాంతం వినడమే కాకుండా, ముఖ్యమైన సూచనలు, విషయాలను స్వయంగా నోట్ చేసుకున్నారు. ఎంతో ఓపికగా

నాయకులు, జనసైనికులు చెప్పిన విషయాలను విన్నారు. à°ˆ నెల 3à°µ తేదీన మొదలైన జిల్లా సమీక్షలు శుక్రవారంతో ముగిశాయి. 13 జిల్లాలు... ఒక్కో జిల్లాకు సంబంధించి  3 దశల సమావేశాలు...

మొత్తంగా జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారు 100 గంటలపాటు ప్రసంగించి – ఏ దశలో ఏ నాయకుడు, ఏ జనసైనికుడు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించి ముందుకు వెళ్లాలో స్పష్టం చేశారు. à°ˆ

సమావేశాల్లో శ్రీ పవన్ కల్యాణ్ గారి ప్రసంగం, పార్టీని ముందుకు తీసుకువెళ్లడంపై ఇచ్చిన సందేశం, కార్యకర్తలకు కల్పించిన భరోసా జనసైనికుల్లో నూతనోత్తేజాన్ని

నింపాయి.


ప్రతీ జిల్లా సమస్యల పైన దృష్టి సారించాం : 

ప్రతి జిల్లాకి సంబంధించి అక్కడి రాజకీయ పరిస్థితులను సమీక్షించడం, బలాబలాలేమిటో తెలుసుకొంటూ

పార్టీ గమనంపై ఒక స్పష్టత ఇచ్చారు. ప్రతి జిల్లాకు సంబంధించి జిల్లా సమన్వయ, సహ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై సమీక్షించారు. తదుపరి జిల్లావ్యాప్తంగా

ఉన్న నాయకులతో భేటీ అయి సమీక్ష చేశారు. à°† జిల్లా నుంచి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడారు. ఇలా మూడు దశల్లో జిల్లా సమీక్షలు కూలంకషంగా సాగాయి.  à°œà°¿à°²à±à°²à°¾à°² నుంచి వచ్చిన

సమన్వయకర్తల నుంచి కార్యకర్తల వరకూ... వాళ్ళు వెల్లడించిన అభిప్రాయాలూ, వారు పంచుకున్న విషయాలను వినేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లే

విషయం వారు చెప్పిన సూచనలను విన్నారు. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం విషయంలో తాను అనుసరిస్తున్న పంథాను వివరించారు. నాలుగేళ్ల నాడు పార్టీ ప్రారంభించినప్పుడు

అతి కొద్ది మంది నేత‌లు, సుమారు 150 మంది అనుచ‌రులు మాత్ర‌మే ఉన్నార‌నీ, ఇప్పుడు ఇన్ని à°²‌క్ష‌à°² మంది అభిమానం చూర‌గొన‌à°¡à°‚ పార్టీకి ఆదరణ ఎలా పెరుగుతున్నదీ వివరించారు.

జనసేన పార్టీని, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడంలో యువత, మహిళలు పోషించిన బలమైన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించి వారిపై తాను ఉంచిన విశ్వాసాన్ని

వెల్లడించారు. à°œ‌à°¨‌సేన పార్టీకి విశేషంగా ఉన్న యువ‌à°¶‌క్తిని రాజ‌కీయ à°¶‌క్తిగా మార్చాల్సిన ఆవశ్యకతను స్పష్టంగా చెప్పారు. నాయకులు చిత్తశుద్ధిగా వెళ్తే యువత

వారివెంటే ఉంటుందని తెలిపారు.  à°…టు తెలుగుదేశం, ఇటు వైసీపీ... జనసేన మాతో కలుస్తుందని ప్రచారం చేసుకోవడం ద్వారా మనం à°Žà°‚à°¤ బలంగా ప్రజల్లో ఉన్నామో à°† పార్టీలే

చెబుతున్నాయనే విషయాన్ని ఈ సమీక్షల సందర్భంలో ప్రస్తావించారు. పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, విజన్ మ్యానిఫెస్టోలో

ఇచ్చిన హామీల గురించి గడపగడపకీ వివరించాలనీ నాయకులకీ, కార్యకర్తలకీ వివరించారు.

సంక్రాతి తర్వాతే కమిటీల ఏర్పాటు : 

గత నాలుగేళ్లుగా పార్టీ నిర్మాణం,

సిద్దాంతాల రూపకల్పనకు అనుసరించిన విధానాలను ఈ సమీక్ష సమావేశాల్లో వివరించారు. పార్టీ బలోపేతం అయినప్పుడే కమిటీలు వేయాలని నిర్ణయించామని చెప్పారు.

రాజమండ్రిలో నిర్వహించిన కవాతులో 10 లక్షల మంది, అనంతపురం కవాతులో 3.5 లక్షల మంది పాల్గొనడం ద్వారా పార్టీ బలం వెల్లడైందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల

ప్రాతిపదికన కమిటీలు నియమిస్తున్నామనీ సంక్రాంతి తరవాత ప్రకటిస్తామని చెప్పారు. కమిటీల ఎంపిక కోసం స్టీరింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. యువజన కమిటీలు

ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కమిటీలను నేరుగా తానే పర్యవేక్షిస్తానని ఈ సమావేశాల్లో ప్రకటించారు. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్నందున పార్టీ వర్కింగ్ క్యాలెండర్

ప్రకటిస్తామని కమిటీలు దాన్ని సమర్థంగా అమలు చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra pradesh  #janasena  #pawan kalyan

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam