DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా గరుడ గమనుని తిరువీధిసేవ

ఉపమాక, జనవరి 12, 2019 (DNS Online)   విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో వేంచేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి గరుడ వాహనంలో  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿ సేవ అత్యంత వైభంగా సాగింది.

ధనుర్మాసం ఉత్సవములలో భాగంగా శనివారం గోదాదేవి అమ్మవారికి తోటోత్సవం మూడవ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిత్య కార్యక్రమాలు పూర్తి చేసిన

తరువాత గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను దేవాలయం ప్రాంగణంలో గల పుష్ప తోటలోకి తీసుకుని వెళ్ళి అక్కడ తిరువారాధన, ప్రసాద నివేదన, తిరుప్పావై సేవాకాలం

చేపట్టారు. ధనుర్మాస వ్రతంలో 28 à°µ రోజు  " కఱవై గళ్ పెన్ శెన్ఱు " తిరుప్పావై పాశురంతో ప్రత్యేక నీరాజన మంత్రపుష్పాలు జరిపి, తదుపరి తీర్ధగోష్ఠి ప్రసాద వినియోగం

నిర్వహించారు.   గోదాదేవి  à°…మ్మవారి  à°‰à°¤à±à°¸à°µà°®à±‚ర్తులను పల్లకీలోనూ  à°¸à±à°µà°¾à°®à°¿à°µà°¾à°°à°¿ ఉత్సవమూర్తులను గరుడ వాహనంలో వేంచేపు చేసి  à°—్రామంలోతిరువీధిసేవ నిర్వహించారు.

 à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ నిర్వహించే అన్నదానం కార్యక్రమం తిరువీధిసేవ  à°…నంతరం నిర్వహించారు.  à°…న్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

అనకాపల్లి కోర్టు ఏడీఎమ్ జాస్తి సత్యనారాయణ మూర్తి, యలమంచిలి కోర్ట్ సివిల్ జడ్జి బుల్లి కృష్ణ దంపతులు గరుడాద్రి పర్వతం మీద కొలువైన వేంకటేశ్వర స్వామి వారిని

కొండదిగువున గల ఉత్సవమూర్తులను దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు ప్రత్యేక దర్శనంతో పాటు తీర్ధ

ప్రసాదాలు ఆండాళ్ అమ్మవారి మూలవిరాట్ సన్నిధి వద్ద ఆశీర్వచనం చేసారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పి.శేషాచార్యులు,  à°¬à°¿.హెచ్. ఎస్.

గోపాలాచార్యులు, ఇల్లింద గోపాలాచార్యులు, నండూరి రంగాచార్యులు ,  à°¦à±‡à°µà°¸à±à°¥à°¾à°¨à°‚ సిబ్బంది  à°¬à°¿.వి. జీ. రాజశేఖర్ గ్రామానికి చెందిన శ్రీనివాసా భక్త సమాజం సభ్యులు మీగడ

ఈశ్వరరావు పలువురు భక్తులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #thiruppavai  #upamaka  #venkateswara swamy  #temple  #thiruveedhi
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam