DNS Media | Latest News, Breaking News And Update In Telugu

216 అడుగుల సమతా మూర్తి హైందవ సంస్కృతికి సంకేతం : జీయర్ స్వామి 

సమతా మూర్తి నిర్మాణానికి 20 కేజీల సువర్ణం బహుకరణ 

హైద్రాబాద్, జనవరి 13, 2019 (DNS Online): భగవద్బంధువుల  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°· పర్యవేక్షణలో రూపుదాలుస్తున్న 216 అడుగుల భగవద్రామానుజుల

సమతా మూర్తి విగ్రహ నిర్మాణం హైందవ సంస్కృతీ కి సంకేతమని త్రిదండి చిన్న జీయర్ స్వామీ అన్నారు. ఆదివారం రామేశ్వరరావు ఇంటి ఆవరణలో జీయర్ స్వామి నిర్వహిస్తున్న

ధనుర్మాస ముగింపు ఉత్సవంలో శ్రీ గోదా రంగనాధుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రామానుజుల సమతా మూర్తి నిర్మాణ వివరాలను జీయర్ స్వామి భక్తులకు

తెలియచేసారు. ఇప్పడికే రామేశ్వర రావు భూరి విరాళం భూమి రూపంలో అందించారని తెలియపరుస్తుండగానే, రామానుజుల స్వర్ణ విగ్రహ నిర్మాణానికి  à°®à±ˆà°¹à±‹à°‚ అధినేత డాక్టర్

జూపల్లి రామేశ్వర్ రావు కుటుంబ సభ్యులు  20 కేజీల బంగారాన్ని అందిస్తున్నట్టు ప్రకటించి, వెంటనే అందించారు. ఈయన స్ఫూర్తిగా శ్రీ జ్యుయలర్స్ అధినేత అనిల్ 5 కేజీల

బంగారాన్ని ప్రకటించగా, ఎన్ టీవీ అధిపతి ( రచన టెలివిజన్ సంస్థల చైర్మన్) నరేంద్ర చౌదరి సైతం ఒక కేజీ బంగారాన్ని ప్రకటించారు. రామానుజుల స్వర్ణ మూర్తి తయారీ

ఇప్పడికే మొదలైందని, హైదరాబాద్ కు చెందిన స్వర్ణకారులు, ఇతర నిపుణల ప్రత్యక్ష సారధ్యంలో  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°²à°•à± చెందిన స్వర్ణకారులు కూడా సహకారం అందిస్తున్నారని తెలిపారు.

అయితే ఈ విగ్రహ నిర్మాణం లో వినియోగించడానికి దాతలు స్వర్ణాన్ని సమర్పించదలిస్తే కేవలం పది రోజులు మాత్రమే నిర్వహణ కమిటీకి అందించాలని, తదుపరి అందించే సువర్ణ

విరాళం రామానుజుల విగ్రహం లో వినియోగించబడదు అని ప్రకటించారు. భక్తులు దాతలు అందిస్తున్న సువర్ణ విరాళం, ఇతర విరాళాలు పన్ను చెల్లించబడిన విరాళాలేనని తెలిపారు.

అనంతరం గోదా కల్యాణంలో మధుర ఘట్టాలను, చారిత్రిక ఆధారాలను జీయర్ స్వామి భక్తులకు తెలియచేసారు. 

ఈ కార్యక్రమంలో త్రిదండి దేవనాధ జీయర్ స్వామి, నేపాల్

కృష్ణమాచార్య స్వామి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు, తెలంగాణ రాష్ట్ర శ్రీవైష్ణవ సంఘ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సలహాదారులు సముద్రాల వేణుగోపాలాచార్యులు,

పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత నెలరోజులుగా ఎంతో భక్తి శ్రద్దలతో ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చక

స్వాములు, మై హోమ్ సంస్థల సిబ్బంది, భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది తదితరులకు ఆయన మంగళశాసనములు అందించారు. 

 

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #dhanurmasam  #goda kalyanam  #ramanuja statue  #samata murty  #20

kg gold  #rameswara rao  #my home

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam