DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యప్పలకోసం నీలక్కల్ లో యాత్రీ సదన్ లు నిర్మిస్తాం: మురళి మోహన్ 

అయ్యప్ప దర్శనానికి మహిళలూ అర్హులే  : మురళి మోహన్ సంచలన ప్రకటన 
 
( DNS  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à°¿ DSN మూర్తి ) 

శబరీ మల, జనవరి 14, 2019 (DNS Online) : ప్రతి ఏటా వేలాదిగా అయ్యప్ప భక్తులు

దీక్షాధారులై శబరిమల కు వస్తున్న ఆంధ్ర ప్రదేశ్ భక్తుల సౌకర్యార్దం నీలక్కల్ ప్రాంతంలో యాత్రీ సదన్ లు నిర్మిస్తున్నట్టు రాజమహేంద్ర వరం లోక్ సభ సభ్యులు ఎం.

మురళి మోహన్ తెలిపారు. సోమవారం అయ్యప్ప సన్నిధానం వద్ద DNS ప్రతినిధి DSN à°®à±‚ర్తి తో ప్రత్యేకంగా సంభాషించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దర్శనం కు వచ్చే

ఆంధ్రా ప్రాంతాలకు చెందిన భక్తులు, ఇతర యాత్రీకుల సౌకర్యార్ధం సన్నిధానం వద్ద గానీ, పంబ వద్ద గానీ స్థలం అడగడం జరిగిందని, అయితే స్థలాభావం వల్ల నీలక్కల్

ప్రాంతంలో రెండు ఎకరాల  à°¸à±à°¥à°²à°‚ కేటాయించినట్టు తెలిపారు. సుమారు 25 లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం చే  à°ˆ యాత్రీ సదన్ ను నిర్మింప చేస్తామన్నారు. అంతకు ముందు

అయ్యప్ప సన్నిధానం వద్ద మురళి మోహన్ భక్తులు పళ్ళు, మిఠాయిలు పంపిణీ చేశారు. 

విడతలుగా మహిళలు వచ్చిన తప్పులేదు :

అయ్యప్ప స్వామీ దర్శనానికి మహిళలు కూడా

రావచ్చు అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని మురళి మోహన్ తెలిపారు. అయితే అయ్యప్ప ను చూడాలి అనే ఆనందంలో మహిళా భక్తులు ఒక్కసారిగా

సన్నిధానం కు వచ్చినట్లయితే తొక్కిసలాట జరిగి, ఇబ్బందులపాలవుతారని, బృందాలుగా వస్తే వచ్చినవారికి కూడా ఇబ్బంది ఉండదు అని తెలిపారు. అయితే ఎన్నో ఏళ్ళ నుంచి

అయ్యప్ప సన్నిధికి మహిళలు రాకూడదు అని నిబంధన ఉండడంతో వారు కూడా రాలేదని, ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో వారికి ఆటంకం తొలగినట్టయిందన్నారు. హిందూ

ధర్మం లో గతంలో మహిళల పట్ల ఉన్న నిబంధనలు ప్రస్తుతం సడలించడం జరిగిందని, ఉదాహరణలు, వితంతు పునర్వివాహం, తదితర సంప్రదాయాలను దాటడం జరిగిందన్న విషయాన్నీ గుర్తు

చేశారు. అయితే మురళి మోహన్ చేసిన వ్యాఖ్యతో కొందరు సంప్రదాయ పరులు విభేదించారు.

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnsmedia  #dnslive  #dnsnews  #vizag  #visakhapatnam  #shabari mala  #ayyappa; jyothi darshanam  #mandalam  #Rajamundry MP  #Murali Mohan

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam