DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రయాగరాజ్ లో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కుంభ మేళ స్నానం

హర్ హర్ గంగే నామం తో మారు మ్రోగుతున్న త్రివేణీ సంగమం

షాహీ స్నానం లో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. 
 
త్రివేణీ సంగమ కుంభమేళా లో పవిత్ర

స్నానం పూర్వజన్మల సుకృతం 

ప్రయాగ రాజ్, జనవరి 15 ,2019 (DNS Online ): అత్యంత పవిత్రమైన త్రివేణీ సంగమం (à°—à°‚à°—, యమునా, సరస్వతి నదుల సంగమం)  à°ªà±à°°à°¯à°¾à°— రాజ్ నదీ గమనంలో జరుగుతున్న

కుంభమేళా లో స్నానమాచరించడం పూర్వ జన్మల సుకృతంగా పెద్దలు తెలియచేస్తున్నాయి. ఉత్తర సంక్రమణ సమయంలో సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించిన సమయంలో వచ్చేది

కుంభమేళా అంటారు. దీన్నే దక్షిణాది రాష్ట్రాల్లో పుష్కరం అని పేరు. ఈ సమయంలో పవిత్ర గంగా నదీలో పవిత్ర స్నానం ఆచరించడం చాలా విశేషంగా తెలియచేస్తుంటారు.

మంగళవారం ( జనవరి 15 నుంచి)  à°ˆ ప్రయాగరాజ్ ప్రదేశంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పవిత్ర స్నానం చేసి షాహీ స్నాన్ ను ఆరంభించారు. 12 ఏళ్ళ కోసారి వచ్చే మేళ ను కుంభ మేళా అని

పేరు, ప్రస్తుతం 6 ఏళ్ళ కు వచ్చింది కనుక దీన్ని అర్ధ కుంభ మేళా అని ప్రసిద్ధికెక్కింది.à°ˆ కుంభస్నానాలు  à°ªà±à°°à°¯à°¾à°—, ఉజ్జయిని, నాసిక్ మరియు  à°¹à°°à°¿à°¦à±à°µà°¾à°°à± లలో

జరుగుతున్నాయి. ఈ కుంభస్నానాలు పైన పేర్కొన్న 4 చోట్ల ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా ప్రారంభమౌతాయి. పుష్కరస్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే , ఈ కుంభ స్నానాలకు

గురుచారంతోబాటు రవి,చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నానతేదీలను నిర్ణయిస్తారు.

ప్రయాగ స్నాన మాహాత్మ్యం: 

సాధారణ రోజులలోనే ప్రయాగలో

స్నానానికి ఎంతో ప్రాధాన్యతని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక కుంభ యోగంలో మరింత ప్రసిద్ధి కెక్కింది. వెయ్యి కార్తిక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వంద మాఘ మాస

స్నానాలు గంగలో చేసిన ఫలితం, వైశాఖ మాస స్నానాలు కోటి మారులు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని ఒక్కమారు కుంభ స్నానంతో మానవుడు పొందుతాడని స్కంద పురాణం

తెలియచేస్తోంది. .

à°ˆ కుంభస్నానాలు.. ప్రయాగ,  à°‰à°œà±à°œà°¯à°¿à°¨à°¿,  à°¨à°¾à°¸à°¿à°•à± మరియు  à°¹à°°à°¿à°¦à±à°µà°¾à°°à± లలో జరుగుతాయి.

అర్ధకుంభమేళా.:  2019 జనవరి 15 మంగళవారం సంక్రాంతి నుండి 49

రోజులపాటు మార్చి 4 మహాశివరాత్రి వరకు జరుగును.   à°ˆ అర్ధకుంభమేళాకి ఎన్నోలక్షలమంది అఘోరాలు, సాధువులు స్నానము ఆచరిస్తారు. 

కుంభము అంటే కుండ లేదా కలశము

అనిఅర్ధము. మేళా అంటే కలయిక, కూటమి అనిఅర్ధము.  à°ˆ కుంభమేళా గురించి..  à°­à°¾à°—వతము,  à°®à°¹à°¾à°­à°¾à°°à°¤à°®à±, రామాయణము, విష్ణుపురాణము మొదలైన గ్రంధాలలో ఉన్నది.

క్షీరసాగర మథన

సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా  
à°† కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం :  à°…లహాబాద్,  à°¹à°°à°¿à°¦à±à°µà°¾à°°à±,  à°‰à°œà±à°œà°¯à°¿à°¨à°¿,  à°¨à°¾à°¸à°¿à°•à±‌లలోని

నదుల్లో పడ్డాయి. 
అందువల్ల à°ˆ నాలుగు ప్రదేశాలలో à°’à°• చోట  à°ªà±à°°à°¤à°¿ 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని సాధారణ కుంభమేళా అంటారు.6 సంవత్సరాలకు ఒక్కసారి

జరిగే కుంభమేళాన్ని అర్ధకుంభమేళ అని, 12 సంవత్సరాలకు కొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు.  12 పూర్ణ కుంభమేళాలు అంటే, 12  * 12 = 144 ఏళ్లకోసారి చేసే కుంభమేళాన్ని

మహాకుంభ మేళాఅంటారు. ఇది 2025 లో మరలా పూర్ణ కుంభమేళా జరగనుంది. అలాగే ప్రతి సంవత్సరము కొన్ని పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి.

ఇప్పడికే ప్రయాగరాజ్ ప్రాంతానికి

లక్షలాదిగా భక్తులు చేరుకోవడం తో కోలాహలంగా మారిపోయింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ అర్ధ కుంభ మేళ కు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ మేళా లో ఎటువంటి ఇబ్బందులు

తలెత్తకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. వేలాదిగా పోలీసు బలగాలను, గజ ఈతగాళ్లను, స్వచ్చంద సంస్థల ప్రతినిధులను వేల సంఖ్యలో నియమించారు. ఎక్కడికక్కడ సహాయక

చర్యలకు కేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు, ఆహార వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ సంస్థలు వివిధ రకాల్లో సాధారణ స్తాయి నుంచి హైటెక్ వరకూ   తాత్కాలిక గుడారాలు,

నిర్మించి, ఒక రోజులు వెయ్యి నుంచి 30 వేల వరకూ బాడుగ వసూలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి సాధారణ భక్తులు, యాత్రీకులు, ఉన్నత హోదాల్లోని వారు,

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇప్పడికే à°•à±à°‚à°­ మేళ ప్రదేశాలకు చేరుకున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #bjp  #triveni sangamam  #prayagraj   #smriti irani  #uttara pradesh  #up  #kumbh mela  #2019

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam