DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా గవర్నర్ గా ఫైర్ బ్రాండ్ కిరణ్ బేడీ. . .ఉత్తర్వులే ఆలస్యం !!!

అధికారిక ఉత్తర్వులు తరువాయి 

ఆంధ్ర ప్రదేశ్ à°•à°¿ అచ్ఛే దిన్ అయేంగే 

న్యూ ఢిల్లీ,  à°œà°¨à°µà°°à°¿ 21 ,2019 (DNS Online ): ఆంధ్రా à°•à°¿ అచ్ఛే దిన్ అయేంగే అంటూ భారతీయ జనతా పార్టీ

చేస్తున్న ప్రకటనలకు నిదర్శనంగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఫైర్ బ్రాండ్ కిరణ్ బేడీ ని నియమిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఐపీఎస్

అధికారిగా చరిత్ర సృష్టించిన కిరణ్ బేడీ విధి నిర్వహణలో ఎన్నో సంచలనాలు తన ఖాతా లో వేసుకున్నారు. సాక్షాత్తు నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ సొంత కారునే రహదారి లో

అడ్డుగా / రాంగ్ రూటులో పార్కింగ్ చేశారనే కారణంతో క్రేన్ తో ఎత్తి, వెహికల్ గోడౌన్ కి తరలించి, దానికి జురుమానా కూడా విధించిన ఘనత ఉంది. దీంతో దేశం మొత్తం కిరణ్

బేడీ పేరు క్రేన్ బేడీ గా మారుమ్రోగిపోయింది. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపునకు వేస్తున్న అడుగుల్లో భాగంగా ఆంధ్రా తోనే ఆరంభం

 à°®à±Šà°¦à°²à±à°ªà±†à°Ÿà±à°Ÿà°¿à°‚ది. ఇప్పడికే ఆంధ్రా లో బీజేపీ పార్టీ దాదాపుగా అడుగంటి పోయిన క్రమం లో రాష్ట్ర పాలన పై పట్టు సంపాదించేందుకు తాత్కాలిక గవర్నర్ స్థానంలో తమకు

అనుకూలంగా ఉండే వృత్తి నిబద్దత కల్గిన కిరణ్ బేడీ ను పంపేందుకు దాదాపు రంగం సిద్ధమైపోయింది. అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి. ఇదే విషయాన్ని ఢిల్లీ

అధికారిక వర్గాలు ఖరారు చేస్తున్నాయి. 

గవర్నర్ గానూ సంచలనమే  : ప్రస్తుతం పాండిచేర్రి గవర్నర్ à°—à°¾ ఉన్న ఈమె గతంలో à°—ోవా గవర్నర్ గానూ అత్యుత్తమ సేవలు

అందించారు. ఇంతకాలం గవర్నర్ అంటే కేవలం రాష్ట్రం లో రబ్బర్ స్టాంప్ అనే బ్రాండ్ గా తయారుచేసిన కాంగ్రెస్ పాలన నుంచి అత్యుత్తమ పవర్ ఫుల్ అధికారి గా తయారు చేసిన

ఘనత బీజేపీ కే దక్కుతుంది. దీనికి నిదర్శనమే పాండిచ్చేరి లో ఒక సభలో ఇంగ్లీష్ తాను మాట్లాడుతుంటే సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనే తమిళ భాషలోకి అనువాదం

చేయించిన ఘనత ఈమెదే. ఇదే సభలో à°’à°• ఎమ్మెల్యే,  à°µà°¿à°¦à±à°¯à°¾ శాఖా మంత్రి తదితరుల అనువాద పరిజ్ఞానం ఎంతో సభికులకు తెలిసేలా గట్టి ఝలక్ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి అనువాదం

చేస్తారంటూ సభలోనే కిరణ్ బేడీ ప్రకటించడంతో తప్పని సరి పరిస్థితుల్లో అయన అనువాదం చెయ్యవలసి వచ్చింది. ఇదే విధంగా ఈమె తరుచుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో

పర్యటిస్తుంటారు. అక్కడ తన కోసం పెట్టె స్వాగత బ్యానర్లను చూసి, దాన్ని తొలగించి, దానికి పెట్టిన ఖర్చును ఆమె వెంటనే చెల్లించారు. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన

సమ్మాన సభలో నూతన వస్త్రాలకు కూడా ఆమె డబ్బులు చెల్లించి, ఉత్తుత్తినే డబ్బులు ఖర్చు పెట్టవద్దని హెచ్చరించారు. 
ఈమె నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను

ఎత్తి చూపించి, సరిద్దిద్దుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చిరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దృశ్యాలు స్వయంగా అనుభవించిన ఆయా ప్రభుత్వాలు, ఈమెను తమ

రాష్ట్రం నుంచి బదిలీ చేయవలసిందిగా కేంద్రాన్ని కోరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విధి నిబద్దత కల్గిన కిరణ్ బేడీ ఆంధ్ర ప్రదేశ్ కి వస్తే అక్రమాల పుట్టలో

ఎన్ని పాములు కలుగుల్లోనించి బయటకు వస్తాయో వేచి చూడాలి. ఆంధ్రా కు కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలను స్వయంగా బహిర్గత పెట్టేందుకే ఈమెను గవర్నర్ గా

పంపుతున్నట్టు తెలిసింది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh  #governor  #kiran bedi  #chandrababu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam