DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రమాద రహిత డ్రైవింగ్ పై ఆర్టీసీ శిక్షణ 

విశాఖపట్నం, జనవరి 23 , 2019 : ప్రమాద రహిత డ్రైవింగ్ పై అద్దె బస్సుల డ్రైవర్లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ  (ఏ పీ ఎస్ ఆర్ తీ సి) శిక్షణ అందించింది. బుధవారం

విశాఖపట్నం నగరం లోని ద్వారకా బస్ కాంప్లెక్ ప్రాంగణంలో వివిధ డిపోలకు చెందిన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ శిబిరానికి విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్

పివి రామారావు హాజరయ్యారు. ఈ సందర్బంగా డ్రైవర్లందరూ ప్రయాణీకుల భద్రత, సంస్థ మనుగడను దృష్టిలో పెట్టుకుని క్రమ శిక్షణ తో విధులను నిర్వహించారన్నారు. విశిష్ట

అతిధిగా హాజరైన ట్రాఫిక్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గమ్య స్థానానికి తొందరగా చేరుకోవాలి అనే లక్ష్యంతోనే అతి వేగం అజాగ్రత్త లతో బస్సుల

డ్రైవింగ్ చేస్తుంటారన్నారు. దీనికి పరిణామంగా ఏర్పడే దుష్పరిణామాలను సోదాహరణంగా డ్రైవర్లకు వివరించారు. బాధ్యతాయుతంగా క్రమశిక్షణ తో ట్రాఫిక్ నియమ

నిబంధనలను పాటిస్తూ అతి వేగం తగ్గించి, ప్రమాదాలకు తావు లేకుండా తాము విధులను సక్రమంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దాని వలన సంస్థకు, ప్రయాణికులకు

పాదచారులకు కాకుండా వారి కుటుంబాలకు కూడా శుభదాయకమన్నారు. ప్రత్యేక అతిధిగా పాల్గొన్న మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ బుచ్చిరాజు మాట్లాడుతూ రవాణా శాఖా విభాగం

రూపొందించిన నిబంధనలు, డ్రైవింగ్ లో మెళకువలను చేపట్టవలసిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డ్రైవర్లకు వివరించారు. అనంతరం సదస్సుకు హాజరైన ఏపీ ఎస్

ఆర్టీసీ డ్రైవర్లకు అం లైన్ ట్రైనింగ్ ద్వారా మెళకువలు నేర్పించారు. ఈ సదస్సులో నగర పరిధిలోని వివిధ డిపోలకు చెందిన సుమారు 50 మంది అద్దెబస్సుల డ్రైవర్లు

పాల్గొన్నారు. సదస్సులో విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ సుధీష్ కుమార్, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు,  à°¡à°¿à°ªà±à°¯à±‚à°Ÿà±€ చీఫ్

మెకానికల్ ఇంజనీర్లు, డిపో మేనేజర్లు,  à°ªà°°à±à°¸à°¨à°²à± మేనేజర్, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh state road transport corporation  #APSRTC  #drivers  #training

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam