DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీటింగ్ కి డుమ్మా కొట్టాలంటే సెలవు చీటీ తప్పనిసరి ,  విశాఖ కలెక్టర్ భాస్కర్

జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్ 

విశాఖపట్నం, జనవరి 24 , 2019  (DNS Online ):  à°‡à°• పై విశాఖ జిల్లాలో ఏ స్థాయి అధికారి అయినా సెలవు చీటీ ఇవ్వకుండా

సమావేశాలకు డుమ్మా కొడితే అంటే సంగతి. ఇదే విషయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రకటించారు. గురువారం జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి

చాలా మంది అధికారులు గైర్హాజరు కావడం పై సీరియస్ అయ్యారు. సమావేశం లో జేడీపీటీసీ లు అడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసిందిగా సంబంధిత విభాగాల అధికారులకు

కలెక్టర్ సూచన చేశారు. అయితే వారు సభకు హాజరు కాకపోవడంతో, తక్షణం అందరికీ హెచ్చరికలు జారీ చేశారు.  à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ సమావేశాలు మూడు నెలలకు à°’à°• సారి జరుగుతాయని, మూడు

నెలల కాలం లో జరిగిన కార్యాచరణను విస్తరించవలసి భాద్యత అధికారులదేనన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రకటన విడుదల కావచ్చని, ఇప్పడికైనా పెండింగ్ లో ఉన్న పనులను

గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఇకపై సమావేశాలున్న సమయంలో అధికారులు సెలవు పెట్టాలంటే సరైన కారణంతో సెలవు చీటీ వ్రాయాలని, దానిపై చైర్మన్ అనుమతి ఇస్తూ సంతకం

చేసినప్పుడే వారికి సెలవు మంజూరు చెయ్యడం జరుగుతుందన్నారు. ఇకపై సమావేశాలకు గైర్హాజరు అయ్యే వారికి ఈ అనుమతి తప్పని సరి అన్నారు. లేనిపక్షంలో విలన్ ని

చెయ్యవద్దని హెచ్చరించారు. పని పట్ల ఎటువంటి అశ్రద్ధ కూడదన్నారు. వృత్తి పట్ల తన నిబద్దత ఉంటుందనే విషయం జిల్లా అధికారులకు గురువారం తెలియచేసారు. 

 

#dns  #dns live  #dns media 

#dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #collector  #katamaneni bhaskar 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam