DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ సాగర జలాలపై విదేశీ పర్యాటక నౌకాయానం ఆరంభం

తొలిసారి నగరానికి చేరుకున్న రష్యా క్రూజ్ 

పర్యాటక à°°à°‚à°—à°‚ లో విశాఖ దేశంలోనే అగ్రగామి 

విశాఖపట్నం, జనవరి 24 , 2019  (DNS Online ):  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à°°à°‚à°—à°‚ లో అగ్రగామిగా

నిలుస్తున్న విశాఖ నగరానికి నౌకాయాన మార్గం కూడా తోడవుతోంది. అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాలున్న విశాఖనగరానికి మొట్టమొదటి సారిగా రష్యా కు చెందిన

పర్యాటక నౌక రావడం అభినందనీయమని కేంద్ర జల వనరుల శాఖా కార్యదర్శి గోపాలకృష్ణ తెలిపారు. గురువారం నగరానికి వచ్చిన ఆయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లోని డిసి జట్టి

దగ్గర లంగరు వేసిన రష్యా నౌక సిల్వర్ డిస్కవరర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ వివిధ దేశాలకు చెందిన వందమంది పర్యాటకులతో విశాఖకు

తొలిసారి క్రూజ్ వచ్చిందన్నారు. ముంబై కి చెందిన జె ఎం బక్షి సంస్థ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నౌక లో ప్రయాణీకులు విశాఖ పర్యటనకు వచ్చారన్నారు. ఈ విధమైన

పర్యాటకం దక్షిణాది సముద్ర జలాలపై ఇది తొలిసారి అని తెలిపారు. ఇంతవరకు రోడ్డు రవాణా, విమాన యానం ద్వారా పర్యాటకులు విశాఖకు చేరుకుంటున్నారని, ప్రస్తుతం నౌక యాన

రంగం కూడా తోడైందన్నారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం టి కృష్ణ బాబు మాట్లాడుతూ పోర్ట్ ట్రస్ట్ అందిస్తున్న సేవలతో విశాఖపట్నం పర్యాటక రంగం కూడా మరింత

అభివృద్ధి చెంది, మరిన్ని నౌకల్లో పర్యాటకులు నగరానికి వచ్చే విధంగా సానుకూల వాతావరణం కల్పించామన్నారు. ఈ విధంగా పర్యాటక నౌకలు రావడం వలన ఆదాయ వనరులు కూడా

పెరుగుతాయన్నారు. త్వరలో మరిన్ని పర్యాటక నౌకలు రానున్నాయన్నారు. అంతకు ముందు జల వనరుల శాఖా కార్యదర్శి గోపాలకృష్ణ తో కలిసి రష్యా నౌకను సందర్శించి, సిబ్బంది,

ప్రయాణీకులతో ముచ్చటించారు. ఈ విలేకరుల సమావేశం లో నౌక కెప్టెన్, పోర్ట్ అధికారులు, విశాఖ జిల్లా పర్యాటక శాఖా అధికారిని పూర్ణిమ దేవి తదితరులు

 à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #port  #tourism development corporation  #APTDC  #Russian cruise  #silverline
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam