DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగదానంద కారక . . . పంచరత్నాలతో శ్రీరామ సాక్షాత్కారం. 

విశాఖపట్నం, జనవరి 25, 2019 (DNS Online): ఈ విశ్వం అంతా శ్రీరాముని ఆదేశంతోనే నడుస్తుందని, ఆయన కనుసన్నల్లోనే మానవాళి జీవనం సాగుతుందని నమ్మిన త్యాగరాజ స్వామీకి, మానవాళి ఆనంద

డోలికల్లో తేలియాడడానికి కారకుడైన జగదానంద కారకునికి విశాఖ సంగీత కళాకారులు సంగీత నీరాజనంతో శ్రీరాముని సాక్షాత్కారం అందించారు. శుక్రవారం అత్యంత వైభవంగా

సాగిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు పంచరత్న కీర్తలనతో ఆరంభమైంది. సుమారు రెండు వందల మందికి పైగా ఆలిండియా ఏ గ్రేడ్ విద్వాంసుల నుంచి వర్ధమాన కళాకారుల వరకు ఏక

స్వరంగా ఆలపించిన పంచరత్న కీర్తనలతో కళాభారతి ప్రాంగణం సాక్షాత్తు యక్ష, గాన లోకాలను తలపించింది. తొలుతగా నాట రాగంలో జగదానంద కారక కీరతన ఆరంభించి, శ్రీరాముని

లీల వినోదాలను సుస్పష్టంగా తెలియచేసారు. తదుపరి గౌళ రాగం లో దుడుకు à°—à°² నిన్నే కీర్తన,  à°†à°°à°­à°¿ రాగం లో సాధించెనే ... , అనంతరం 
వరాళి రాగం లో కనకన రుచిరా కీర్తనలతో

యక్షగాన లోకాలను తలపించాయి. చివరగా శ్రీ రాగం లో సంగీత మహానుభావులు ఆలపించిన ఎందరో మహానుభావులు . . . అందరికీ వందనములు అంటూ గానం చేసి, సాక్షాతూ శ్రీరాముని సహా,

ముక్కోటి దేవతలను దివి నుంచి భువికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం లో గాత్రం, వీణ, వయోలిన్, మృదంగం, ఘటం, సన్నాయి, వేణువు, హార్మోనియం, తంబురా తదితర వాయిద్యాలపై

సమ్మోహనాన్ని కల్పించారు. అనంతరం గురువిల్లి అప్పన్న బృందం చేసిన సన్నాయి కచేరి తో త్యాగరాజా ఆరాధన ఉత్సవాల కచేరీలు ఆరంభమయ్యాయి. 
అంతకు ముందు కళాభారతి

ప్రాంగణం లోని త్యాగరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం తిరువీధి ఉత్సవం చేపట్టారు. కళాభారతి ట్రస్టీ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ (రాంబాబు)

అభినవ త్యాగరాజ స్వామి అలంకారంతో తిరువీధిలో పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns news  #dns media  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #dnslive  #violin  #hari villu  #MSN Murty #Kalabharati  #veena  #pancharatna seva  #keertanalu #kalabharati

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam