DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్రాలు అడ్డంకి కాదు :కొణతాల 

ఫిబ్రవరిలో మలి విడత రాజకీయ ప్రవేశం పై నిర్ణయం 

విశాఖపట్నం, జనవరి 25, 2019 (DNS Online): విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చెయ్యడానికి తమకు ఎటువంటి అభ్యంతరం

లేదని ఒరిస్సా ప్రకటించిందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చ వేదిక శుక్రవారం నగరంలోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ విభజన సమయంలో పార్లమెంట్ లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఒకటని, దాన్ని ఇవ్వడానికి కేంద్రానికి ఇష్టం

లేదో, లేక పార్టీల ప్రభావమో గాని, విభజన జరిగి ఐదేళ్లు గడిచినా నేటికీ ఆ మాటే ఎత్తడం లేదన్నారు. విశాఖ రైల్వే డివిజన్ లో కొంత భాగం ఆంధ్ర ప్రదేశ్ లోనూ, మరి కొంత భాగం

ఒరిస్సా లోనూ ఉన్నందునే ఈ డివిజన్ ను విడగొట్టి జోన్ ఏర్పాటుకు సాంకేతిక పరంగా ఇబ్బంది తలెత్తిందన్నారు. దీనిపై ఒరిస్సా ముఖ్యమంత్రి, ఎంపీలతో మాట్లాడడం

జరిగిందని, విశాఖపట్నం రైల్వే డివిజన్ లోని ఆంధ్ర ప్రాంతంలోని భాగం ఆంధ్ర కు, ఒరిస్సా భాగం ఒరిస్సాకు విడగొట్టి, ఒరిస్సాకు మరో కొత్త డివిజన్ ఇవ్వవచ్చన్నారు.

దీనిపై ఒరిస్సా సైతం అంగీకరించిందన్నారు. కేంద్రంలో అధికారం లోని భారతీయ జనతా పార్టీ. మరో ప్రక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని స్పష్టంగా

ప్రకటించేసింది. ప్రకటించిన జాతీయ విద్యా సంస్థలన్నీ తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయన్నారు. విభజన హామీలపై కేంద్రంతో చిట్టచివరి పోరాటానికి సిద్దపడి జన

ఘోష యాత్రను ఆదివారం ( జనవరి 27 ) చేపడుతున్నట్టు తెలిపారు. ఢిల్లీ లో ప్రముఖ విద్యావేత్తలు, ఆర్ధిక వేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం

నిర్వహిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన తదుపరి ఫిబ్రవరి నెలలో తన మలి విడత రాజకీయ ప్రవేశం గురించి తన అంతరంగికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని

తెలిపారు. ఈ విలేకరుల సమావేశం లోక్ సత్తా అధ్యక్షులు భీశెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #railway jone #Konathala Ramakrishna

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam