DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేబుల్ అధ్యక్షుడు పక్కి దివాకర్ దౌర్జన్యం నుంచి రక్షించండి మహాప్రభో : ఫైబర్ నెట్ ఎండి

. . . :  à°µà±‡à°¦à°­à±‚మి సంస్థ ఏపీ ( ఫైబర్ నెట్ ) à°Žà°‚à°¡à°¿ రామకృష్ణ 

విశాఖపట్నం, జనవరి 26, 2019 (DNS Online): మా ఫైబర్ నెట్ వైర్లు కట్ చేస్తూ, మా వ్యాపారానికి గండి కొడుతున్నారు రక్షించండి మహా

ప్రభో అంటూ ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ , వేదభూమి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ రామకృష్ణ హోమ్ శాఖా మంత్రిని కోరుతున్నారు. శనివారం విశాఖనగరం లోని సంస్థ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలో సుమారు పది వేల కనెక్షన్లు అందించామని, ఖాతాదారులకు సుస్పష్టమైన సేవలు అందించేందుకు అన్ని

ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే స్థానిక కేబుల్ ఆపరేటర్లు తమ కనెక్షన్ల వైర్లు కట్ చేస్తున్నా ఓపిక వహించమని, ఇక వీళ్ళ ఆగడాలు తీవ్రతరం అయ్యి, ఖాతాదారులకు

రోజుల తరబడి సానుకూల సేవలు అందించలేని పరిస్థితి తీసుకు వచ్చారన్నారు. రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల అధ్యక్షుడు పక్కి దివాకర్ ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఉత్తరాంధ్ర జిల్లా బీసీ సంఘాల కన్వీనర్) ఆధ్వర్యవం లో కొందరు దుండగులు తమ కార్యాలయం లోకి చొరబడి దాడి చేసారని తెలిపారు. ఈ దుండగులు తాము రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల

సంఘం అధ్యక్షుడు పక్కి దివాకర్ అనుచరులమని, తక్షణం ఈ నిర్వహణ ఆపివేయాలని హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాటు ఫీల్డ్ వర్క్ లో పని చేసే సిబ్బంది పై

కూడా ఈ దుండగులు భౌతిక దాడులు చేస్తున్నారన్నారు. ఈ ఘటనలతో తమ సిబ్బందిని రక్షించుకునే క్రమంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి కి ఫిర్యాదు చేశామని తెలిపారు. నగరం లోని

అన్ని పోలీసు స్టేషన్లలోనూ ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ ఫైబర్ నెట్ సంస్థ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన డిజిటల్ ఇండియా కార్యక్రమం లో భాగంగా

నిర్వహించబడుతోందని, తొలినాళ్లలో ఈ ఫైబర్ నెట్ నిర్వహణకై కేబుల్ ఆపరేటర్లను ఆహ్వానించారని, వారు ఇది చేయలేమని చేతులెత్తయ్యడంతో తాము ఈ నిర్వహణ చేపట్టామని

తెలియచేసారు. దీన్ని సహించలేని కేబుల్ ఆపరేటర్లు, తిరిగి ఈ కాంట్రాక్ట్ ను తమకు అప్పగించాలని బెదిరింపులు కూడా చేయడం జరిగిందన్నారు. తక్షణం ఈ కేబుల్ ఆపరేటర్ల

పేరిట అసాంఘిక చర్యలు చేపడుతున్న పక్కి దివాకర్, అతని అనుచరుల దుశ్చర్యల పై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #alumni  #andhra unviersity  #AP Fiber Net 

#Ramakrishna  #veda bhoomi  #veda bhumi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam