DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీరామ నామం తో పులకించిన  వానప్రస్థం వృద్ధాశ్రమం 

వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం, ఆనందంలో ఆశ్రమవాసులు  

విశాఖపట్నం, జనవరి 31, 2019 (DNS Online ): ఆలయానికి వెళ్లలేని వృద్ధుల చెంతకే శ్రీరాముని దర్శనం చేయించి, శ్రీరామ

పట్టాభిషేకం స్వయంగా జరిపించి వారిలో ఆనందోత్సాహాలు ప్రకటితం చేయించిన సందర్భంగా విశాఖలో వెలుగు చూసింది. విశాఖ నగరం లోని కంచరపాలెం లో గల వానప్రస్థం

వృద్ధాశ్రమంలో గురువారం ఉదయం నుంచి శ్రీరామాయణ పారాయణ చేయించి, అనంతరం శ్రీసీతారామ చంద్రులకు పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆశ్రమం లో ఆశ్రయం పొందినవారి తో

స్వయం గా అభిషేకం చేయించారు. దీంతో వారంతా ఆనందోత్సాహాలు లోనయ్యారు. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షులు జి ఆర్ కె ప్రసాద్ ( కళాభారతి రాంబాబు)

స్వయంగా శ్రీరామ పారాయణ, అనంతరం అభిషేక కార్యక్రమం నిర్వహింప చేశారు. ఈ కార్యక్రమం లో ఆవుపాలు, తేనే, చేరుకురసం, వివిధ పళ్ళ రసాలు, వివిధ పుణ్య తీర్ధాల నుంచి తీసుకు

వచ్చిన జలాలతో అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు అందరితో శ్రీరామ నామ గానం తో భజన చేయించారు. కార్యక్రమం లో వానప్రస్థము నిర్వాహకులు రొబ్బి శ్రీనివాస రావు,

ఆశ్రమం లోని 40 మంది ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ఆశ్రమ వాసుల ఆనందానికి హద్దుల్లేవు. తమ తల్లిదండ్రులు, పిల్లలు ఎలా ఉంటారో కూడా తాము మరిచిపోయామని, తమకు అన్నీ

నిర్వాహకులు శ్రీనివాసేనని, ఈ రోజు జరిగిన శ్రీరామ పట్టాభిషేకం తో తమ జీవితం తరించిపోయిందని ఆనందభాష్పాలు మధ్య తెలిపారు. తమ కుటుంబ సభ్యులు దగ్గర ఉన్నా ఇలాంటి

 à°®à°¹à°¦à±à°­à±à°¯à°¾à°—్యాన్ని కల్పించలేరన్నారు.అనంతరం అందరికీ ప్రసాద వితరణ చేపట్టారు. à°ˆ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు రొబ్బి శ్రీనివాస రావు మాట్లాడుతూ సమాజంలో

జీవిస్తున్నందుకు పెద్దలకు సేవ చేసుకునే భాగ్యం లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకూ, ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించి, వారి బాగోగులు

చూసుకోవడమే లక్ష్యంగా 2011 న ఈ వానప్రస్థ ఆశ్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లభించడం లేకున్నా, నిర్విరామంగా ఈ ఆశ్రమాన్ని

పూర్తిగా ఉచితంగానే నిర్వహిస్తున్నామని తెలియచేసారు.  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°•à°µà±‡à°¤à±à°¤à°²à±, సహృదయులు ఇతోధిక సహకారం చేస్తున్నారన్నారు. ఆశ్రమ వాసులందరికీ క్రామ్ తప్పకుండా

ప్రతి బుధవారం వైద్య సదుపాయం కల్పిస్తున్నామని, నెలసరి మందులు కూడా సరఫరా చేస్తున్నామన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #vanaprastham  #vana prastham #oldage home  #old age home

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam