DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీరికి కుటుంబం ఆలనా- ప్రభుత్వం పట్టింపు లేదు : వానప్రస్థము శ్రీనివాస్ 

వాళ్ళు పెద్దలు కాదు, నా పిల్లలే : DNS తో శ్రీనివాస్

విశాఖపట్నం, జనవరి 31, 2019 (DNS Online ): నిరాదరణకు గురై రోడ్డుపైకి వచ్చిన వృద్ధులంతా నా పిల్లలేనని సహృదయ శీలి రొబ్బి

శ్రీనివాస్ తెలియచేస్తున్నారు. విశాఖ వీధుల్లో నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన వృద్ధులను చేరదీసి తానే తల్లి తండ్రిగా మారిన యువకునికి సర్వత్రా అభినందనలు

వెల్లువవుతున్నాయి. విశాఖనగరం లోని పలు వీధుల్లో కుటుంబ సభ్యుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్డెక్కిన వృద్ధులను చేరదీసి తన అక్కున చేర్చుకున్న రొబ్బి

శ్రీనివాస రావు నిజంగా కరణ జన్ముడని నగర వాసులు కొనియాడుతున్నారు. విశాఖనగరంలోని కంచరపాలెం జాతీయ రహదారి కి అత్యంత సమీపంలో ఉన్న వానప్రస్థం వృద్ధాశ్రమం లో

సుమారు 41 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆశ్రమ కార్యాచరణ, నిర్వహణ తదితర వివరాలను DNS కు శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆశ్రమ సభ్యుల సంరక్షణ తో పాటు,

వైద్య ఆరోగ్య సమస్యలను కూడా దగ్గర ఉండి సంరక్షిస్తూ, చిన్న పిల్లల తరహాలో సేవలందిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కాఫీ, తేనీరు లాంటి ద్రవ పదార్ధాలు,

కాలకృత్యాల అనంతరం అల్పాహారం అందించి, ఒక గంట సమయం ధ్యానం, భజన, భగవదారాధనలు చేయిస్తూ వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారు. తదుపరి కాలక్షేపం కోసం టీవీ,

ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆటలు తదితర కనీస అవసరాలను కూడా కల్పించారు. ఇదే ఆశ్రమం లో అర డజను పైగా గోవులను పెంచుతున్నామని, వాటి సంరక్షణ భాద్యతలలో ఆశ్రమ వాసులకు

అవకాశం కల్పించామని శ్రీనివాస్ తెలియచేసారు. 

ప్రభుత్వ సహాయం శూన్యం, ఆధార్ కూడా ఇవ్వలేదు  :

సుమారు 41 మంది సభ్యులు ఉన్న ఈ వానప్రస్థం ఆశ్రమానికి

ప్రభుత్వ సహాయం పూర్తిగా శూన్యమేనని తెలిపారు. వీరంతా కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై రోడ్డెక్కిన సమయంలో తాము ఆదరించి, సేవలు చేస్తున్నామని తెలిపారు. వీరెవరికీ

ఆరోగ్య శ్రీ కార్డులు లేవని, ఇదే విషయమై ప్రభుత్వానికి గత రెండేళ్లుగా విజ్ఞాపన చేసినా నేటికీ ఫలితం లేదన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్

కార్యాలయ అధికారులకు ఎన్ని మార్లు వినతి పత్రం అందించినా పట్టించుకునే నాధుడే లేదన్నారు. తమ సన్నిహితులైన వైద్యులను ఆహ్వానించి, ప్రతి బుధవారం ఆశ్రమవాసులకు

వైద్య పరీక్షలు చేయిస్తున్నామన్నారు. ఆశ్రమం లోనే ఇన్ పేషంట్ కాబిన్ ఏర్పాటు చేశామని, బాగా సుస్తీ చేసిన వారికి ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. 

à°ˆ

ఆశ్రమం లో నిర్వహణ పూర్తిగా ఉచితమేనని, ఆశ్రమ వాసుల నుంచి ఎటువంటి రుసుము తీసుకోమని వివరించారు. కుటుంబ సభ్యుల్లో కనువిప్పు కలిగి, తిరిగి తమవారిని ఇంటికి

తీసుకు వెళ్తామని ఎవరైనా వచ్చిన పక్షంలో వారి నుంచి పటిష్టమైన లిఖిత పూర్వక హామీ ఇస్తేనే తిరిగి ఇంటికి పంపుతున్నట్టు తెలిపారు. కేవలం విశాఖ వాసులే కాక ఇతర

జిల్లాలకు చెందిన వారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం à°ˆ ఆశ్రమం లో సేదతీరుతున్నారని వివరించారు. 

చేయూత ఇవ్వండి, పెద్దల సేవలో పాల్గొనండి..

ఉచితంగా

నిర్వహిస్తున్న ఈ ఆశ్రమ కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొనాలని శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. నగర పరిధిలో వివిధ ఫంక్షన్లు జరుపుకునే సమయాల్లో కొంత సమయాన్ని

ఇలాంటి ఆశ్రమాలకు కేటాయించాలని, తద్వారా వీరికి ఆనందాన్ని కల్గించాలని కోరుతున్నారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా కొంత సమయాన్ని ఈ ఆశ్రమంలో గడపాలని

కోరారు. ఎవరినీ తాము విరాళం ఆడడం లేదని, పూర్తిగా మా స్వంత నిధులను వెచ్చించే  2011 నుంచి à°ˆ ఆశ్రమ నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం అద్దె గృహంలోనే

నిర్వహిస్తున్నామన్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో తాము చాలా అవస్థలు పడ్డామని, అప్పడిలో à°ˆ గృహం వేరే ప్రాంతంలో  
29 మందితో నడిచేదని, వెంటనే వసతి ఖాళీ చేయాల్సిందిగా

యజమాని చెప్పడంతో తాము అతి కష్టం పై వీరందరినీ ప్రస్తుత కేంద్రానికి తరలించామన్నారు. ఒక సారి తమ కేంద్రానికి వచ్చి కొంత సమయం గడపాలని నగర వాసులను కోరుతున్నారు.

ఆశ్రమాన్ని సంప్రదించవలసిన చిరునామా : ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల వెనుక లైన్, కంచరపాలెం, విశాఖపట్నం. మొబైల్ : 9666622288 (రొబ్బి శ్రీనివాస్).

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag 

#visakhapatnam  #bjp  #vanaprastham  #vana prastham #oldage home  #old age home  #Srinivas  #robbi  #kancharapalem  #NH 5

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam