DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర బడ్జెట్ లో  ఈ సారి కూడా ఆంధ్రాకు హుళ్లక్కే, 

రైల్వే జోన్ మాటే లేదు, హోదా సరే సరి 

విజయవాడ, ఫిబ్రవరి 01 ,2019 (DNS Online): ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన నరేంద్ర మోడీ సారధ్యం లోని కేంద్ర ప్రభుత్వం ఆఖరి బడ్జెట్

లోకూడా ఆంధ్ర ప్రదేశ్ కు హుళ్లక్కే చేసేసింది. శుక్రవారం పార్లమెంట్ లో కేంద్ర ఇంచార్జి ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టిన 2019-20 మధ్యంతర బడ్జెట్ లో కనీసం

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ గానీ, ప్రత్యేక హోదా, ప్యాకేజీల మాట మాత్రంగా కూడా ప్రకటించలేదు. దీంతో ఆంధ్రా లో నిరసనలు వ్యక్తమయ్యాయి. చాల ప్రదేశాల్లో

ప్రధాని దిష్టి బొమ్మలు దగ్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనిపై ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ శాఖలో కూడా నిరాశే వ్యక్తమవుతోంది. మొక్కుబడిగా బడ్జెట్ బాగుంది

అని చెప్పడం తప్ప, సంపూర్ణాంగా సమర్ధించలేకపోయారు. అయితే మిగిలిన బడ్జెట్ అంశాల్లో సాధారణ ప్రజలకు ఆర్ధిక వెసులుబాటు కల్పించింది. కేవలం ఓట్ల కోసం ప్రజలకు

గేలం వేశారని, ఏడాదికి ఐదు లక్షల ఆదాయం వచ్చేవారికి పన్ను రద్దు చేయడం కేవలం ఎన్నికల స్టెంట్ మాత్రమేనని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. ఇదే అంశంపై ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ సభ పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు ల మధ్య సభ వాగ్వివాదం జరిగింది. ఆంధ్రా కి ఎన్నో జాతీయ సంస్థలు

ఇచ్చామని, ఆశించిన దాని కంటే ఎక్కువగానే నిధులు కేటాయించామని విష్ణుకుమార్ రాజు సభలో ప్రకటించగానే, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన

రాష్ట్రానికి ఎదో గొప్పగా సాయం చేస్తారని à°—à°¤ ఎన్నికల్లో మద్దతు ఇచ్చామని, మోడీ మహా బాగా చేశారని ఎద్దేవా  à°šà±‡à°¶à°¾à°°à±. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #andhra pradesh #government  #state 

#assembly  #telugudesam  #chandra babu naidu  #vishnu kumar raju
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam