DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల బడ్జెట్ కాదు, భారత భవిత బాగుపడే బడ్జెట్ ఇది : బీజేపీ సుహాసిని ఆనంద్ 

కేంద్ర పధకాలతో బాబు తలపట్టుకుంటున్నారు. 

విశాఖపట్నం, ఫిబ్రవరి 01 ,2019 (DNS Online): భారత పార్లమెంటులో కేంద్ర ఇంచార్జి ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన

మధ్యంతర కేంద్ర బడ్జెట్టు రానున్న ఎన్నికల బడ్జెట్ కాదని, దేశ ప్రజల భవిత బాగుపడే బడ్జెట్ అని ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్

అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆమె స్పందిస్తూ ఈ బడ్జెట్ తో తో మొత్తం దేశ ప్రజల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందని , భారత దేశ చరిత్రలో

ఇంతకూ ముందెన్నడూ లేని విధంగా సామాన్యులు, ఉద్యోగుల ఆదాయ వనరులు రూ. ఐదు లక్షల వరకూ ఎటువంటి ఆదాయం లేకుండా పూర్తి మినహాయింపు లభించిందన్నారు. ప్రతి సామాన్యుని

ఇంటిలో వంట గ్యాస్ సదుపాయం, అతి సామాన్య యువతకు స్వయం ఉపాధి కోసం  à°®à±à°¦à±à°° రుణాలు అందించడం, మహిళా సమృద్ధి యోజనా, తదితర అతి ముఖ్యమైన పధకాలను అందించిన ఘనత నరేంద్ర

మోడిదే నన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని రోడ్లను విస్తరించడం, జాతీయ రహదారులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం తో పాటు, ఎన్నో ప్రోజక్టులు కోట్లాది రూపాయల

నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ విధమైన అభివృద్ధి ని ఆంధ్రా కి అందించిన మోడీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించ వలసి ఉండగా, రాష్ట్ర

అసెంబ్లీయే లో విరుచుకు పడడం ఆయనకే చెల్లిందన్నారు. పైగా రాష్ట్ర శాసన సభలో బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు కేంద్రం అందించిన సహాయాన్ని వివరిస్తున్న

సమయంలోనే పూనకం వచ్చినట్టు ఊగిపోతూ, వాస్తవాలను అంగీకరించలేక కేకలేయడం సభామర్యాదకు భంగం కల్గించేదిగా ఉందన్నారు. పైగా గత నాలుగున్నర సంవత్సరాల కాలం లో

అభివృద్ధి అనిపించిన విషయాలే నేడు తప్పుగా కనిపించడం కాదు శోచనీయమన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సన్నకారు రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలోకే

నిధులను బదిలీ చేయడం అత్యద్భుతమైన నిర్ణయం అన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #andhra pradesh  #union government  #budget  #lok sabha  #piyush goel  #goyal  #income  #taxes  #suhasini anand  #spokes person

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam