DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల ప్రకటన వరకూ రైల్వే జోన్ కోసం వేచి చూద్దాం: ఎంపీ హరిబాబు 

విశాఖపట్నం, ఫిబ్రవరి 02, 2019 (DNS Online): ఉత్తరాంధ్రా వాసుల చిరకాల వాంఛ, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను ఎన్నికల ప్రకటన వచ్చే వరకూ వేచి చూద్దామని విశాఖ లోక్ సభ సభ్యులు

డాక్టర్ కె. హరిబాబు తెలిపారు. శనివారం దువ్వాడ, సింహాచలం రైల్వే స్టేషన్లలో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

త్వరలో ప్రకటించనున్న ఎన్నికల ప్రకటన వరకూ వేచి చూద్దామని, తదుపరి అధిష్టానం ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ ముకుల్ శరన్ మధుర్

ప్రత్యేక శ్రద్ద వహించి, ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అత్యాధునిక టాయిలెట్స్ ను

నిర్మించారని, దువ్వాడ, సింహాచలం స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా మార్చడం ద్వారా విశాఖ ప్రధాన కేంద్రం పై ఉన్న భారం కొంత వరకు తగ్గుతుందన్నారు. దీనిలో

భాగంగానే గరీబ్ రధ్ కు దువ్వాడ స్టేషన్ లో హల్ట్ ఇవ్వడం వలన, గాజువాక, స్టీల్ ప్లాంట్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అదే విధంగా

సింహాచలం, శివారు ప్రాంతాల వారికి సౌకర్యంగా సదుపాయాలు కల్పించారన్నారు. à°ˆ బ్రిడ్జిల నిర్మాణం  à°°à±‚.  2 కోట్ల 50 లక్షల వ్యయంతో జరిగిందన్నారు.  à°ªà°¾à°¤ బ్రిడ్జి కూడా

మరమ్మత్తులు చేసి, నూతన బ్రిడ్జి తో అనుసంధానం చేసేవరకు కొనసాగిస్తామన్నారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో విశాఖ రైల్వే డివిజన్ కు రూ 1733 కోట్ల నిధులు

కేటాయించారని, ప్రధానంగా వాల్తేర్ డివిజన్ లో వేగన్ వర్క్ షాప్ à°•à°¿ అత్యధిక నిధులు వచ్చాయన్నారు. అంతకు ముందు దువ్వాడ స్టేషన్ లో  35 వేల  à°²à±€à°Ÿà°°à±à°² కెపాసిటీ కల్గిన

మంచినీటి ట్యాంక్ ను కూడా అయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం లో విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్ ముకుల్ శరన్ మధుర్, సీనియర్ డీసీఎం జి. సునీల్ కుమార్, సీనియర్

డివిజనల్ ఇంజనీర్ ప్రదీప్ యాదవ్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్ ఎన్ సింగ్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag 

#visakhapatnam  #haribabu  #railway  #zone  #union government  #bjp  #narendra modi  #waltair division  #drm  #mukul sharan madhur  #foot over bridge

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam