DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవో 76 అర్చకుల పాలిట అక్షయ పాత్ర: సలహాదారు రామకోటయ్య  

à°ˆ జీవో వస్తేనే తెలుగుదేశం పార్టీలో చేరతా : రామకోటయ్య  

విశాఖపట్నం, ఫిబ్రవరి 02, 2019 (DNS Online): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న జీవో 76 అన్ని ఆలయాల అర్చకులకు

కల్పతరువు లాంటి అక్షయ పాత్ర అని ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖా సలహాదారు చెఱువు రామకోటయ్య అన్నారు. ఆదివారం నగరం లోని పేదవాల్తేరు లో గల కరకచెట్టు పోలమాంబ ఆలయం లో

జరిగిన ఆత్మీయ కలయికలో ఆయన మాట్లాడుతూ అర్చకులంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదని, అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారని, తాము యావత్ అర్చక సమాజానికి లబ్ది

కలిగే విధంగా ఈ జీవో ను సాధించేందుకే కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్రం లోని కేటగిరి బి, సి పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాలు, ఏకో అర్చక ఆలయాలు ఈ జీవో పరిధిలోకి

రావాలన్నారు. à°ˆ ఆలయాల్లోని అర్చకులకు కనీస వేతనం నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని, నిర్బంధ పదవి విరమణ నిబంధన తొలగించాలని, అర్చకులకు శరీరం సహకరించినంత  à°•à°¾à°²à°‚ వారు ఆలయంలో

అర్చనలు చెయ్యాలని, తదుపరి వారి కుటుంబ సభ్యులు లేక వారసులకు ఆ అర్చనాది భాద్యతలు అప్పగించాలని, వీరందరికి వైద్య, విద్య సదుపాయాలు పూర్తిగా ఉచితంగా కల్పించాలని

తదితర అంశాలు ఉన్నాయన్నారు. ఈ జీవో పూర్తిగా అమలు లోకి వస్తే అర్చక కుటుంబాల జీవన శైలి మారిపోతుందన్నారు. తాను గతం లో భారతీయ జనతా పార్టీలోనూ, ఎయిర్ ట్రావెలర్స్

సంఘం అధ్యక్షునిగాను, బిల్డర్స్ సంఘం జాతీయ ఉపాధ్యక్షునిగాను నిర్వర్తించిన  à°­à°¾à°¦à±à°¯à°¤à°²à± దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా సళాయదారుగా భాద్యతలు చేపట్టడం జరిగిందన్నారు. అర్చక ఉపయుక్త జీవో 76 ను పలువురు ఆగమ, ప్రభుత్వ అధికారులతో కలిసి సంపూర్ణాంగా

సిద్ధం చెయ్యడం జరిగిందన్నారు. సోమవారం ఈ జీవో ను ఆమోదించనున్నారని అనంతరమే తాను అధికార తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు ప్రకటించారు. తాను ఏ

పార్టీలో ఉన్నప్పటికీ, ఇతరులు చేసే మంచి పనులను అభినందించడం, తప్పు నిర్ణయాలు తీసుకుంటే విమర్శనాత్మక సూచనలు చెయ్యడం తన కర్తవ్యమని తెలిపారు. ఈ విధమైన గుణాలను

గమనించే ముఖ్యమంత్రి తనకు ఈ భాద్యతలను అప్పగించినట్టు తెలియచేసారు. ఈ ఆత్మీయ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డిఎల్ ఓ వసంతవాడ పురుషోత్తమరాజు,

క్రెడిట్ సొసైటీ డైరక్టర్ వి. భానుమూర్తి, బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్, ఉత్తరాంధ్ర అర్చక సంఘ సంయుక్త కార్యదర్శి కొత్తలంక

మురళీకృష్ణ, సీనియర్ పాత్రికేయులు ఎస్. వీరభద్రరావు, వివిధ ఆలయాల అర్చక, అర్చాకేతర ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #andhra

pradesh  #endowments  #cheruvu ramakotaiah  #brahmana sangham  #archaka

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam