DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాన్య విలేకరి నుంచి జాతీయ సంఘం కార్యదర్శిగా గంట్ల ప్రస్థానం 

విశాఖపట్నం, ఫిబ్రవరి 02, 2019 (DNS Online): సామాన్య విలేకరి స్థాయి నుంచి జాతీయ పాత్రికేయ సంఘం (ఎన్ ఏ జె - నేషనల్ అల్లైయాన్స్ జర్నలిస్ట్స్)  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ స్థాయికి ఎదిగిన విజెఎఫ్

అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబుకు అభినందనలు వెల్లువవుతున్నాయి. సాధారణ విలేకరిగా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన గంట్ల శ్రీనుబాబు, అంచెలంచెలుగా ఎదిగి,

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ కార్యదర్శిగాను, తదుపరి విజెఎఫ్ అధ్యక్షునిగాను ఎన్నికై, విశాఖ పాత్రికేయ ప్రతిభను రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఇనుమడింపచేశారు.

రాష్ట్రంలోనే ప్రధాన పాత్రికేయ కార్మిక సంఘమైన ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీ డబ్ల్యు జె ఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా వరుసగా ఆరు పర్యాయాలు

ఎన్నికై, నిర్విఘ్నంగా సేవలు అందిస్తున్నారు. విజెఎఫ్ అధ్యక్షునిగా శ్రీనుబాబు సారధ్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వైభవం దేశంలోని ఇతర ప్రాంతాల

పాత్రికేయ సంఘాలకు సైతం స్ఫూర్తిని కల్గించింది అనడం అతిశయోక్తి కాదు. విశాఖ జిల్లా పరిధిలో ఏ సంస్థ కు చెందిన పాత్రికేయునికి అయినా సహాయం అవసరం పడిన

సందర్భాల్లో సమాచారం తెలిసిన వెంటనే నేనున్నా అంటూ చేయూత ఇచ్చే నాయకునిగా సహకారం అందించే తొలి వ్యక్తి గంట్ల శ్రీనుబాబు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా రాష్ట్ర

స్థాయి క్రీడలు, పాత్రికేయ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో అందే వేసిన చేయి ఈయనదే. ఈయన పాత్రికేయ సంఘానికి చేసిన సేవలకు గుర్తింపు గా శ్రీనుబాబు ను

కార్యదర్శి à°—à°¾ నియమిస్తున్నట్టు ఎన్ ఏ జె జాతీయ అధ్యక్షులు ఎస్ కె పాండే à°’à°• ప్రకటన విడుదల చేశారు. à°ˆ ఉత్తర్వులను ఏపీ డబ్ల్యు జె ఎఫ్ విశాఖ నగర అధ్యక్షులు పి. నారాయణ

అందించారు. à°ˆ నియామకం పట్ల గంట్ల శ్రీనుబాబు స్పందిస్తూ తన పట్ల జాతీయ జర్నలిస్ట్స్ సంఘం ఇచ్చిన భాద్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. 

 

 

#dns  #dns

live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh  #journalists  #APWJF  #NAJ  #Gantla Srinu babu  #VJF

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam