DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విభజన హామీలపై బీజేపీ తీరు దున్నపోతు పై వాన పడ్డట్టే : కొణతాల 

విశాఖపట్నం, ఫిబ్రవరి 04, 2019 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ విభజన హామీలపై భారతీయ జనతాపార్టీ తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉందని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చ వేదిక

కన్వీనర్ కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన

పరిస్థితుల్లో పూర్తి నిర్లక్ష్యంగా జరిగిన విభజన క్రమం లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల పోరాట

ఆరాటం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు పై కనీసం కేంద్రం లో నోరెత్తిన మనిషి లేదన్నారు. ఈ హామీల అమలు కోసం గత నెలాఖరు లో ఉత్తరాంధ్ర చర్చ వేదిక ప్రతినిధులతో

దేశ రాజధానికి వెళ్లామన్నారు. ఆంధ్ర కి పెద్ద దిక్కుగా ఉన్న నాటి కేంద్ర మంత్రి, ప్రస్తుతం ఉపరాష్ట్ర పతిగా ఉన్న ఎం. వెంకయ్య నాయుడు ను కలిసి, ఆంధ్ర ప్రదేశ్ కు

విభజన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయవలసిందిగా కోరినట్టు తెలిపారు. ఆయన సైతం రైల్వే జోన్ ఏర్పాటు పై సానుకూల సందేశం ఇచ్చినట్టు వివరించారు. ప్రధానంగా ఈ

పర్యటనలో కేంద్ర ప్రభుత్వం లో ఉన్నత హోదాల్లో విధులు నిర్వహించిన మాజీ ఐఏఎస్ లు, వివిధ కేంద్ర విద్యాలయాల ఉప కులపతులు, విద్య వేత్తలతో సమావేశాలు నిర్వహించిన

తదుపరి, విభజన చట్టం లో ఇచ్చిన హామీలు, నేటి వరకు అందించిన సహాయం పరిశీలించి,  à°µà°¾à°°à± à°’à°• నివేదికను అందించినట్టు తెలియచేసారు. వీటిల్లో ప్రధానంగా  
2014 - 15 సంవత్సరానికి

వనరుల లోటును పూర్తి చేసేందుకు రూ.  19,015.48 కోట్లు కేటాయించవలసి యుండగా కేవలం రూ. 3970 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, వీటిలో ఇప్పడికే ఖర్చు చేసిన వ్యయం కూడా ఉందన్నారు.

నాటి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ లు పూర్తి నిర్లక్ష్యంగా తయారు చేసి, ఆంధ్రా ను భూ స్థాపితం చేసిన ఫలితంగా ప్రత్యేక హోదా ఇవ్వక పోగా ప్రత్యేక

ప్యాకేజి కూడా ఇవ్వలేదన్నారు. అదే విధంగా కేంద్ర నిధుల్లో వాటా లో సైతం కోత విధించారని, పోలవరం ప్రాజెక్ట్  à°ªà±‚ర్తి చెయ్యడానికి త్వరితగతిన నిధులు విడుదల

చేయాలన్నారు. వెనుక బడిన ఏడు జిల్లాలకు ( ఉత్తరాంధ్ర మూడు జిల్లాల తో పాటు రాయల సీమ నాలుగు జిల్లాలు) బుందేల్ ఖండ్ తరహాలో ఐదేళ్ల కాలంలో రూ.24,350 కోట్ల నిధులతో  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•

ప్యాకేజి ఇవ్వవలసి ఉండగా కేవలం 50 కోట్ల రూపాయలే కేటాయించి పూర్తిగా అవమానించారని మండిపడ్డారు. ఇక మౌలిక వసతులైన మెట్రో రైలు పరిస్థితి ఏంటో తెలియదని,

పెట్టుబడులతో ప్రాజెక్ట్ లు రావాల్సి యుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం లో ఆంధ్రాకి ఇరు పార్టీలు తీరని ద్రోహం

చేస్తున్నాయన్నారు. ఈ విలేకరుల సమావేశం చర్చ వేదిక ప్రతినిధులు జెవి సత్యనారాయణ మూర్తి ( సిపిఐ), భీశెట్టి బాబ్జి ( లోక్ సత్తా) తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns

media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #railway zone  #CPI  #Konathala Ramakrishna  #Lok Satta  #Venkaiah naidu  #Uttarandhra Charcha Vedika  #New Delhi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam