DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భీమవరం లో  మెరైన్ వర్సిటీ ఏర్పాటు కు ప్రభుత్వం అనుమతి

మత్య్స, సముద్ర ఉత్పత్తులపై విస్తృత పరిశోధనలు 

సముద్ర జలాలపై పరిశోధన పట్టు కోసం విశ్వ ప్రయత్నం.

అమరావతి (సచివాలయం) , ఫిబ్రవరి 05, 2019 (DNS Online) : à°¸à°®à±à°¦à±à°° జలాలపై

పరిశోధన పట్టుకోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో మత్స్య, సముద్ర (మెరైన్) యూనివర్సిటీ ని వచ్చే విద్యా

సంవత్సరం నుంచి మొదలయ్యే విధంగా అనుమతులు ఇచ్చినట్టు రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, మత్స శాఖామంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు.  à°®à°‚à°—à°³ వారం ఆంధ్ర ప్రదేశ్

సచివాలయం లో జరిగిన ఓ కార్యక్రమం లో విద్యాలయ నిర్వాహకులకు మంత్రి ప్రభుత్వ అనుమతి పాత్రలను అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపం లోని లోసరి లో 150

ఎకరాల్లో సుమారు రూ. 300 కోట్ల వ్యయం తో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చెయ్యనున్నారు. దేశంలోనే మూడవ మెరైన్ విశ్వ విద్యాలయం ఇది. వచ్చే ఏడాది జూన్ నుంచి తరగతులు ప్రారంభం

కానున్న ఈ విద్యాలయం లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, కోర్సులతో పాటు పరిశోధనలు, పిహెచ్ డి, ఎంబీఏ, మెరైన్ లా కోర్సులు, తదితర అత్యుత్తమ ఉపయోగ

కోర్సులను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలను ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, సమకాలీన ప్రవేశ పరీక్షల ద్వారానే

చేపడతామని తెలియచేసారు. ప్రభుత్వ, ప్రయివేట్, భాగస్వామ్యంలో ఏర్పాటవుతున్న ఈ విద్యాలయం లో 51 శాతం వాటా తో ఉద్దరాజు ఆనందరాజు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ముందుకు

వచ్చిందని, మిగతా వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని మంత్రి వివరించారు. మత్స్య, విజ్ఞాన శాస్త్ర గ్రాడ్యుయేషన్ లో ఫిషరీస్ సైన్స్  à°¬à±à°¯à°¾à°šà°¿à°²à°°à± కోర్సు, బిటెక్ లో

పోర్ట్, హార్బర్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఫిష్ బ్రీడింగ్, ఫిష్ పాథాలజీ, ఆక్వా హెల్త్ మేనేజ్మెంట్, జెనెటిక్స్ బయో

టెక్నాలజీ, తదితర కోర్సులుంటాయన్నారు. ఓషన్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో మెరైన్ కెమిస్ట్రీ,  à°®à±†à°°à±ˆà°¨à± జియో ఇన్ పటిక్స్ తదితర కోర్సులను దేశంలోనే

మొట్టమొదటి సారిగా ఇక్కడ ప్రారంభించాన్నట్టు తెలియచేసారు. వీటితో పాటు మత్స్య శాఖ అధికారులకు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహనా సదస్సులు, చేపడతామని

వివరించారు. ఈ ఒప్పంద అనుమతి పత్రాలను మంత్రి ఆదినారాయణ రెడ్డి నుంచి ఆనంద్ గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు, డైరక్టర్ రామకృష్ణం రాజు, కంతేటి

వెంకట్రాజు, అల్లూరి నాగరాజు వర్మ, తదితరులు అందుకున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #andhra pradesh  #bhimavaram  #west godavari district  #marine university  #government  #private  #aqua  #marine products  #fisheries #research
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam