DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హస్తిన లో హోదా హెచ్చరికల్లో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఆడారి 

ఆంధ్రుల ఆవేదన మోడీ కి వినపించకపోతే వైద్యం అవసరమే : ఆడారి కిషోర్

​​​​​​​ఉత్తరాంధ్ర బెబ్బులి గర్జనకు ఢిల్లీ వీధులు అబ్బా. . 

న్యూ ఢిల్లీ,

ఫిబ్రవరి 11, 2019 (DNS Online) : à°—à°¤ ఐదేళ్లుగా ఆంధ్రులు  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ ఆర్తనాదాలు ప్రధాని నరేంద్ర మోడీ à°•à°¿ గానీ, కేంద్రం లోని బీజేపీ à°•à°¿ గాని వినిపించక పొతే తక్షణం వైద్యుల్ని

సంప్రదించాలని  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆడారి కిషోర్ కుమార్ ఎద్దేవా చేశారు.  à°¦à±‡à°¶ రాజధాని హస్తినలో ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం లో జరుగుతున్న ధర్మ పోరాట దీక్షలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ఈ నెల 11,12 తేదీల్లో జరుగుతున్న

ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ యువజన జే.ఏ.సి తరపున రాష్ట్ర కన్వీనర్ హోదాలో పాల్గొన్నట్టు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా,

విశాఖ రైల్వే జోన్ సహా మిగిలిన విభజన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు ప్రధాని నరేంద్ర

మోడీకి వినిపించడం లేదని, దూరంగా ఉండడం వల్ల వినపించలేదనుకుని, ఏకంగా పార్లమెంట్ కి దగ్గరలోకే వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నామన్నారు. ఇప్పడికీ తమ ఆవేదన కేంద్రం

లో అధికారం లో ఉన్న మోడీకి, బీజేపీ కి వినపడక పొతే వాళ్ళు వైద్యుల్ని సంప్రదించాల్సియుంటుందన్నారు. వీళ్ళ నిరంకుశ వైఖరికి నీరసంగా వీళ్ళకి గట్టిగా బుద్ధి

చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోడీ మాట వినే రాష్ట్ర ప్రజలు అతీగతీ లేని బీజేపీ కి ఇద్దరు ఎంపీలు, 4 గురు

ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీ లను ఓట్లు వేసి గెలిపించారన్నారు. వీళ్లంతా కళ్ళున్న కాబోడులుగాను, చెవులున్నా దివ్యంగులుగానూ మారిపోయారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్షకు దిగటం రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేయటం గర్వకారణమని తెలిపారు. నిర్లక్ష్య

 à°µà°¿à°­à°•à±à°¤ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖకు రావాల్సిన రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవ్వాలని

కేంద్ర పై ఒత్తిడి తీసుకురావడం కోసం జరుగుతున్న ఈ దీక్షకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఈ దీక్షలతో కేంద్రంలో కదలిక వచ్చి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా

నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని ప్రత్యేక హోదా రావటం వలన విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు, యువకులకు రావటం  à°¤à°¥à±à°¯à°‚ అన్నారు.

ఇంతకాలం గల్లీల్లో జరిగిన దీక్షలను దేశ రాజధాని ఢిల్లీ కి తీసుకువెళ్లి ఢిల్లీ పీఠం కుదుపేశారన్నారు. ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్, మాజీ

ప్రధాని మన్మోహన్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ తదితర అన్ని పార్టీల ప్రతినిధులు సహా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే లు, ఎంపీ లు, తెలుగుదేశం

పార్టీ కార్యకర్తలు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news #dns media  #dns live  #vizag   #visakhapatnam  #bjp  #telugudesam  #chandrababu naidu  #adari kishore kumar  #delhi  #protest  #dharma porata deeksha

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam