DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రధసప్తమి నాడు ఆదిత్యుని అనుగ్రహానికి ఆరాధనలు 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 12, 2019 (DNS Online) : మాఘ శుద్ధ సప్తమి à°°à°§ సప్తమి పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాడవాడలా సూర్యారాధనలు నిర్వహించారు. సమస్త మానవాళికి వెలుగును

ప్రసరింపచేసే ఆదిత్యుని కరుణ కటాక్షాలు లభించాలని సాగరతీరం నగరం విశాఖపట్నం లో ఎందరో వేద పారాయణలతో సూర్య భగవానుని ఆరాధించారు. తెల్లవారు ఝామునే జిల్లేడు ఆకు -

రేగి పండు తలపై ధరించి స్నానాదులు ముగించి, ఆరాధన చేపట్టి, ఆదిత్యునికి ఎదురుగా సంప్రదాయబద్ధమైన కుంపటి పై బొగ్గులను వెలిగించి, ఇత్తడి గిన్నెలో పాలు - బెల్లం, ఆవు

నెయ్యి వేసి క్షీరాన్నం  à°¤à°¯à°¾à°°à± చేస్తూ ఆదిత్య హృదయ పఠనం తో నైవేద్యం తయారు చేసి, స్వామిని నైవేద్యం పెట్టి, లోకా సమస్తా సుఖినో భవంతు అని వేదపఠనం చెయ్యడం

ఆనవాయితీ. ఇదే సమయంలో సూర్యనమస్కారాలు చెయ్యడం మరింత శ్రేష్టం.  à°‡à°¦à±‡ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దాదాపుగా తెలుగు వారి ఇంట స్వామిని ప్రార్ధించి సంప్రదాయాన్ని

పాటించారు. యజ్ఞోపవీత  à°§à°¾à°°à±à°²à±ˆà°¨ చిన్నారులు చేసిన ఆదిత్య హృదయ పఠనం అందరినీ ఆకట్టుకుంది. పూర్వపు ఆచార సంప్రదాయాలను కొనసాగించడం ద్వారా సనాతన ధర్మ విలువలు నేటి

తరానికి తెలుస్తాయి, పెద్దలు ఆచరిస్తే, చిన్నవాళ్లు పాటించడం అలవాటు చేసుకుంటారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #radha saptami  #surya namaskaram  #adityaya upasana

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam