DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు మైదానాలు : మోడీ సభకు నో, తాగి తైతక్కలాటలకి ఒకే

దేశానికి దాసులకే ఎయు లో మైదానాలు ఇస్తాం : ఎయు వీసీ 

నిధులు కేంద్రానివి, షోకులు తెలుగుదేశానికి. 

మద్యం కు సంబంధించి కోర్సులు కూడా ఏయు లో

పెట్టేశారా?

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 18, 2019 (DNS Online ): మార్చి 1 à°¨ విశాఖ రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టే బహిరంగ సభకు మైదానాలు ఇవ్వడం కుదరదు అని

ఆంధ్రవిశ్వవిద్యాలయం (ఎయు) ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు తేల్చి చెప్పేసారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ ఎయు లో జరిగిన విలేకరుల సమావేశం లో అయన తనదైన శైలిలో జవాబులిచ్చారు.

ఎటువంటి పరిస్థితుల్లోను విద్య పరమైన కార్యక్రమాలకే ఎయు మైదానాలు అద్దెకు ఇవ్వడం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక జిఓ విడుదల చేసింది. దీని ప్రకారం

విద్యకు సంబంధం లేని కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన సొంత కార్యక్రమం మూడు రోజుల పాటు జరిగిన మహానాడు కు, శ్రీకాకుళం ఎంపీ

రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్ కి, మంత్రి గంటా అనుచరుల పెళ్లి వేడుకలకు యధేచ్చగా ఇచ్చిన విషయం పై స్పందిస్తూ రాష్ట్ర అధికార పార్టీ కి ఎటువంటి అనుమతులు

అవసరం లేదు అనే సంకేతాలు వచ్చాయనే విధంగా చెప్పడం జరిగింది.  à°…యితే à°ˆ జీవో విడుదలైన వెంటనే మద్యం టెండర్లకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏకంగా ఎయు కాన్వకేషన్

హాలు నే వేదికగా అద్దెకు ఇచ్చేసారు. దీనిపై విద్యార్థులు, మీడియా విసి ని ప్రశ్నించగా మా భవనాలు మా ఇస్తాం మాకు నచ్చిన వారికి ఇస్తాం అనే సంకేతం వచ్చే విధంగా

సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు. అంటే మద్యం ను కూడా ఒక అంశంగా ఆంధ్ర విశ్వ విద్యాలయం లో కోర్సులు మొదలు పెట్టేశారా, అందుకేనా మద్యం టెండర్లను ఎయు లో

నిర్వహించారు అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. దీనికి కొనసాగింపుగా అన్నట్టు రెండు రోజుల క్రితం ఒక మద్యం వ్యాపారి వ్యాపార ప్రచార కార్యక్రమానికి ఎయు

ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని యధేచ్చగా అద్దెకు ఇచ్చేసారు. ఈ ప్రోగ్రాం లో తాగి, తందానాలు, అర్ధనగ్న నృత్యాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై సమాధానం గా

తెలుగుదేశం పార్టీకి చెందిన వారి కార్యక్రమం కావడంతో రాష్ట్ర రాజధాని నుంచి ఆదేశాలు వచ్చాయని విసి తెలిపారు.  à°ˆ విధమైన ఘటనల నేపథ్యంలో, ఇక్కడ చెప్పిన జీవో

ప్రకారం మద్యం సంబంధిత కార్యక్రమాలు ఈ మైదానాల్లో జరుపుకునేందుకు అనుమతి ఇస్తున్నారు అంటే మద్యం కు సంబంధించి కొన్ని కోర్సులను కూడా ఆంధ్రవిశ్వవిద్యాలయం

(ఎయు) మొదలు పెట్టేసిందా అంటే సమాధానం ఎయు వీసీ ఏ చెప్పాల్సియుంది. ఎయు లోని భవనాలు, మైదానాలు కేవలం అధికార తెలుగుదేశం పార్టీకి దాసులుగా ఉన్నవారికే ఇవ్వడం

జరుగుతుంది అనే సంకేతాన్ని ఏయూ వీసీ డాక్టర్ జి.నాగేశ్వర రావు ప్రకటించేశారు. దేశ ప్రధాని అయినా రాష్ట్రం లోని అధికార పార్టీకి దాసులుగా ఉంటేనే ఎయు లో సభలు

పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అనే స్పష్టత వచ్చేసింది.  à°­à°¾à°°à°¤ ప్రధాని నరేంద్ర మోడీ ని ఆంధ్ర ప్రదేశ్ లో అడుగు పెట్ట నివ్వం  à°…ని ఖరాఖండిగా

ప్రకటిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలున్నా à°ˆ రాష్ట్రం లో ఎయు లో ప్రధాని బహిరంగ సభ పెట్టుకోడానికి అనుమతి ఇస్తారు అని ఎవరైనా ఎలా అనుకోగలరు?  à°…యితే ఎయు వీసీ జి.

నాగేశ్వర రావు భారతీయ జనతా పార్టీకి చెందిన సంఘ్ పరివార్ తో అనుబంధం కల్గి ఉన్నవారు కావడం గమనార్హం.  

ఎయు లో జరిగే చాలా కోర్సుల అభివృద్ధికి, పరిశోధనలకు

కోట్లాది రూపాయల  à°¨à°¿à°§à±à°²à± ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, తదితర విభాగాల నుంచే

వస్తుంటాయి. పైగా యూనివర్సిటీ కి అధికారిక గుర్తింపు ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం, నిర్వహణ కు నిబంధనలు విధించేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలే. అలాంటిది

కేంద్రం నిధులతో నడిచే విద్యా సంస్థపై  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లో అధికారం లో ఉన్న పార్టీ గుత్తాధిపత్యం చెయ్యడం ఏంటనే ప్రశ్నలకు వీసీ జవాబు

చెప్పాల్సియుంది. 

ప్రస్తుతం వాణిజ్య వ్యాపార సంస్థలకు చెందిన మెగా ట్రేడ్ ఫేర్ ఇదే ఎయు ఇంజనీరింగ్ మైదానం లో జరుగుతోంది. ఈ ప్రదర్శన విద్యారంగానికి

ఏమాత్రం సంబంధం లేనిది, పైగా విద్యార్థులకు దమ్మిడీ ఉపయోగం కూడా ఉండదు, పైగా పూర్తిగా కమర్షియల్ కార్యక్రమం ఇది. మరి దీనికి ఏ రూలు ప్రకారం అనుమతి ఇచ్చారో

వివరించాల్సిన భాద్యత ఎయు వీసీ పై ఉంది అన్నది వాస్తవం. ఈ తరహా కార్యక్రమాలు సాధారణం గా నిర్వహించేది అధికార పార్టీకి చెందినవారో, వారి సానుభూతి పేరులో కావడం

తోనే అనుమతి లభిస్తోంది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra university  #telugudesam  #andhra pradesh  #prime minister  #narendra modi

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam