DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక ఆంధ్రా నుంచే పోస్టల్ ద్వారా విదేశీ పార్సిల్ సేవలు

విజయవాడ లో తొలిసారిగా విదేశీ పార్సిల్ పోస్టాఫీస్ సేవలు 

విశాఖ ఎస్ఎస్ పిఎన్ వెంకటేశ్వరరావు 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 19, 2019 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లోని

పారిశ్రామికవేత్తలకు, తరుచుగా విదేశాలకు పార్సిళ్లు పంపించే వారికి తపాలా శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చిందని విశాఖపట్నం తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర

రావు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తపాలా శాఖ ద్వారా విదేశాలకు పార్సిళ్లు ను ఇక పై ఆంధ్రా నుంచే పంపవచ్చని తెలియచేసారు. ఇంత వరకూ చెన్నై, బెంగుళూరు

లేదా ఇతర రాష్ట్రాల నుంచి క్లస్టర్ సంస్థలు తమ ఉత్పత్తులను నానా కష్టాలు పడి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. వీరందరి కష్టాలు ఇకపై సమసిపోనున్నాయన్నారు.

పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పధంలో నడుస్తున్న ఆంధ్ర ప్రదేశ్ లోని పరిశ్రమలకు అనువుగా ఉండే విధంగా ఆంధ్రా ప్రాంత చీఫ్ పోస్ట్ మాస్టర్ కె ఎస్

బాలసుబ్రహ్మణ్యన్ విజయవాడ కేంద్రంగా ఒక విదేశీ పోస్టల్ కేంద్రాన్ని ప్రారంభించారని తెలియచేసారు. ఇక పై ఆంధ్రా లోని పరిశ్రమల నుంచి విదేశీ ఎగుమతులను విజయవాడ

పోలి టెక్నీక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ విదేశీ పోస్టాఫీస్ కౌంటర్ నుంచి పంపవచ్చన్నారు. ఇదే కేంద్రం ద్వారా సంబంధిత కస్టమ్స్ అధికారులు ఈ ఉత్పత్తులను తనిఖీ

చేసి, సత్వరంగా సంబంధిత గమ్య స్థానాలకు రవాణా చెయ్యడం జరుగుతుందన్నారు. విశాఖ కేంద్రంగా సుమారు 79 మంది భారీ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు నిత్యం విదేశాలకు

ఎగుమతి అవుతున్నాయని, వీరంతా చెన్నై, బెంగుళూరు నుంచి బుకింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై వీరు విజయవాడ కేంద్రం నుంచి బుకింగ్ చేయవచ్చన్నారు. తద్వారా సమయం,

వ్యయం ఆదా అవుతాయన్నారు.ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే పరిశ్రమల ప్రతినిధులు, ఏజెంట్లు, అన్ని తరహాల ఖాతాదారులు తపాలా శాఖ

ద్వారా విదేశాలకు పార్సెల్ సేవ ను పొందే విధంగా జనవరి 31 2019 నాడు ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. విశాఖ కేంద్రంగా వ్యాపార, వాణిజ్య లావాదేవీలు చేస్తున్న

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హిందుస్తాన్ షిప్ యార్డ్, హెచ్ పీసీఎల్, ఫార్మా, మత్య్స సంపద, నూలు, సున్నం బట్టీలు, బంగారం,  à°µà°¸à±à°¤à±à°°, బియ్యం, ఇతర దినుసులు తదితర సంస్థల

నుంచి నిత్యం ఎన్నో ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, వీటన్నింటిని ఇకపై విజయవాడ నుంచే పంపవచ్చన్నారు. à°ˆ కేంద్రం ద్వారా విదేశీ బుకింగ్ చేసే వారు 
/> ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నిబంధనలు అనుసరించి పీబీఈ (పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్  1 లేదా 2 ) కాపీలను, ఇన్ వాయిస్ తో పాటు జతపరచవలసియుంటుందన్నారు. వీటిని స్థానికంగా

కస్టమ్స్ అధికారులు పరిశీలించి, వాటిని నేరుగా గమ్య స్థానాలకు చేరుస్తారని తెలిపారు. ఐ జి ఎస్ టి (ఇంటర్నేషనల్ జి ఎస్ టి) రిఫండ్ ద్వారా గాని, ఎల్ యు టి (లెటర్ ఆఫ్ అండర్

స్టాండింగ్ ) ద్వారా వినియోగించుకుంటే ఎటువంటి  à°Žà°—ుమతి సుంకం పన్ను ఉండదని తెలిపారు. à°ˆ పన్ను పరిధిలోకి రాని వారు కూడా à°ˆ విదేశీ పోస్టాఫీస్ కౌంటర్ ను

వినియోగించుకోవచ్చని వెంకటేశ్వర రావు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు, వస్తు ఉత్పత్తిదారులు ఈ అవకాశాన్ని

సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #post office  #foreign  #parcel  #MSMEs  #Vijayawada  #SSPN  #venkateswara rao  #export  #import  #IGST  #LUT

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam