DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 నుంచి విశాఖలో జాతీయ వెయిట్ లిఫ్ట్ పోటీలు : డిఆర్ఎం మధుర్ 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 19, 2019 (DNS Online ): à°ˆ నెల 22 నుంచి 28 వరకూ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు విశాఖపట్నం లో నిర్వహిస్తున్నట్టు విశాఖపట్నం డివిజినల్ రైల్వే మేనేజర్ ముకుల్

శరన్ మధుర్ తెలిపారు. మంగళవారం రైల్వే డి ఆర్ ఎం కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం లోని రైల్వే మైదానం లో 71 వ పురుషుల, 34 వ మహిళల

వెయిట్ లిఫ్టింగ్ పోటీలను రైల్వే స్పోర్ట్స్ బోర్డు నిర్వహిస్తోందన్నారు. à°ˆ పోటీల్లో ప్రభుత్వ à°°à°‚à°— సంస్థల క్రీడా కారులు సుమారు  600 మంది పాల్గొంటారన్నారు. వివిధ

రాష్ట్రాలు, సర్వీసెస్, ఫుడ్ కార్పొరేషన్, తదితర విభాగాల నుంచి మొత్తం 29 జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఇంతవరకు అర్జున అవార్డు గ్రహీతల్లో 160 మంది రైల్వే

క్రీడాకారులు కావడం గమనార్హమన్నారు. ఎన్నో క్రీడల్లో రైల్వే జట్లు జాతీయ విజేతలుగా నిలిచాయని, వెయిట్ లిఫ్టింగ్ లో సైతం గత ఏడాది పురుషులు, మహిళల విభాగాల్లో 3

విజేతలు రైల్వే జట్టేనన్నారు. బాక్సింగ్, బాస్కెట్ బాల్, క్రికెట్ , వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, తదితర క్రీడాంశాల్లో పటిష్ఠంగా ఉందని తెలియచేసారు. 23  à°ªà°¦à±à°®à°¶à±à°°à±€, 5

 à°°à°¾à°œà±€à°µà± గాంధీ ఖేల్ రత్నపురస్కారాలు సాధించామన్నారు. కామన్ వెల్త్ పోటీల్లో రైల్వే క్రీడాకారులు మొత్తం 10 బంగారు పతకాలు సాధించారని, ఆసియా క్రీడల్లో మొత్తం 27

 à°ªà°¤à°•à°¾à°²à± సాధించిన ఏకైక ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ భారతీయ రైల్వేసేనన్నారు. క్రీడారంగానికి చేస్తున్న కృషి, క్రీడాకారులకు అందిస్తున్న ప్రోత్సాహానికిగాను భారతీయ

రైల్వే కు స్పోర్ట్స్ స్టార్ సంస్థ అందించే స్పోర్ట్స్ అవార్డు కూడా లభించిందని వివరించారు. à°ˆ విలేకరుల సమావేశం లో రైల్వే అధికారులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns

live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #railways  #MS Madhur  #National Weight Lifting Tournament

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam