DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోడ్ వచ్చినా కూడా ఇళ్ల పేరుతొ టిడిపి దోచుకుంటోంది: వంశీకృష్ణ 

ఇళ్లకోసం ఎవ్వరూ దోపిడీ దారులకు డబ్బులు కట్టవద్దు 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 21, 2019 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చినా కూడా ఇళ్ల

పేరుతొ తెలుగుదేశం ప్రజలను పీడించుకుని తింటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గం కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

గురువారం నగరంలోని నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో ఎమ్మెల్సీ కోడ్ అమలు లోకి వచ్చినా కూడా ఎన్నికల

నిబంధనలు తుంగలోకి తొక్కుతూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, విశాఖ తూర్పు నియోజకవర్గం లో ఇళ్ళు కట్టిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గరా రూ. 25 వేల నుంచి 50 వేల  à°µà°°à°•à±‚

డిడిలు వసూలు చేసేశారన్నారు. పైగా దీనికి అదనంగా జన్మభూమి కమిటీలు, ఇతర పార్టీ ప్రతినిధులు ఒక్కొక్కరి దగ్గర భారీ మొత్తం లో ముడుపులు కూడా దోచేశారన్నారు. ఈ

ముడుపులు ఇస్తేనే ఇళ్ల కు దరఖాస్తులకు అంగీకారం తెలిపారని మండిపడ్డారు. ఐదేళ్లుగా కళ్ళుమూసుకుపోయి నిద్రపోయిన చంద్రబాబు అండ్ కో, కేవలం రెండు నెలల్లో కట్టి

ఇచ్చేస్తారంటే ఎవడు నమ్ముతాడు అని ప్రశ్నించారు. 2014 లో జరిగిన హుధుద్ ప్రకృతి ప్రకోపానికి కూలిన ఇళ్లనే ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదని, వీళ్ళ కబుర్లు వినే ఓపిక

తీరిక జనానికి లేవని, ఇక చంద్రబాబు, అతని పచ్చతమ్ముళ్ళు ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. 
రానున్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అని, సామాన్యులు, పేదలకు అండగా నిలబడి,

అందరికీ ఆనందాన్ని కల్గించే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అన్నారు. కనీస నిబంధనలతో ఈ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లను అందించడం జరుగుతుందన్నారు. ఈ

విలేకరుల సమావేశంలో సీనియర్ నేతలు రవిరెడ్డి, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ప్రతినిధులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #viswanadha raju  #YSR congress #Vamsi

krishna srinivas  #Visakha east  #housing  #telugudesam party

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam