DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీణలోని ప్రతీ మెట్టు దైవత్వాన్ని పలికిస్తాయి : వీణ గాయత్రి. . . . 

సంగీతం అంటే ఇష్టం ఉంటె చాలదు రాక్షస సాధన చెయ్యాల్సిందే 

ఎయు సంగీత విభాగం అందరికీ ఆదర్శనంగా నిలుస్తోంది. 

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2019 (DNS Online) : సంగీతం

అంటే కేవలం ఇష్టం ఉన్నంత మాత్రానే ప్రావీణ్యం లభించదని, రాక్షస సాధన చెయ్యాల్సి ఉంటుందని ప్రముఖ వైణికులు, కలైమామణి, యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, తమిళనాడు వైస్

ఛాన్సలర్ డాక్టర్ వీణ గాయత్రి తెలిపారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లోని సంగీత విభాగం ఆధ్వర్యవంలో శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల సదస్సులో ఆమె  
కీలక ప్రసంగం

చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాను 4 ఏళ్ళ వయసు నుంచి వీణ సాధన ఆరంభించానని, తొలి కచేరి 8 వ ఏటా చేయడం జరిగిందన్నారు. అప్పట్లో తనకు వీణ అంటే ఏంటో కూడా తెలియదని,

కేవలం వీణపై సాధన చెయ్యడం మాత్రమే తెలుసన్నారు. ప్రస్తుతం తనకు 60 ఏళ్ళ ప్రాయం వచ్చిందని, గత 54 ఏళ్లుగా వీణ సాధన చేస్తున్నప్పటికీ, నేటికీ సాధన చెయ్యవలసిందేనన్నారు.

వీణ తనలో భాగంగా మారిపోయిందన్నారు. సాధన చెయ్యని రోజున ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని ఉద్వేగ పూరితంగా తెలిపారు. తదుపరి కాలం లో వీణ తయారీ లో వినియోగించే పనస

చెక్క, ఒక్కో విధానం తెలుసుకున్నానన్నారు. సాధారణంగా చెట్లకు జీవం ఉంటుందని తెలుసు కానీ, చెట్ల నుంచి తెంచిన చెక్కలు కూడా దివ్యత్వాన్ని పలికిస్తాయని ప్రతీ

వీణ చూస్తే తెలుస్తుందన్నారు. ఈ సందర్బంగా తనకు ఎదురైనా అత్యద్భుత సంఘటన వివరించారు. ఒక ఆలయంలో సంగీత కచేరి చేసేందుకు వెళ్లిన సమయంలో తనకు ఇచ్చిన వసతి గృహంలో

రాత్రి నిద్రిస్తున్న తరుణంలో ఒక యువతి తన ప్రక్కనే కూర్చుని రోధిస్తున్నట్టుగా కనిపించిందని, ఆమె వంటి పై పూర్తిగా కాల్చిన గాయాలు కనిపించాయన్నారు. మెలకువ

వచ్చి చూస్తే ప్రక్కనే వున్నా టేబుల్ పై కాలిన గాయాలు ఉన్నాయన్నారు. ఆ చెక్క పడుతున్న ఆవేదన ఒక లీలగా తెలియచేసిందన్నారు. అప్పుడే జీవించిన చెట్లే కాకుండా జీవం

కోల్పోయిన కొయ్య కూడా జీవంతో స్పందిస్తుందని తనకు తెలిసిందన్నారు. 
 
ఏ విద్యలోనైనా ప్రావీణ్యత సాధించాలంటే సాధారణ సాధన చాలదని, రాక్షస సాధన చెయ్యడం వల్ల

మాత్రమే ఆశించిన ఫలితాలు లభిస్తాయన్నారు. నిద్రలో సైతం తమ లక్ష్యాన్ని మాత్రమే ఆలోచించాలన్నారు. 

ఎయు సంగీత విభాగం పనితీరు అద్భుతం :

దేశంలో ఎన్నో

విద్య సంస్థలు దర్శించడం జరిగిందని, ఒక విద్య వ్యవస్థకు ఉపకులపతిగా ఉన్నప్పటికీ, ఎక్కడా లేని విధంగా ఒక నిబద్దతతో అధ్యాపక, విద్యార్థుల సమన్వయము, నిర్వహణ ఆంధ్ర

విశ్వ కళాపరిషత్ సంగీత విభాగం నిర్వహణ అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాలయంలోకి తాను ప్రవేశించడం అదృష్టంగా

భావిస్తున్నట్టు తెలిపారు. 

అంతకు ముందు రామవరపు విజయలక్ష్మి ట్రస్ట్ సంచాలకులు డాక్టర్ ఆర్. మాధురీదేవి ఆధ్వర్యవం లో జరిగిన ఈ సదస్సు లో ఈమని (వీణ ) గాయత్రిని

విజయ విపంచి బిరుదు తో సత్కరించారు. 

ఈ సదస్సులో ఎయు వీసీ డాక్టర్ జి. నాగేశ్వర రావు, జిఎంఆర్ ట్రస్ట్ ఛాన్సలర్ డాక్టర్ బీల సత్యనారాయణ, ఎయు ఆర్ట్స్ కళాశాల

ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ మోహన్ రావు, ఎయు సంగీత విభాగపు విభాగాధిపతి డాక్టర్ సరస్వతి విద్యార్థి, డాక్టర్ రామవరపు మాధురి దేవి, ఎయు అధ్యాపకులు, పరిశోధకులు,

విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #andhra unviersity  #veena  #gayatri  #music department  #vice chancellor

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam