DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేడు నగరానికి రానున్న చిన్న జీయర్ స్వామి 

25 à°¨ ఉదయం తీర్ధ గోష్ఠి, భక్తుల ఇష్టాగోష్టి 

విశాఖపట్నం, ఫిబ్రవరి 23, 2019 (DNS Online) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపర భగవద్రామానుజులుగా ఖ్యాతి గాంచిన శ్రీమదుభయ వేదాంత

ఆచార్య పీఠాధిపతులు à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ చిన్న జీయర్ స్వామి ఆదివారం సాయంత్రం నగరానికి రానున్నారు. నగరం లోని సీతమ్మధార డాక్టర్స్ కోలనీలోగా శిరీష హోమ్స్ లో బస

చేయనున్నారు. సోమవారం (ఫిబ్రవరి 25 న) ఉదయం 8 గంటల నుంచి తీర్ధ గోష్ఠి జరుగనుంది. అనంతరం నగరంలోని భక్తులతో సమావేశం నిర్వహించన్నారు. జీయర్ ఆశ్రమ ప్రధాన కేంద్రం

శంషాబాద్ ( హైదరాబాద్) లో నిర్మాణం జరుగుతున్న 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహ ప్రతిష్ట ( సమతా మూర్తి) , అక్కడే నిర్మాణం కావిస్తున్న 108 శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాల

ఆలయాల వైభవం తదితర అంశాలను భక్తులకు వివరించనున్నారు. త్వరలో జరుగనున్న ఈ సమతా మూర్తి ఆవిష్కరణ కు విశాఖ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి

అనుగ్రహం పొందాలని ఆహ్వానించనున్నారు. జీయర్ స్వామి ఆధ్వర్యం లో వేద విద్యాలయాలు, నేత్ర విద్యాలయాలు, జీయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) మల్టి

స్పెషలిటీ ఆసుపత్రి తదితర సంస్థలన్నీ పూర్తిగా స్వచ్చంద సేవాభావంలోనే అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. విశాఖ లోని సాగర తీరం లో వారిజ ( వేద విద్య

పరిశోధనాలయం ) అందరికీ తెలిసిందే. రామానుజ విగ్రహ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైన స్వామి చాలా కాలం తర్వాత విశాఖ నగరానికి వచ్చి భక్తులతో సమావేశం

నిర్వహించనున్నారు. 
అనంతరం శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి సమీపంలో గల మందస గ్రామంలో వేంచేసిన వాసుదేవ స్వామి ఆలయ దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో

పాల్గొనున్నారు. మందస గ్రామం లో ఈ నెల 22 నుంచి మార్చి 1 వరకూ అత్యంత వైభవంగా భ్రమోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా ఫిబ్రవరి 26 న (మంగళవారం) ఉదయం స్వామి

కల్యాణోత్సవం జరుగనుంది. 


 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #chinna jeeyar swami  #mandasa  #ramanuja  #samata murty  #unity of spirit

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam