DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్ర అభివృద్ధి కి హైపవర్ సలహా కమిటీ ఏర్పాటు

సమీక్ష కమిటీ, పార్టీలకు ఎన్నికల అజెండా విడుదల

ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల 

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2019 (DNS Online) : దేశంలోనే అత్యంత వెనుకబడిన

ప్రాంతాల జాబితాలో ఉత్తరాంధ్ర జిల్లాలు మొట్టమొదటిగా ఉన్నాయని, వాటిని అభివృద్ధి కి తగు సూచనలు చేసేందుకు మేధావులు, విశ్రాంత అధికారులు, విద్యావేత్తలతో ఒక

ఉన్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేసినట్టు ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆదివారం నగరం లోని పౌరగ్రంధాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈ కన్వీనర్ చైర్మన్ గా యూపీఎస్సీ మాజీ సభ్యులు, విద్యావేత్త డాక్టర్ కె ఎస్ చలం భాద్యతలు చేపడుతున్నారని, కమిటీ సభ్యులుగా

విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏ ఎస్ శర్మ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ సహా విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు

చెందిన ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారన్నారు. ఈ కమిటీ మూడు జిల్లాలోనూ ప్రస్తుత పరిస్థితులను కూలంకషంగా అధ్యయనం చేసి, ఒక పూర్తిస్థాయి నివేదిక తయారు

చేస్తుందన్నారు. ఈ నివేదిక ను ప్రతి రాజకీయ పార్టీ వద్దకూ వెళ్లి అందిస్తామని, రానున్న ఎన్నికల్లో తయారు చేసే మేనిఫెస్టో లో ఈ నివేదికలో చేర్చబడిన అంశాలను

చేర్చవలసిందిగా కోరనున్నట్టు తెలిపారు. ఈ కమిటీ త్వరలోనే సమావేశమై తదుపరి కార్యాచరణ చేపడుతుందన్నారు.

చర్చించిన అంశాల్లో ప్రధానమైనవి :

1 . ఉత్తరాంధ్ర

అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలో à°ˆ అంశాలు పొందుపరచాలి. 
2 . నీళ్లు నిధులు, నియామకాల్లో ఉత్తరాంధ్రకు తగిన వాటా కేటాయించాలి.
3 .

ఉత్తరాంధ్ర, రాయలసీమ కు బందెలఖండ్, బోలంగిర్ - కలహంది - కోరాపుట్ తరహా ఆర్ధిక ప్యాకేజి ని కేంద్రం తక్షణం ప్రకటించాలి. 
4 . ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న విధంగా స్వయం

ప్రతిపత్తి గల అభివృద్ధి మండలిని ఉత్తరాంధ్రకు కూడా ప్రకటించాలి.
5 . రాష్ట్ర బడ్జెట్ లో 15 నుంచి 20 శాతం వరకూ నిధులను ఉత్తరాంధ్రకు కేటాయించాలి. 
6 . విద్య, ఉపాధి

తదితర రంగాల్లో స్థానికుల హక్కులను కాపాడాలి. వారికీ తగిన రిజర్వేషన్లు కేటాయించాలి. 
7 . రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి స్థానికులు, స్థానికేతరుల

లెక్కలను తేల్చి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి, విద్యలో ప్రాధాన్యం ఇవ్వాలి.   
8 . విశాఖపట్నం కేంద్రం à°—à°¾ రైల్వే జోన్ ను తక్షనమ్ ఏర్పాటు చెయ్యాలి. 
9 .శ్రీకాకుళం

జిల్లా ఉద్దానం లోని కిడ్నీ బాధితులకు ఆదుకోవాలి.
10 . విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలి. 
11 . హైకోర్టు బెంచ్ ను విశాఖలో ఏర్పాటు చెయ్యాలి. 
/> 12 . ఉత్తరాంధ్ర  à°­à°¾à°· ( యాస) ను పరిరక్షించాలి. 
13 . ఉత్తరాంధ్ర  à°­à°¾à°·à°¨à± కించపరుస్తూ సినిమాల్లోనూ, ఇతర ప్రసార మాధ్యమాల్లోను ప్రసారం చేసే వారిపై à°•à° à°¿à°¨ చర్యలు

తీసుకోవాలి. 
14 . 2012 లో గిరిజనులకు ప్రకటించిన అరకు డిక్లరేషన్ యధాతధంగా అమలు చెయ్యాలి. 
15 . గిరిజన విశ్వ విద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చెయ్యాలి. 
16 . గిరిజనుల వనరులు

కొల్లగొట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి. 
17 . గిరిజనులు రోగాల బారిన పడకుండా వైద్య సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలి.
18 . మత్య్సకారులు అభివృద్ధి పై శ్రద్ధ చూపాలి. వారు

ఉపాధి కోల్పోకుండా అన్ని చర్యలు చేపట్టాలి. 
19 . విమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి.  
20 . విసుఖపట్నం మెట్రో రైలును వెంటనే ప్రారంభించాలి. 
21 .

ఉత్తరాంధ్ర మరో భోపాల్ à°—à°¾ మారకుండా ప్రమాదకర పరిశ్రమలను మూసివేయించి, పర్యావరణాన్ని కాపాడాలి. 
22 . ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి

చెయ్యడానికి సంవత్సరానికి రూ. 5 వేలకోట్లు కేటాయించాలి. 
23 . గోదావరి - మహానది ని అనుసంధానం చెయ్యాలి. న్యాయపరమైన నీటి వాటాను కేటాయించాలి. 
24 . ఉత్తరాంధ్ర లో 24 లక్షల

ఎకరాలకు కనీసం à°’à°• గంటైనా సాగునీరు ఏర్పాటు చెయ్యాలి. 
25 . వంశధార, జంఝావతి, బహుదా, ఉత్తరాంధ్ర లోని ఇతర పెండింగ్ ప్రాజెక్ట్ లు  à°…న్నింటినీ నిర్దుష్ట కాలపరిమితి లో

పూర్తి చెయ్యాలి. 
26 . ఒడిశా తో ఉన్న అన్ని వివాదాలను వెంటనే కేంద్రం పరిష్కరించాలి.
27 . విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ ను వెంటనే ప్రారంభించాలి.      
28 . విశాఖ

పోర్ట్ ట్రస్ట్ కు అనుబంధంగా శాటిలైట్ పోర్టులను భావనపాడు, నక్కపల్లిలో నిర్మించాలి. 
29 . ఆంధ్ర ప్రదేశ్ కు పన్నుల రాయితీ తో కూడిన ప్రత్యేక హోదాను కేంద్రం

ప్రకటించాలి. 
30 . పోలవరం ప్రాజెక్ట్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలి. నిర్వాసితులకు పెద్ద మొత్తం లో నష్టపరిహారం ఇవ్వాలి. 

ఈ విలేకరుల సమావేశం లో లోక్

సత్తా పార్టీ అధ్యక్షులు భీశెట్టి బాబ్జి, రైల్వే కార్మిక సంఘం నాయకులూ చలసాని గాంధీ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp  #Konathala Ramakrishna 

#Uttarandhra Charcha Vedika

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam