DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువత మేధోస్ఫూర్తే దేశానికి భవిష్యత్ : ఎయు వీసీ నాగేశ్వర రావు 

క్రమశిక్షణతో చర్చలు జరిగితే అన్ని సమస్యలకూ పరిష్కారం. 

నేర్చుకోవాల్సిన యువతే చట్ట సభల నిర్వహణ నేర్పిస్తున్నారు. 

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2019 (DNS Online) : అన్ని

రంగాల్లోనూ రాణిస్తున్న యువత మేధో స్ఫూర్తే ఈ అఖండ భారతావనికి భవిష్యత్ అన్ని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం యూత్

ఎంగేజ్ మెంట్ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవా సంస్థల ఆధ్వర్యం లో జరిగిన యూత్ అసెంబ్లీ నమూనా సమావేశాన్ని ఆసక్తికరంగా పరిశీలించారు. సభ నిర్వహణ అనంతరం ఆయన

మాట్లాడుతూ చట్ట సభల్లో జరిగే పనితీరును తెలుసుకోవాల్సిన విద్యార్థులు / యువతే నేడు క్రమశిక్షణ తో సభా కార్యకలాపాలను నిర్వహించి చట్ట సభలోని చాలా మంది సభ్యులకు

సభల్లో మెలగవలసి విధానాన్ని తెలియచేశారన్నారు. చట్ట సభల్లో జరిగే చర్చలు ఈ నమూనా సభలో జరిగినట్టు క్రమశిక్షణ తో జరిగితే అన్ని అపరిష్కృత జటిల సమస్యలకూ తక్షణ

పరిష్కారం లభిస్తాయన్నారు. విద్యార్థులు నిర్వహించిన నమూనా అసెంబ్లీయే కార్యక్రమం ఆసక్తికరంగా చోటుచేసుకుందన్నారు. విద్యార్థులకు ఉన్న క్రమ శిక్షణ, మాట

నేర్పరితనం ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కూడా ఉంటె రాష్ట్ర సమస్యలకు ఒక సానుకూల పరిష్కారం లభించేది అన్నారు. ఈ నమూనా యూత్ అసెంబ్లీ సభలో సభ్యులు చేసిన

ప్రతిపాదనలను ఆయన అభినందించారు. వాటిల్లో ప్రధానమైనవి : 

1.    à°Žà°¨à±à°¨à°¿à°•à°²à°²à±‹ పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను విధించాలి.

2.    18 సంవత్సరాలు వయస్సు కలిగిన

ప్రతి ఒక్కరు కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవడం మరియు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి చేయాలి. నోటా ఐచ్చికాన్ని అన్ని

ఎలక్షన్స్ లో విధిగా ఉపయోగించాలి.

3.    à°†à°¨à± లైన్లో తమ ఓటుహక్కుని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించాలి.

4.    à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీలన్నింటిని సమాచార హక్కు చట్టం

పరిధి లోకి తీసుకు వచ్చి, వాటికి లభించిన నిధులు మరియు విరాళాల వివరాలను బహిర్గతపరచాలి.

5.    à°¨à±‡à°°à°¾à°°à±‹à°ªà°£à°²à± మరియు నేర ప్రవృత్తి కలవారు ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ

చేయకుండా నిషేధం విధించాలి.

6.    à°¸à±à°¥à°¾à°¨à°¿à°• సంస్థల ఎన్నికలలో పోటీ చేయటానికి అర్హతగా విధించిన పరిమిత సంతాన నియమాన్ని ఎత్తివేయాలి.

7.    à°’à°• రాజకీయ పార్టీ

అభ్యర్థిగా గెలుపొందిన అభ్యర్థులు తరువాత పార్టీ మారిన యెడల , 5 సంవత్సరాల వరకు పోటీ చేయకుండా వారిపై నిషేధాన్ని విధించాలి. 
లాంటివి తక్షణం అమలు

చెయ్యవలసినవేనన్నారు. అంతకు ముందు నమూనా అసెంబ్లీ సభ్యులు పలు ఆసక్తికర అంశాలపై చర్చలు చేపట్టారు. 

ఈ సమావేశం లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవా సంస్థల

అధ్యక్షులు ఖాజా రహ్మతుల్లా, యూత్ ఎంగేజ్ మెంట్ కార్యక్రమ రూపకర్త, ప్రచారకర్త మహమ్మద్ బాజీ పాల్గొన్నారు. విశాఖపట్టణం లోని సుమారు 36 కళాశాలల నుండి విద్యార్థులు

 “ఎన్నికలు – సంస్కరణలు” అనే ఆంశం గూర్చి చర్చించారు.

 à°ˆ సమావేశాల్లో అధికార పక్ష ప్రధాన నేత à°—à°¾ మహమ్మద్ బాజి మరియు ప్రతిపక్ష నేతగా మహమ్మద్ షన్మద్, సభాపతిగా

వి.వినొద్ వ్యవహరించారు. 

పలు అంశాలపై ఆసక్తికరంగా ప్రసంగించిన దీప్తి , జమీర్ మంచి వక్తలుగా అవార్డులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్

ప్రాసిక్యుటర్ బర్కత్ అలీఖాన్,  à°®à±Œà°²à°¾à°¨à°¾ అబుల్ కలాం అజాద్ సంస్థ అధ్యక్షులు ఖాజా, బాజీ , సాయికృష్ణ, స్వాతి, మౌనిక, లక్షి మానస పాల్గొన్నారు. 
 

 

#dns   #dns live  #dns media  #dns news  #dnslive 

#dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra unviersity  #alumni  #youth assembly

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam