DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువతకు సత్సంప్రదాయాన్ని అలవాటు చేయాలి : చిన్న జీయర్ 

చిన్నారికి అక్షరాభ్యాసం, యువ వైద్యులకు సూచనలు 

విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2019 (DNS Online) : ప్రస్తుత ఆధునిక సమాజంలో యాంత్రికంగా జీవనం సాగిస్తున్న యువత కు భారతీయ

సంప్రదాయాన్ని తప్పని సరిగా అలవాటు చేయాలనీ శ్రీమదుభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి పిలుపు నిచ్చారు. సోమవారం విశాఖ నగరానికి వచ్చిన

ఆయన సీతమ్మధార లోని డాక్టర్స్ కోలనీ లోని తమ బస వద్ద భక్తులకు తీర్ధ గోష్ఠి అనుగ్రహించారు. ఈ సందర్బంగా ఆయన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. ప్రస్తుత

యువత ఆధునిక జీవనంలో ఎన్నో సమస్యలతో నిత్యం సతమతమవుతూ, సరైన మార్గ దర్శనం లేని దుర్భర పరిస్థితుల్లో దుర్వ్యసనాలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విధమైన

దుస్థితి కలుగకుండా, ప్రపంచ దేశాలకు సైతం సనాతన ధర్మాన్ని అందించిన మన భారతీయ సంప్రదాయ విధానాలను వారికి తెలియచేసి అలవాటు చేయడం వలన మన ధర్మం పట్ల మన కర్తవ్యం

నెరవేర్చినట్టవుతుందన్నారు. తమను నిత్యం ఎందరో యువతి యువకులు దర్శించేందుకు వచ్చి, తాము అనుభవిస్తున్న వ్యధను వ్యక్తం చేస్తుంటారని, వారికి తగిన మార్గదర్శకం

చేస్తుంటామన్నారు. యువతీ యువకులను తీర్చిదిద్దినట్లయితే ఈ దేశం గర్వించదగ్గ పౌరులుగా తయారవుతారన్నారు. ఈ విధమైన బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టేందుకు తమ జీయర్

ఎడ్యుకేషనల్ సంస్థ, వికాస తరంగిణి తదితర స్వచ్చంద సంస్థల ద్వారా స్వచ్చందంగా సేవ అందిస్తున్న వైద్యులు, ఇంజనీర్లు, మానసిక తత్త్వ నిపుణులు క్రమం తప్పకుండా

విద్యా సంస్థలు, ఐటీ కేంద్రాలలో వారానికి à°’à°• రోజు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారని తెలియచేసారు. 

అవయవ దానం లో యువతే ముందంజ  :

భగవంతుడు మానవ జన్మ

ఇచ్చినందుకు అన్ని స్థాయిల్లోనూ సమాజ సేవ చెయ్యాల్సిన భాద్యత ఉందన్నారు. ఈక్రమం లోని తమ జీయర్ ఎడ్యుకేషనల్ సంస్థ, వికాస తరంగిణి తదితర స్వచ్చంద సంస్థల ద్వారా

నేత్ర దానం పై దశాబ్దాల క్రితమే  à°ªà±à°°à°šà°¾à°°à°‚ ఆరంభించామన్నారు. తదుపరి, సమాజ అవసరాల దృష్ట్యా అవయవ దానం పై అవగాహనా పెంపొందించి, ఎన్నో సదస్సులు నిర్వహించి, పెద్ద

సంఖ్యలో ప్రజలచే అవయవ దానం పై ఆమోదాన్ని కూడా పొందడం జరిగిందన్నారు. వీటిల్లో అంగీకార పత్రాలపై సంతకాలు చేసిన వారిలో అధిక శాతం యువతీ యువకులేనన్నారు. వీరందరి

ఉత్సాహం చూసి, వారికి ప్రత్యేక మంగళశాసనములు చేయడం జరిగిందన్నారు. యువతకు మంచి మార్గదర్శకం చేయకపోవడం పెద్దల లోపమే తప్ప, దోషం యువతది కాదన్నారు. 

మహిళా

కోసం ఆరోగ్య సదస్సులు :

ప్రతి ఇల్లు సక్రమం గా నడవాలంటే ఆ ఇంట మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. హైదరాబాద్ లోని తమ జిమ్స్ (జీయర్ ఇస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్)

ద్వారా మహిళలకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం తో పాటు, వారు తరుచుగా ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సుప్రసిద్ధ వైద్యులచే తగు సూచనలు అందించడం జరుగుతోందన్నారు.

నెలకోమారు à°’à°• ప్రాంతం లో à°ˆ మహిళా ఆరోగ్య అవగాహనా సదస్సు ప్రతి జిల్లాలోనూ జరుగుతోందన్నారు. 

తమ సంస్థల ద్వారా జరిగే ఈ కార్యక్రమాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ

లలోని అన్ని జిల్లాలతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యుకె, తదితర విదేశాల్లో సైతం నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. 

వైద్యులకు సూచనలు, చిన్నారికి

అక్షరాభ్యాసం : 

తమను దర్శించడానికి వచ్చిన ఒక యువ వైద్య దంపతుల చిన్నారికి జీయర్ స్వామి అక్షరాభ్యాసం చేసారు. అనంతరం వైద్యులకు తమ సంస్థ నిర్వహించే సేవా

కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. తమ జిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్న  à°µà±ˆà°¦à±à°¯ సేవలను వారికీ తెలియచేసి,  à°µà±ˆà°¦à±à°¯ పరమైన కొన్ని సూచనలు  à°¸à±ˆà°¤à°‚

చేశారు. 

 

 

 

 

#dns  #dns media  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #vizag  #viswanadha raju  #visakhapatnam  #chinna jeeyar swami  #teerdha gosti   #jeeyar  #aksharabhyasam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam