DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్సంప్రదాయానికి మొదటి అస్త్రం వేదాధ్యయనమే : జీయర్ స్వామి 

ఇంటికో బాలుని వేద విద్య అభ్యాసనకు పంపాలి 

శ్రీ వైష్ణవ సంఘానికి చిన్న జీయర్ స్వామి సూచన 

విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2019 (DNS Online) : సనాతన సంప్రదాయానికి మొదటి à°…స్త్రం వేద

అధ్యయనమేనని శ్రీమదుభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. సోమవారం విశాఖ నగరానికి వచ్చిన ఆయన్ను à°¦à°°à±à°¶à°¿à°‚à°šà°¿à°¨ భగవద్రామానుజ

శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం ప్రతినిధులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక, సంప్రదాయ కార్యక్రమాలను అభినందించారు. పూర్తిగా

ఉచితంగా నిర్వహిస్తూ, అందరినీ కలుపుకుంటూ వెళ్లడం అంత సులభం కాదని, ప్రధానంగా యువతను భాగస్వాముల్ని చేయడం ముదావహం అన్నారు. సనాతన ధర్మానికి అలవాటు చెయ్యాలి

అంటే ప్రతి ఇంటా వేదాధ్యయనం జరగాలని, అలా జరగాలంటే ప్రతి ఇంటిలోనూ ఒక బాలున్ని వేద విద్య అభ్యసించేందుకు గురుకులాలను, ఆశ్రమాలకు పంపాలని సూచించారు. ఈ సంఘం తరపున

వేద విద్య అభ్యాస అభివృద్ధికి కృషి చెయ్యాలని, దీనికై ప్రతి ఒక్కరికీ అవగాహనా కల్గించాలని తెలియచేసారు. ఆధునిక విద్య పట్ల పెరుగుతున్న ఆసక్తి కారణంగా యువత

పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్నారని, సత్సంప్రదాయంకు కాస్తంత దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలురకు వేదవిద్య, బాలికలు ఆధ్యాత్మిక చింతన అవసరమని,

వీటిని అలవాటు చేయవలసిన భాద్యత తల్లిదండ్రులదేనన్నారు. ఎనిమిది సంవత్సరాల బాలుడు వేదాధ్యయనంలో ప్రవేశిస్తే. . . విద్య పట్ల ఆసక్తి తో పాటు, నేర్చుకోవాలి అనే

పట్టుదల కూడా పెరిగి సంపూర్ణ సాధన చేయగలదని తెలిపారు. ఇంతవరకూ తమ వద్ద రెండు వేల మంది విద్యార్థులు వేదవిద్యను అభ్యసించారని, వారిలో అధిక శాతం

విద్వత్సంపన్నులుగా తీర్చదిద్దబడ్డారన్నారు. అదే విధంగా ఒక ఇంటి వాతావరణం సనాతన ధర్మం తెలియచేసిన ప్రకారం కొనసాగబడాలి అంటే మహిళలదే ప్రధాన పాత్ర అన్నారు.

వారికి మన సంప్రదాయం పట్ల సంపూర్ణ అవగాహనా ఉన్నట్టయితే ఎటువంటి క్లిష్ట సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించగలరన్నారు. బాలికలకు చిన్న నాటి నుంచి సంప్రదాయం పట్ల

అవగాహనా కల్పించడం ప్రతి తల్లి తండ్రి విద్యుక్త ధర్మం అన్నారు. విశాఖ ప్రాంతంలోనే ఒక సంప్రదాయ పరులైన తల్లిదండ్రులు తమ కుమార్తె కి ఋగ్వేదం నేర్పించడం

జరిగిందన్నారు. స్వామిని దర్శించిన వారిలో సంఘం కార్యదర్శి ఫణిహారం నరసింహాచార్యులు, శాయిరామ్ చిలకమర్రి ,  à°Žà°¸à±. వెంకటాచార్యులు, రామానుజం, గోవిందాచార్యులు

తదితరులున్నారు. 
 

 

 

#dns  #dns media  #dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #vizag  #viswanadha raju  #visakhapatnam  #chinna jeeyar swami  #teerdha gosti   #jeeyar  #aksharabhyasam  #sri vaishnava sangham   #bhavadramanuja

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam