DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత ప్రధాని సభ కు భారీ బందోబస్త్ : సీపీ మహేష్ లడ్డా.

బహిరంగ సభ వేదిక లో భద్రతా ఏర్పాట్లలో ఎస్పీజీ అధికారులు
 
విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2019 (DNS Online) : మార్చి 1 న విశాఖ లో జరుగనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు భారీ

భద్రతా ఏర్పాట్లు చేసినట్టు విశాఖ నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. నగరం లోని న్యూ కొలని లో గల రైల్వే మైదానం లో నిర్వహించే ప్రధాని బహిరంగ సభ వేదిక

వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్ పి జి (ప్రత్యేక భద్రతా విభాగం) వర్గాలతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల తో మాట్లాడుతూ దేశ ప్రధాని అధికారిక హోదా లో

నగరం లో పర్యటించనున్నందున పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లను అమలు చేస్తున్నట్టు తెలిపారు. సభ ప్రాంగణం లో పూర్తి స్థాయిలో ఎస్పీజీ, పోలీసు బలగాలు

పర్యవేక్షిస్తారని తెలిపారు. చుట్టుప్రక్కల భవనాల్లోని నివాసితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సభ ప్రాంగణానికి ఆ రోజు సాయంత్రం 6 :30 గంటలకు ప్రధాని

నరేంద్ర మోడీ చేరుకుంటారని, తదుపరి సభా కార్యక్రమం రాత్రి 7 గంటలకు మొదలై  8 గంటలతో ముగుస్తుందని తెలిపారు. సభ జరుగుతున్న సమయంలో నగర వాసులకు ఇబ్బంది లేకుండా

ట్రాఫిక్ ను మళ్లించడం జరుగుతుందన్నారు. అదే విధంగా సమీపంలోని రైల్వే కర్మాగారం లోని విధులు సైతం యధావిధిగా కొనసాగుతాయన్నారు. సభ కోసం చేపట్టవలసిన భద్రతా

ఏర్పాట్లను ఎస్పీజీ వర్గాల సూచనల మేరకు చేయడం జరుగుతుందన్నారు. మొబైల్ జామర్లు నిబంధనల మేరకే ఉంటాయన్నారు. ఈ పర్యవేక్షణలో ఎస్పీజీ ఐజి గోయల్, జిల్లా కలెక్టర్

కాటంనేని భాస్కర్, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పక్ష బీజేపీ నేత పి విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్,   ఇతర ప్రభుత్వ అధికారులు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో

పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్ మైదానం లో అన్నిప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #bjp #narendra modi  #district collector  #police commissioner  #mahesh chandra ladda  #k bhaskar  #SPG  #prime minister   #MLC   #PVN Madhav 

 #MLA  #Vishnu Kumar Raju

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam