DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్జికల్ స్ట్రైక్ చేసిన 12 మంది భారత వాయుసేన హీరోలు వీరే. . .

కేవలం 21 నిమిషాలు. . . . 12 మంది పైలట్లు. . . 
 
విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2019 (DNS Online) : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ పుల్వామా లో జరిపిన ఘటన లో అమరులైన భారత సైనికులకు సరైన

నివాళి అర్పించిన 12 మంది భారత వాయుసేన హీరోలను దేశం మొత్తం కొనియాడుతోంది. మంగళవారం ప్రపంచం అంతా నిద్రిస్తున్న వేళ, నిశీధిని చేధించుకుని వీరు చేసిన ప్రయాణం

భారత దేశ పౌరుల్లో ఉత్సాహాన్ని కల్గిస్తుంది అనే విషయం వారు కూడా ఊహించి ఉండరు. అయితే, తమ లక్ష్యం కేవలం శత్రు ఉగ్రమూకలను మట్టుపెట్టడమే దీన్నేలక్ష్య సాధనగా

బయలు దేరినప్పుడు కేవలం అతి కొద్దీ మందికే ఈ ఆపరేషన్ గురించి తెలిసి ఉంటుంది. ఆ సమయంలో వీరు పడిన అంతర్మధనం వర్ణనాతీతం. వీరు తమ లక్ష్యాన్ని ఛేదించేందుకు

ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమర రంగంలోకి రెట్టించిన ఉత్సాహంతో ఉరికారు. మంగళవారం వీరు సాధించిన విజయం భారత దేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా

నిలిచిపోతుంది. భారత దేశంలోని ఒక్క సైనిక విభాగం వాయుసేన లోని 12 మంది కేవలం 21 నిముషాలు సమయం మాత్రమే పాకిస్తాన్ పై దృష్టి పెడితేనే ఉగ్రవాద సంస్థ అత్యంత దుర్బేధ్య

శిబిరాలను మటుమాయం చేశారు. అలాంటిది భారత సైన్యం పూర్తిగా à°ˆ పాకిస్తాన్ పై దృష్టి సారిస్తే. . . . 
భారత సైన్యానికి పూర్తి స్థాయి అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ,

రక్షణ శాఖా మంత్రి నిర్మలాసీతారామన్, వీరికి సరైన సమయంలో అత్యద్భుతమైన సలహాలు ఇచ్చిన ప్రధాన మంత్రి రక్షణ విభాగ సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖా ముఖ్య

కార్యదర్శి, త్రిదళాధిపతులు, వారి సిబ్బంది అందరూ పడిన కష్టానికి సత్ఫాలితాన్ని అందించిన ఈ 12 మంది వాయు సైనికులు సర్వత్రా అభినందనలు అందుకోడానికి సంపూర్ణ

అర్హులు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #mirage 2000    #IAF  #attack on Terrorists  #kashmir  #12 member pilots

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam