DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ ప్రకటనపై బీజేపీ వర్గాలు సంబరాలు 

ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి మోడీ, : కన్నా . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2019 (DNS Online) : ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని, విశాఖ కేంద్రంగా

రైల్వే జోన్ ఇస్తామని 2014 లో అయన ఇచ్చిన మాటను నేడు ఆచరణలో చూపించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా

రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన క్షణం నుంచే భారతీయ జనతా పార్టీ వర్గాల్లో ఆనందోత్సవాలు పెల్లుబికుతున్నాయి.

బుధవారం రాత్రి 7 :45 నిమిషాలకు కేంద్ర మంత్రి ప్రకటించడంతో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వం లోని  à°¬à±€à°œà±‡à°ªà±€ వర్గాలు కేవలం 15 నిమిషాల్లోనే

విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకొని బాణాసంచా కాల్చి సంబరాలు మొదలుపెట్టారు. అనంతరం పార్టీ సభ్యులు అందరికీ మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మహిళా

మోర్చా ఇంచార్జి, మాజీ కేంద్ర మంత్రి (మాజీ విశాఖ ఎంపీ) దగ్గుబాటి పురందేశ్వరి, విశాఖ ఎంపీ డాక్టర్ కె. హరిబాబు, విశాఖ ఎమ్మెల్యే పివిష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ

పివిఎన్ మాధవ్, సోము వీర్రాజులు, రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో

కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా కన్నా మాట్లాడుతూ 2014 లో నరేంద్ర మోడీ విశాఖ బహిరంగ సభలో రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పడుతుందన్నారని, ఇప్పుడు ఆచరణలో

పెట్టి చూపించారన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ కి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా లకు ఆయన ధన్యవాదాలు

తెలియచేసారు.  

కుట్ర లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ : పురందేశ్వరి 

ఈ దేశం లో ఎలాంటి కుట్రలైన చెయ్యడానికి కేరాఫ్ అడ్రెస్ కాంగ్రెస్ పార్టీయేనని ఈ

రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి నిజమైందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అడ్డగోలుగా ఆంధ్ర ప్రదేశ్ ని విభజించినప్పుడు అధికారం లో ఉన్నది

కాంగ్రెస్ పార్టీయేనని, అప్పుడే ఈ విభజన బిల్లు లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తున్నాం అని ప్రకటించగలిగి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా

నాటకాలాడారన్నారు. బిల్లు లో కేవలం ఆరు నెలల లోగా జోన్ పై పరిశీలనా చెయ్యమని మాత్రమే రాసారాన్నరు. దీని కారణంగానే బీజేపీ ప్రభుత్వానికి అనేక అడ్డంకులు వచ్చాయని,

వాటిని అధిగమించేసరికి ఐదేళ్ల కాలం పట్టిందన్నారు. 

పదవిలో ఉండగానే వస్తుందని చెప్పా : ఎంపీ హరిబాబు
విశాఖ రైల్వే జోన్ నా పదవి కాలం ముగియక ముందే వస్తుంది

అని ఎన్నో సార్లు చెప్పామని, విశాఖపట్నం ఎంపీ డాక్టర్ కె. హరిబాబు తెలిపారు. ఇంకా మరో రెండు నెలల కాలం పదవి సమయం ఉందన్నారు. తానూ విశాఖ ప్రజలకు ఇచ్చిన మాటను

నిలబెట్టుకున్నట్టు తెలియచేసారు. 

 

 

#dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #dns live  #dns  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #Haribabu  #Vishnukumar Raju  #Somu Veerraaju  #PVN Madhav  #Daggubati Purandeshwari  #Thota Vijaya Lakshmi  #Railway Zone   #Narendra Modi  #Piyush Goyal

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam